Chandra Babu as AP CM: దటీజ్ చంద్రబాబు…. సీఎం కుర్చీలో నాలుగోసారి !

బాబు ఈజ్ బ్యాక్! ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతుక్కున్నారు! ఎక్కడ అవమానం పాలయ్యారో అక్కడే అధికారం సంపాదించుకున్నారు. ముఖ్యమంత్రి పదవి ఆయనకు కొత్త కాదు. మూడు సార్లు సీఎంగా పనిచేశారు. ఆ మాటకొస్తే తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఉన్నది కూడా బాబే! రాబోయే ఐదేళ్లు కలుపుకుంటే సీఎంగా ఆయన 19 ఇయర్స్‌ ఇండస్ట్రీ!

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 5, 2024 | 04:16 PMLast Updated on: Jun 05, 2024 | 4:16 PM

Chandra Babu As Ap Cm

బాబు ఈజ్ బ్యాక్! ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతుక్కున్నారు! ఎక్కడ అవమానం పాలయ్యారో అక్కడే అధికారం సంపాదించుకున్నారు. ముఖ్యమంత్రి పదవి ఆయనకు కొత్త కాదు. మూడు సార్లు సీఎంగా పనిచేశారు. ఆ మాటకొస్తే తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఉన్నది కూడా బాబే! రాబోయే ఐదేళ్లు కలుపుకుంటే సీఎంగా ఆయన 19 ఇయర్స్‌ ఇండస్ట్రీ!

చంద్రబాబు! ఇప్పుడొక పడిలేచిన కెరటం! దేశ రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన నేత. 1995లో మొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబు… అనతి కాలంలోనే దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. 1996 లోక్‌సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగింది. ఆ సమయంలో చంద్రబాబు కింగ్‌ మేకర్‌గా మారారు. అప్పట్లో కాంగ్రెసేతర పార్టీలను కూడగట్టి, థర్డ్ ఫ్రంట్​ నెలకొల్పిన ఘనత ఆయనదే. థర్డ్ ఫ్రంట్​ జాతీయ కన్వీనర్‌గా వామపక్షాలు, ఇతర ప్రాంతీయ పార్టీలను ఐక్యంగా ఉంచడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు.
1999 ఎన్నికల్లో ఎన్డీయే కూటమితో జతకట్టి 192 సీట్లను కొల్లగొట్టి రెండోసారి సీఎం అయ్యారు చంద్రబాబు. ఆ ఎన్నికల్లో టీడీపీ సొంతంగా 180 స్థానాలను గెలుచుకుంది. మిత్రపక్షం బీజేపీ 12 స్థానాల్లో విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 91 స్థానాలు మాత్రమే గెలిచింది. ఈసారి ఐదేళ్లు పూర్తిగా పాలించిన చంద్రబాబు.. 9 తొమ్మిదేళ్ల సీఎంగా పేరు సంపాదించారు. కాసు బ్రహ్మానందరెడ్డి తర్వాత అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబే. కాసు బ్రహ్మానందరెడ్డి ఎనిమిదేళ్ల పాటు సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత 2004 ఎన్నికల్లో ఎన్డీయే పక్షంలో ఉన్న టీడీపీ ఓడిపోయింది. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం 47 స్థానాల్లో మాత్రమే గెలిచింది. బీజేపీకి రెండు సీట్లొచ్చాయి. 2004లో యూపీయే కూటమికి 226 సీట్లొచ్చాయి. తర్వాత 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా రాగా.. టీడీపీ మహాకూటమితో జతకట్టి ఎన్నికల బరిలో దిగింది. ఆ సమరంలో 156 సీట్లతో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చింది. మహాకూటమికి 107సీట్లు వచ్చాయి. ఇందులో టీడీపీకి సొంతంగా వచ్చిన సీట్లు 92.
2014లో రాష్ట్రం విడిపోయాక చంద్రబాబు ఏపీకి సీఎం అయ్యారు. అప్పుడు ఎన్డీయేతో జతకట్టిన టీడీపీ 126 స్థానాల్లో గెలిచింది. ఆ ఎన్నికల్లో తెలుగుదేశానికి సొంతంగా 117 సీట్లురాగా.. బీజేపీకి 9 స్థానాలొచ్చాయి. ఈ ఐదేళ్లతో కలిపి 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పాలించి చంద్రబాబు రికార్డు సృష్టించారు. తర్వాత 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన టీడీపీ 23 స్థానాలతో సరిపెట్టుకుని ప్రతిపక్ష పాత్ర పోషించింది. మళ్లీ 2024 ఎన్నికల్లో ఎన్డీయేతో జతకట్టి విజయబావుటా ఎగురవేశారు చంద్రబాబు. ఈ ఐదేళ్లను కలుపుకుంటే 19 ఏళ్లపాటు చంద్రబాబు సీఎంగా ఉన్నట్టు లెక్క. ఉమ్మడి రాష్ట్రంలో నీలం సంజీవరెడ్డి మొదలుకుని నల్లారి కిరణ్ కుమార్ వరకూ ఎవ్వరు కూడా ఇంత సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేయలేదు.
ఏపీ- తెలంగాణ విడిపోయాక తెలంగాణకు రెండు టర్ములు కేసీఆర్‌ సీఎంగా ఉన్నారు. మొదటిదఫా ఒక ఏడాది ముందే బీఆర్‌ఎస్ ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. అవి నాలుగేళ్లు.. రెండోసారి ఐదేళ్లు. మొత్తం కేసీఆర్ సీఎంగా ఉన్న టైం 9 ఏళ్లు. కానీ బాబు నాలుగోసారి సీఎం పదవి చేపట్టి రికార్డు సృష్టించబోతున్నారు.