TDP, BRS : చంద్రబాబు యాక్షన్.. బీఆర్ఎస్‌కు ప్లస్ అవుతోందా?
ఉద్యమ పార్టీగా, ప్రత్యేక రాష్ట్రంలో వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన పార్టీగా రికార్డులు క్రియేట్ చేసింది బీఆర్ఎస్. అధికార పార్టీగా ఒక వెలుగు వెలిగిన బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది.
ఉద్యమ పార్టీగా, ప్రత్యేక రాష్ట్రంలో వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన పార్టీగా రికార్డులు క్రియేట్ చేసింది బీఆర్ఎస్. అధికార పార్టీగా ఒక వెలుగు వెలిగిన బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్‌లో చేరుతున్నారు. దీంతో దీంతో బీఆర్ఎస్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. పార్టీలో కీలక పదవులు అనుభవించిన వారు ఇప్పుడు తమ దారి తాము చూసుకుంటూ పార్టీని కష్టాల్లో వదిలి వెళ్లిపోతున్నారు. ఇలానే కొనసాగితే పార్టీ ఉనికి కూడా ప్రశ్నార్థకంగా మారే చాన్స్ ఉంది. ఈ పరిణామాలన్నీ బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తున్నాయ్.
ఇలాంటి పరిణామాల మధ్య.. తెలంగాణలో చంద్రబాబు యాక్టివ్ అయ్యారు. ఆ మధ్య తెలంగాణ పార్టీ నేతలతో భేటీ అయిన ఆయన.. ఆ తర్వాత రేవంత్‌తో మీటింగ్ పెట్టుకున్నారు. రెండురాష్ట్రాలు తనకు రెండు కళ్లు అని.. తెలంగాణలో బౌన్స్‌బ్యాక్ అయ్యేందుకు చర్యలు తీసుకుందామని చెప్పకనే చెప్పారు. ఈ పరిణామాలే ఇప్పుడు బీఆర్ఎస్‌కు మేలు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయన్న చర్చ జరుగుతోంది. ఏపీలో టీడీపీ అధికారంలో ఉండడంతో… తెలంగాణలోను పార్టీని బలోపేతం చేయాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. కొద్దిరోజుల కింద సీఎం హోదాలో.. హైదరాబాద్ వచ్చిన చంద్రబాబుకు పెద్ద ఎత్తున హోర్డింగ్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ వినిపించాయ్. ఆంధ్ర వాళ్ల ఆధిపత్యాన్ని వదిలించుకున్నా… ఇంకా వెంటపడుతూ ఉండడం ఏంటంటూ సోషల్ మీడియాలో తెలంగాణ యువకులు కామెంట్స్ చేయడంలాంటి పరిణామాలతో చంద్రబాబు హార్డింగ్స్, ఫ్లెక్సీలను ఆ తర్వాత కొంతమంది తొలగించారు. బీఆర్ఎస్‌కు చెందిన నేతలు చంద్రబాబును హైదరాబాద్‌లో కలవడం కూడా రాజకీయంగా చర్చకు దారి తీసింది.
బీఆర్ఎస్ నుంచి ఎంతమంది కాంగ్రెస్‌లో చేరినా పట్టించుకోని జనాలు.. చంద్రబాబును ఇద్దరు ఎమ్మెల్యే కలవడంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అవుతున్నారు. అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీతో పాటు, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు కూడా చంద్రబాబును కలిశారు. ఈ పరిణామాలన్నీ అనేక అనుమానాలకు దారితీస్తున్నాయి. తెలంగాణలో టీడీపీ మళ్లీ స్ట్రాంగ్ అయితే.. అయితే ఆంధ్ర పెత్తనం మొదలవుతుందనే అభిప్రాయంతో చాలామంది ఉన్నారు. ఇదే ఇప్పుడు బీఆర్ఎస్‌కు ఆయుధంగా మారుతోంది. ఈ పరిణామాలను అడ్డం పెట్టుకొని అటు కాంగ్రెస్‌ను, ఇటు టీడీపీని కారు పార్టీ నేతలు ఆడుకుంటున్నారు.