Chandrababu Naidu: ఊరట దక్కేనా.. స్కిల్ స్కాం కేసులో సుప్రీం కీలక తీర్పు.. జనవరి 16న ఏం జరగబోతోంది!
అత్యంత క్లిష్టంగా మారిన సెక్షన్ 17ఏ విషయంలో ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు.. గతేడాది అక్టోబర్‌లో తుది విచారణ ముగించి తీర్పు రిజర్వ్ చేసింది. ఆ తీర్పును జనవరి 16న చెప్తామంటూ కోర్టు ప్రకటించింది.
Chandrababu Naidu: ఏపీ రాజకీయాల్లో అత్యంత చర్చనీయాంశంగా మారిన స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసుకు సంబంధించిన తీర్పును ఈ జనవరి 16న వెలువరిస్తామంటూ నిర్ణయించింది. ఈ కేసులో ముందు నుంచీ చర్చనీయాంశంగా ఉన్న విషయం.. సెక్షన్ 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందా లేదా అని. గవర్నర్ అనుమతి లేకుండానే చంద్రబాబును అరెస్ట్ చేశారని.. ఇది సెక్షన్ 17ఏకు విరుద్ధమంటూ చంద్రబాబు తరఫు లాయర్లు వాదించారు.
PAWAN KALYAN: రెండేళ్లు సీఎంగా పవన్.. టీడీపీ, జనసేనతోనే బీజేపీ.. హరిరామ జోగయ్య సంచలనం..
కానీ చంద్రబాబు కేసులో సెక్షన్ 17ఏ వర్తించబోదంటూ సీఐడీ తరఫు న్యాయవాదులు వాదించారు. ఇదే విషయంలో అటు విజయవాడ ఏసీబీ కోర్టులో, ఏపీ హైకోర్టులో కూడా వాదోపవాదాలు జరిగాయి. చివరికి ఈ వ్యవహారం కాస్తా సుప్రీం కోర్టుకు చేరింది. జస్టిస్ బేలా త్రివివేది, అనిరుద్ధ బోస్ ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఒక రకంగా ఈ పిటిషన్ విషయంలో చాలా రోజుల పాటు హైడ్రామా నడిచింది. సింపుల్‌గా చెప్పాలంటే సెక్షన్ 17ఏ మీదే కేసు మొత్తం బేస్ అయ్యింది. అత్యంత క్లిష్టంగా మారిన సెక్షన్ 17ఏ విషయంలో ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు.. గతేడాది అక్టోబర్‌లో తుది విచారణ ముగించి తీర్పు రిజర్వ్ చేసింది. ఆ తీర్పును జనవరి 16న చెప్తామంటూ కోర్టు ప్రకటించింది. ఒకవేళ చంద్రబాబు తరఫు లాయర్లతో కోర్టు ఏకీభవిస్తే చంద్రబాబుపై నమోదైన ఎఫ్ఆర్ రద్దవుతుంది. ఇదే జరిగితే స్కిల్ కేసులో చంద్రబాబు అసలు దోషిగా పరిగణించబడరు.
ఇది ఏసీ సీఐడీకి దిమ్మతిరిగే షాకవుతుంది. కానీ సీఐడీ లాయర్ల వాదనతో సుప్రీం ఏకిభవిస్తే బెయిల్ గడువు ముగిసిన వెంటనే చంద్రబాబు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ కేసులో 50కి పైగా రోజులు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు చంద్రబాబు. ప్రతస్తుం బెయిల్ మీద బయటికి వచ్చారు. ఇప్పుడు సుప్రీం నుంచి వచ్చే తీర్పే అత్యంత కీలకం కాబోతోంది. దీంతో అందరి దృష్టి ఇప్పుడు సుప్రీం తీర్పు మీదే ఉంది. మరి జనవరి 16న సుప్రీం నుంచి ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలి.