Challenges to AP Govt : చంద్రబాబుకి 8 సవాళ్ళు
ఆంధ్రప్రదేశ్ జనం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి పట్టం కట్టారు. సంక్షేమానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ... వైసీపీ ప్రభుత్వాన్ని 11 సీట్లకే పరిమితం చేశారు. నవ్యాంధ్రకు మరోసారి సీఎం కాబోతున్న చంద్రబాబు నాయుడిపై జనం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన ముందున్న చాలా సవాళ్ళు ఉన్నాయి. రాష్ట్రం విడిపోయినప్పుడు కొన్ని రకాల సమస్యలను ఏపీ ఫేస్ చేయాల్సి వస్తే... ఇప్పుడు అంతకంటే ఘోరమైన పరిస్థితి ఏపీలో ఉంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఈ సవాళ్ళను ఎలా ఎదుర్కొంటారు. ? అసలు ఏపీ ముందున్న ఛాలెంజెస్ ఏంటో చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ జనం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి పట్టం కట్టారు. సంక్షేమానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా … వైసీపీ ప్రభుత్వాన్ని 11 సీట్లకే పరిమితం చేశారు. నవ్యాంధ్రకు మరోసారి సీఎం కాబోతున్న చంద్రబాబు నాయుడిపై జనం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన ముందున్న చాలా సవాళ్ళు ఉన్నాయి. రాష్ట్రం విడిపోయినప్పుడు కొన్ని రకాల సమస్యలను ఏపీ ఫేస్ చేయాల్సి వస్తే… ఇప్పుడు అంతకంటే ఘోరమైన పరిస్థితి ఏపీలో ఉంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఈ సవాళ్ళను ఎలా ఎదుర్కొంటారు. ? అసలు ఏపీ ముందున్న ఛాలెంజెస్ ఏంటో చూద్దాం.
కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు ముందు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలకు మంత్రి పదవులపై మొదటి సమస్య ఎదురయ్యే అవకాశముంది. టీడీపీలో చాలామంది సీనియర్లు గెలిచారు. వాళ్ళని సంతృప్తి పరుస్తూనే… మిత్రపక్షాలైన జనసేన, బీజేపీకీ న్యాయం చేయాలి. అలాగే మిత్రపక్షాల కోసం తమ పదవులు త్యాగం చేసిన సీనియర్లనూ బుజ్జగించాలి. వాళ్ళకి సముచిత ప్రాధాన్యత కల్పించాలి.
కూటమి ప్రభుత్వంలో మూడు పార్టీలు భాగస్వామిగా ఉంటాయి. ఈ మూడింటినీ సమన్వయం చేసుకోవడం చంద్రబాబుకి కత్తి మీద సాముగా మారనుంది. ఎవరికి వారే అన్నరీతిలో కాకుండా… మూడు పార్టీల నేతలూ ఒకే లక్ష్యంతో పనిచేయాలి. వీళ్ళని సమన్వయం చేయడంలో చంద్రబాబు, పవన్ ఎలా వ్యవహరిస్తారన్నది పెద్ద సవాల్ గా మారనుంది.
కూటమి ప్రభుత్వం ముందున్న మూడో సవాల్ … రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఇప్పటి దాకా ఏపీని అప్పులు వెంటాడుతున్నారు. అప్పులు చేసి సంక్షేమ పథకాలను అమలు చేసింది జగన్ ప్రభుత్వం. చంద్ర బాబు కూడా సూపర్ సిక్స్ పేరుతో భారీగా హామీలిచ్చారు. కొత్త ప్రభుత్వం వీటికి నిధులను కేటాయిస్తూనే… అభివృద్ధిపైనా దృష్టి పెట్టాలి. అందుకోసం చంద్రబాబు కేంద్రం నుంచి నిధులు ఎలా తెస్తారు. బయటి నుంచి అప్పులు ఎలా పుట్టిస్తారు అన్నది ఏపీ ప్రజలు గమనిస్తున్నారు. ఎన్నికల్లో ప్రతి హామీ నిలబెట్టుకునే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది.
