Rajinikanth, Chandrababu : రజనీకి చంద్రబాబు ప్రత్యేక ఆహ్వానం.. రోజా, నాని.. తల ఎక్కడ పెట్టుకుంటారో!
టైమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు.. కాలం చేసే వింతలకు ఎవరూ అతీతులు కాదు.. రాజకీయాల్లో అయితే మరీనూ ! మనది అనుకున్న రోజు రెచ్చిపోతే.. కాలం అన్నింటికి సమాధానం చెప్తుంది.. సరదా తీర్చేస్తుంది.

Chandrababu's special invitation to Rajini.. Roja, na.. where do you put your head!
టైమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు.. కాలం చేసే వింతలకు ఎవరూ అతీతులు కాదు.. రాజకీయాల్లో అయితే మరీనూ ! మనది అనుకున్న రోజు రెచ్చిపోతే.. కాలం అన్నింటికి సమాధానం చెప్తుంది.. సరదా తీర్చేస్తుంది. ఇప్పుడు వైసీపీ (YCP) విషయంలో జరిగింది అదే ! జగన్ సర్కార్ (Jagan Sarkar) హయాంలో వైసీపీ మంత్రులు, నేతలు బూతులకు.. బీప్‌లు వేయాలంటే తల ప్రాణం తోకకు వచ్చేది. ఆ బూతులే చాలామంది మంత్రులను.. ఇప్పుడు ఇంటికి పరిమితం చేసింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. చంద్రబాబు (Chandrababu), లోకేశ్ నుంచి.. టీడీపీ (TDP) కి ఎవరు సపోర్ట్ చేసినా.. నోటికి పనిచెప్పే నేతల్లో.. ఫస్ట్ వరుసలో వినిపించే పేర్లు.. రోజా, కొడాలి నాని.
ఐతే ఈ ఇద్దరికి పంచ్ ఇచ్చేలా చంద్రబాబు తీసుకున్న నిర్ణయం.. హాట్‌టాపిక్‌గా మారింది. సీఎంగా తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి.. ప్రత్యేక ఆహ్వానితుడిగా రావాలని.. తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు చంద్రబాబు ఇన్విటేషన్ పంపించారు. అమరావతిలో రజనీ ల్యాండ్ అయిపోయారు కూడా ! చంద్రబాబు ఇలా పిలిచారో లేదో.. అలా ఓకే చెప్పేశారు రజనీ. రోజా(Roja), కొడాలి నానికి (Nani) షాక్ ఇస్తా అన్నట్లుగా… వెంటనే అమరావతిలో ల్యాండ్ అయిపోయారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో పాల్గొన్న రజనీ కాంత్.. చంద్రబాబు విజన్ గొప్పది అంటూ ప్రశంసలు గుప్పించారు. హైదరాబాద్ ఇప్పుడు ఈ స్థాయిలో ఉంది అంటే.. అదంతా చంద్రబాబు కష్టమే అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలు.. వైసీపీ నేతలకు కోపం తెప్పించాయ్. ఒకరి తర్వాత ఒకరు.. ఒకరికి మించి ఒకరు అన్నట్లుగా రజనీకాంత్‌ను టార్గెట్ చేసి.. బూతుల వర్షం కురిపించారు. రోజా, కొడాలి నాని అయితే ఒక ఆకు ఎక్కువే అన్నట్లు మాటలు వదిలారు. ఏపీలో ఏం జరుగుతుందో తెలియకుండా.. చంద్రబాబు స్క్రిప్ట్ చదవి, పెట్టింది తిని.. ఇష్టం వచ్చింది మాట్లాడితే ఊరుకునే వాళ్లు ఎవరూ లేరు అంటూ.. తమిళనాడు వెళ్లి మరీ రోజా వార్నింగ్ ఇచ్చారు.
ఇక కొడాలి నాని అయితే.. ఓ మెట్టు ఎక్కువే దిగారు. రజనీకాంత్ (Rajinikanth) అక్కడ హీరో, ఇక్కడ జీరో అని.. ఇలాంటి డబ్బా కబుర్లు సినిమాల్లో చెప్పుకుంటే చాలు.. బయట చెప్పాల్సిన అవసరం లేదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఐతే వైసీపీ నేతల మాటలకు చంద్రబాబు కదిలిపోయారు. రజనీకి స్వయంగా ఫోన్ చేసి.. ఇలాంటివి పట్టించుకోవద్దని చెప్పారు. ఇక వైసీపీ నేతల మాటలతో రజనీకాంత్.. తీవ్ర మనస్థాపానికి గురయ్యారనే చర్చ జరిగింది. జైలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో.. వైసీపీ నేతలను ఉద్దేశిస్తూ.. అర్థమైందా రాజా అంటూ.. కౌంటర్లు కూడా ఇచ్చారు. ఇప్పుడు వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఫ్యాన్ పార్టీ ఓటమికి నేతల ఓవరాక్షన్, బూతులు కూడా ఓ కారణంగా మారిపోయాయ్. ఐతే ఎవరినైతే వైసీపీ నేతలు అవమానించారో.. ఆ రజనీకాంత్‌కు చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేక ఆహ్వానం పంపారు. ఇది కదా పంచ్ అంటే.. ఇప్పుడు రోజా, నాని తల ఎక్కడ పెట్టుకుంటారో అంటూ.. సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ప్రమాణస్వీకారంలో రజనీ ఎంట్రీ కోసం, మాటల కోసం ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్నారు.