Chandrababu, NTR : చంద్రబాబు ప్రమాణస్వీకారానికి..ఎన్టీఆర్ డుమ్మా అందుకేనా ?

అనురాగాలు, ఆప్యాయతలు, ఆనందాలు, ఆనంద భాష్పాలు.. చంద్రబాబు (Chandrababu) ప్రమాణస్వీకార కార్యక్రమంలో కనిపించిన సీన్లు ఇవి! ప్రమాణస్వీకారం తర్వాత.. మోదీని గట్టిగా హగ్ చేసుకున్న చంద్రబాబు కళ్లల్లో ఓ నీటి చెమ్మ.. రాజకీయాలకు అతీతంగా ప్రతీ ఒక్కరిని కదిలిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 13, 2024 | 03:00 PMLast Updated on: Jun 13, 2024 | 3:00 PM

Chandrababus Swearing In Why Is Ntr Dummy

అనురాగాలు, ఆప్యాయతలు, ఆనందాలు, ఆనంద భాష్పాలు.. చంద్రబాబు (Chandrababu) ప్రమాణస్వీకార కార్యక్రమంలో కనిపించిన సీన్లు ఇవి! ప్రమాణస్వీకారం తర్వాత.. మోదీని గట్టిగా హగ్ చేసుకున్న చంద్రబాబు కళ్లల్లో ఓ నీటి చెమ్మ.. రాజకీయాలకు అతీతంగా ప్రతీ ఒక్కరిని కదిలిస్తోంది. రాజకీయంగా ఎన్నో విజయాలు ఎదురైనప్పుడు కూడా చంద్రబాబు ఇలా కనిపించలేదు. ఇక పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) ప్రమాణం చేసినప్పుడు.. బాహుబలి ఇంటర్వెల్ సీన్ గుర్తొచ్చింది ప్రతీ ఒక్కరికి! ఇదంతా ఎలా ఉన్నా చంద్రబాబు ప్రమాణస్వీకారానికి చాలామందికి ఆహ్వానాలు పంపింది టీడీపీ(TDP). నందమూరి కుటుంబంలో ప్రతీ ఒక్కరిని చంద్రబాబు ఫ్యామిలీ (Chandrababu Family) స్వయంగా ఇన్వైట్ చేసింది. హీరో ఎన్టీఆర్‌ (NTR) కు కూడా ఆహ్వానం అందింది.

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఎవరు వచ్చినా.. రాకపోయినా.. ఎన్టీఆర్ వస్తాడా.. రాడా.. అనేది చివరి క్షణం వరకు హాట్‌టాపిక్‌గా మారింది. ఐతే ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ దూరంగా ఉన్నారు. దీనికి రకరకాల కారణాలు వినిపిస్తున్నాయ్. షూటింగ్‌లో బిజీగా ఉండడం వల్లే.. ప్రమాణస్వీకారానికి రాలేదని కొందరు అంటుంటే.. లేదు ఇంకేదో కారణం ఉందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. నిజానికి ప్రస్తుతంత ఎన్టీఆర్ దేవర షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఆ మూవీ షూటింగ్‌ గోవాలో జరుగుతోంది. ఆ షూటింగ్‌లో బిజీగా ఉండడం వల్లే.. తారక్‌ రాలేదని.. హైదరాబాద్‌లో అందుబాటులో ఉంటే వచ్చేవారనే టాక్ వినిపిస్తోంది. నిజానికి ఎంత దూరంలో షూటింగ్‌లో ఉన్నా.. రావాలి అనుకుంటే అది పెద్ద విషయం కాదని.. అనుకోలేదు కాబట్టే ఎన్టీఆర్ రాలేదు అని మరికొందరి వాదన.

ఐతే ఎన్నికల్లో కూటమి విజయం తర్వాత.. చంద్రబాబుకు ఎన్టీఆర్‌ విషెస్ చెప్పాడు. ప్రియమైన మావయ్యకు అభినందనలు అంటూ.. చంద్రబాబుతో పాటుగా ఎన్నికల్లో గెలిచిన నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్, శ్రీభరత్, పురందేశ్వరికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదంతా ఎలా ఉన్నా.. కొంతకాలంగా టీడీపీ శ్రేణులకు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయ్. లేదు. చంద్రబాబు అరెస్ట్ అయిన టైంలో.. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు సమయంలోనూ… తారక్ సరిగా రియాక్ట్‌ కాలేదని తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. అయితే ఫలితాల తర్వాత ఎన్టీఆర్.. చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేయడం.. ఆయన రిప్లై ఇవ్వటంతో కాస్త దగ్గరైనట్లు తెలుస్తోంది. ఐనా సరే.. ఇప్పుడు కార్యక్రమానికి రాకపోవడంతో.. కొత్త అనుమానాలు పుట్టుకొస్తున్నాయ్.