Chandrababu : మరో సారి చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ వాయిదా..
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో దాదాపు 3 నెలల జైలు ఉండి బెయిల్ మీద బయటకు వచ్చిన విషయం తెలిసిందే.. తాజా నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు స్కీల్ డెవలప్ కేసు (Skill Development Case) విచారణ జరిగింది.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో దాదాపు 3 నెలల జైలు ఉండి బెయిల్ మీద బయటకు వచ్చిన విషయం తెలిసిందే.. తాజా నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు స్కీల్ డెవలప్ కేసు (Skill Development Case) విచారణ జరిగింది. కాగా స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం కూడా తెలిసిందే.. ఇక ప్రభుత్వ పిటిషన్ పై సుప్రీం కోర్టు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ మిట్టల్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా బెయిల్ రద్దపై.. తీర్పు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయ వాదులు అడగగా.. ఈ కేసులపై విచారణ మరో సారి వాయిదా పడింది.
స్కిల్ డెవలప్ కేసును సుప్రీం కోర్టు మూడు వారాల తర్వాత పిటిషన్ పై తదుపరి విచారణ ఉంటుందని జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ తో కూడిన ధర్మాసనం తెలిపింది. ఈ కేసులో చంద్రబాబు తరఫు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేసేందుకు సుప్రీంకోర్టు (Supreme Court) రెండు వారాలు సమయం ఇచ్చింది.