Chandrababu : పెనుమాకలో చంద్రబాబు పర్యటన.. ST కాలనీలో పాముల నాయక్ తొలి పెన్షన్
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో CM చంద్రబాబు ఇవాళ ఉదయం పర్యటించారు. ఉ.5.45 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయల్దేరి 6 గంటలకు పెనుమాక చేరుకున్నారు.

Chandrababu's visit to Penumaka.. Pamula Naik's first pension in ST Colony
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో CM చంద్రబాబు ఇవాళ ఉదయం పర్యటించారు. ఉ.5.45 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయల్దేరి 6 గంటలకు పెనుమాక చేరుకున్నారు. NTR భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పెనుమాకలోని ST కాలనీలో పాముల నాయక్ కుటుంబానికి CM చంద్రబాబు తొలి పెన్షన్ అందించారు. పాముల నాయక్కు వృద్ధాప్య పెన్షన్, భార్యకు CRDA పెన్షన్, కుమార్తెకు వితంతు పెన్షన్ డబ్బులు అందజేశారు. వాళ్లు ఇంట్లో టీ తాగిన చంద్రబాబు అరగంట పాటు లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తమకు ఇల్లు కావాలని నాయక్ కుటుంబం.. చంద్రబాబును కోరింది.. దీంతో వెంటనే చంద్రబాబు వారికి ఇల్లు మంజూరు చేసి, దానికి సంబంధించిన పత్రాన్ని కూడా నాయక్‌కు అందించారు. అనంతరం పెనుమాక మసీదు సెంటర్‌లో ప్రజావేదిక కార్యక్రమంలో లబ్ధిదారులు, ప్రజలతో ముచ్చటించనున్నారు. ఆ తర్వాత ఉండవల్లిలోని నివాసానికి చేరుకోనున్నారు.