బ్రేకింగ్: రివర్స్ టెండరింగ్, రేషన్ వాహనాలు రద్దు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... గతంలో తీసుకున్న రివర్స్ టెండరింగ్ నిర్ణయాన్ని రద్దు చేయనుంది. జగన్ సర్కార్... సాగునీటి ప్రాజెక్ట్ లలో ఖర్చు తగ్గించే పేరుతో వైసీపీ నేతలకు లేదా తమకు అనుకూలంగా ఉండేవారికి కాంట్రాక్ట్ లు ఇచ్చే యోచనలో భాగంగా రివర్స్ టెండరింగ్ ను తీసుకు వచ్చింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 28, 2024 | 11:42 AMLast Updated on: Aug 28, 2024 | 11:42 AM

Chandrababu Key Decisions Over Reverse Tendering And Ration Vehicles

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… గతంలో తీసుకున్న రివర్స్ టెండరింగ్ నిర్ణయాన్ని రద్దు చేయనుంది. జగన్ సర్కార్… సాగునీటి ప్రాజెక్ట్ లలో ఖర్చు తగ్గించే పేరుతో వైసీపీ నేతలకు లేదా తమకు అనుకూలంగా ఉండేవారికి కాంట్రాక్ట్ లు ఇచ్చే యోచనలో భాగంగా రివర్స్ టెండరింగ్ ను తీసుకు వచ్చింది. ఇప్పుడు దాన్ని రద్దు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. నేడు కేబినేట్ సమావేశం జరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని ఈ సమావేశంలో రద్దు చేయనున్నారు.

ఆ స్థానంలో గతంలో అమల్లో ఉన్న సాంప్రదాయ టెండరింగ్ పద్ధతిని పునరుద్ధరించే అవకాశాలను పరిశీలిస్తారు. అదే విధంగా సాగునీటి సంఘాల ఎన్నికలకు క్యాబినెట్ ఆమోదముద్ర వేయనుంది. ఇక కీలకమైన పోలవరం ఎడమ ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 6000 క్యూసెక్ ల సామర్థ్యం పెంపు ప్రతిపాదన పైనా సమావేశంలో మంత్రి వర్గం చర్చించనుంది. గతం లో ఇచ్చిన టెండర్ నిబంధనలకు అనుగుణంగా పనులకు అనుమతి ఇవ్వనుంది కేబినేట్.

అలాగే మరో కీలక నిర్ణయం తీసుకొంది. ఎక్సైజ్, గ్రామ- వార్డు సచివాలయాల పునర్వ్యస్థీకరణ వంటి అంశాలపై కేబినెట్ లో చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎక్సైజ్ శాఖ పునర్వ్యస్థీకరణకు కెబినెట్ ఆమోదం తెలపనుంది. రాష్ట్రంలో రేషన్ మాఫియా పైన క్యాబినెట్లో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. రేషన్ మాఫియా కు అవకాశం కల్పిస్తున్న ఎండియు వాహనాల రద్దు అంశం పైన కూడా ఈ కేబినేట్ లో చర్చిస్తారు.