Chandrababu : పెన్షన్ పంపిణీ చేయనున్న చంద్రబాబు.. ఇండియాలోనే ఫస్ట్ సీఎం.. సూపర్ సార్..
మొత్తం పొలిటికల్ కెరీర్‌లో నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు.. ఈసారి పాలనలో ప్రత్యేకత చూపిస్తున్నారు. గతంలో మూడుసార్లు సీఎంగా పనిచేసిన ఆయన.. నాలుగోసారి మాత్రం గతంతో కంపేర్ చేస్తే కాస్త డిఫరెంట్ అనిపిస్తున్నారు.
మొత్తం పొలిటికల్ కెరీర్‌లో నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు.. ఈసారి పాలనలో ప్రత్యేకత చూపిస్తున్నారు. గతంలో మూడుసార్లు సీఎంగా పనిచేసిన ఆయన.. నాలుగోసారి మాత్రం గతంతో కంపేర్ చేస్తే కాస్త డిఫరెంట్ అనిపిస్తున్నారు. బెస్ట్ అడ్మినిస్ట్రేటర్‌గా చంద్రబాబుకు పేరు ఉంది. ఐతే ఈసారి మాత్రం జనానికి ఒకడు.. జనంలో ఒకడు.. జనంతో ఒకడిలా ప్రజా ముఖ్యమంత్రి అని పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఇప్పటికే ప్రతి శనివారం టీడీపీ కార్యాలయానికి వెళ్తూ జనాల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. ఇప్పుడు ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఏపీలో పింఛన్లను పెంచిన చంద్రబాబు.. స్వయంగా తానే తన చేతులతో వాటిని పంపిణీ చేయనున్నారు. ఏపీలో కూటమి గెలిచి అధికారంలోకి వస్తే… పింఛన్లను 4వేలకు పెంచుతామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఏప్రిల్ నెల నుంచే పింఛన్లను పెంచుతామని.. బకాయిలను కలిపి ఒకే నెలలో ఇస్తామని ప్రకటించారు. హామీ ఇచ్చినట్లుగానే సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఫస్ట్ ఐదు సంతకాల్లో ఈహామీని కూడా చేర్చారు. మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అన్న క్యాంటీన్ల ఏర్పాటు, స్కిల్ సెన్సస్‌తో పాటుగా పింఛన్ల పెంపుపై సంతకాలు చేశారు. ఆ తర్వాత జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలో కేబినెట్ దీనికి ఆమోదం తెలిపింది. దీంతో జులై నెలలో పెరిగిన పింఛన్లను పంపిణీ చేయనున్నారు. పెరిగిన పింఛన్ నాలుగు వేలతో పాటుగా మూడు నెలల బకాయిలు మూడు వేలు కలిపి 7వేల రూపాయల పింఛన్ పంపిణీ చేయనున్నారు.
జులై ఒకటో తేదీన సచివాలయ సిబ్బంది ఈ పింఛన్లను పంపిణీ చేయనున్నారు. అయితే సీఎం హోదాలో తాను కూడా ఓ చోట పింఛన్ పంపిణీ చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో ఓ ఇంటికి వెళ్లి స్వయంగా సీఎం చంద్రబాబునే పింఛన్ డబ్బులు అందించనున్నట్లు తెలిసింది. దీంతో తెలుగుదేశం పార్టీలో నూతనోత్సాహం నెలకొంది. మరోవైపు లబ్ధిదారుల ఇళ్ళకు వెళ్ళి స్వయంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి సామాజిక పెన్షన్లు అందించడం.. దేశచరిత్రలో ఇదే మొదటిసారి.. ఇలా చేసిన ఫస్ట్ సీఎం చంద్రబాబే అని టీడీపీ వర్గాలు అంటున్నాయ్.