అమరావతి రాజధానిగా చేయడం నాలుగో సవాల్…. ఏపీలో 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు అమరావతిని రాజధానిగా ప్రకటించింది. కానీ ఐదేళ్ళల్లో కేపిటల్ ని నిర్మించుకోలేని దుస్థితి. చంద్రబాబు ప్రభుత్వం తాత్కాలిక నిర్మాణాలతోనే కాలం వెళ్ళదీస్తే… మూడు రాజధానుల పేరుతో జగన్ మరింత గందరగోళం సృష్టించారు. మొన్నటిదాకా ఉన్న హైదరాబాద్ ఉమ్మడి రాజధాని హోదా కూడా పోయింది. రాబోయే ఐదేళ్ళల్లో అమరావతిని మళ్ళీ రాజధానిగా నిలబెట్టాల్సిన బాధ్యత బాబుపై ఉంది. అలాగే ఐదేళ్ళుగా నష్టపోయిన అమరావతి రైతులను కూడా ఆదుకోవాలి.
ఏపీలో మొన్నటి దాకా జరిగిన రాజకీయాలతో… పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది ముందుకు రాలేదు. ఉన్నవాళ్ళు కూడా పొరుగున ఉన్న తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు తన విజన్ తో పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, ఐటీ కంపెనీలను ఏపీకి తీసుకురావాలి. రాష్ట్రంలోఉద్యోగ అవకాశాల్లేక చాలా మంది యువత వలసపోయే పరిస్థితి ఉంది. ఇన్వెస్టర్లకు నమ్మకం కల్పిస్తూనే… యువతకు భారీగా ఉద్యోగాలను కల్పించడం కూటమి ప్రభుత్వంపై ఉన్న పెద్ద బాధ్యత.
ఇక ఆరో సవాల్ చూస్తే…
కేంద్రంతో సఖ్యత… ఏపీ ప్రభుత్వం నడవాలంటే నిధులు తప్పనిసరి. అందుకోసం ఏపీకి ప్రత్యేక హోదా లేదంటే అంతకు మించిన ప్రయోజనాలను బాబు కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టాలి. ఎన్డీఏ మిత్రపక్షాల్లో టీడీపీ మద్దతు చాలా కీలకం. అందుకే ఆ పరపతిని ఏపీ అభివృద్ధికి ఉపయోగించుకోవాలి. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయించడం లాంటి పనులకు కేంద్రం సహకారం చాలా అవసరం. అందుకు చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్ ఎలాంటి వ్యూహం అనుసరిస్తారన్నది చూడాలి.
ఏపీలో కూటమి ప్రభుత్వం ముందున్న ఏడో సవాల్ ఏంటంటే…
జగన్ హయాంలో భ్రష్టుపట్టించిన వ్యవస్థలను గాడిలో పెట్టాలి. అన్ని శాఖల్ని సమూలంగా ప్రక్షాళన చేయాలి. జగన్ ప్రభుత్వ హయాంలో మంత్రులపై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు వచ్చాయి. వాటిపై విచారణ జరిపించాలి. ప్రజా ధనం దుర్వినియోగం అయితే రాబట్టే ప్రయత్నం చేయాలి. వైసీపీ ప్రభుత్వం తాకట్టు పెట్టిన ప్రభుత్వ ఆస్తులు గుర్తించి వాటిని తిరిగి రాబట్టుకోవాలి.
వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో టీడీపీ, జనసేన నేతలు ఎందరో జైళ్ళకు వెళ్ళారు. నరకయాతన అనుభవించారు. వాళ్ళందరికీ ఉపశమనం కలిగించే చర్యలను కూటమి ప్రభుత్వం తీసుకోవాలి. అందుకోసం నారా లోకేశ్ ప్రతిపాదించిన రెడ్ బుక్ ను బయటకు తీస్తారా… వైసీపీకి చెంచాగిరి చేసిన పోలీస్ అధికారులను ఏం చేస్తారన్నది చూడాలి.
గతంలో మేనిఫెస్టోలో చెప్పిన పనుల్లో చాలామటుకు నెరవేర్చలేదని టీడీపీపై విమర్శలు ఉన్నాయి. ఈసారైనా సూపర్ సిక్స్, మేనిఫెస్టోలో హామీలను చంద్రబాబు, పవన్ కల్యాణ్ నెరవేర్చాల్సి ఉంటుంది.