TTDP నేతలతో నేడు చంద్రబాబు సమీక్ష.. ఇవాళ TTDP అధ్యక్షుడి పేరు ప్రకటన..
నేడు తెలంగాణ టీడీపీ నేతలతో ఏపీ సీఎం చంద్రబాబు నేడు టీడీపీ భవన్ లో సమీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణలో టీడీపీ క్యాడర్ ను బలపరిచేందుకు ఏపీ సీఎం చంద్రబాబు సిద్దమయినట్లు తెలుస్తుంది.

తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటన.. నిన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల విభజన హామిలపై చర్చలు జరిపిన విషయం తెలిసిందే.. కాగా నేడు తెలంగాణ టీడీపీ నేతలతో ఏపీ సీఎం చంద్రబాబు నేడు టీడీపీ భవన్ లో సమీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణలో టీడీపీ క్యాడర్ ను బలపరిచేందుకు ఏపీ సీఎం చంద్రబాబు సిద్దమయినట్లు తెలుస్తుంది. దీంతో నేడు క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలపై ఆయన పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడంపైనా చర్చిస్తారని సమాచారం..
టీటీడీపీ అధ్యక్షుడిని కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామాతో ఖాళీ గా తెలంగాణ టీడీపీకి అధ్యక్షుడి పదవిని చంద్రబాబు ఇంకా భర్తీ చేయలేదు. దీంతో నేడు టీడీపీ అధ్యక్షుడి పేరును CBN ఈరోజు ప్రకటించే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలంటున్నాయి.