MACHRLA MALLIKA : పిన్నెల్లిని వెంటాడుతున్న… ఎస్పీ మల్లికా గార్గ్

మాచర్లలో ఈవీఎం ధ్వంసం కేసులో పరారైన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం గాలింపు కొనసాగుతోంది. ఆయన్ని ఎలాగైనా పట్టుకొని తీరాలని పల్నాడు ఎస్పీ మల్లికా గార్గే ప్రయత్నిస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 23, 2024 | 10:45 AMLast Updated on: May 23, 2024 | 10:45 AM

Chasing Pinnelli Sp Mallika Garg

 

 

 

మాచర్లలో ఈవీఎం ధ్వంసం కేసులో పరారైన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం గాలింపు కొనసాగుతోంది. ఆయన్ని ఎలాగైనా పట్టుకొని తీరాలని పల్నాడు ఎస్పీ మల్లికా గార్గే ప్రయత్నిస్తున్నారు. అందుకోసం ప్రత్యేక పోలీసు బృందాలు పెట్టి వెతికిస్తున్నారు.

మాచర్లలో హౌస్ అరెస్ట్ లో ఉన్న పిన్నెల్లి బ్రదర్స్… గన్ మెన్ లను వదిలేసి… రాత్రికి రాత్రే హైదరాబాద్ కి పరార్ అయ్యారు. ఎన్నికల రోజు, ఆ తర్వాత జరిగిన హింసకు సంబంధించిన ఆరోపణలతో ఈసీ ఆదేశాలతో ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు. అప్పటికి ఇంకా ఈవీఎం ధ్వంసం వీడియో బయటకు రాలేదు. పల్నాడు జిల్లా కలెక్టర్ గానీ, ఈసీ అధికారులు గానీ ఈవీఎం ధ్వంసం సంగతి బయటపెట్టలేదు. వీడియో వైరల్ అయ్యాకే స్పందించారు… మే13న ఈ సంఘటన జరిగినప్పుడు లైవ్ వెబ్ కాస్ట్ చూడలేదా… చూసీ తెలియనట్టు అధికారులు ఎందుకు నిద్ర నటించారన్నది అర్థం కాని ప్రశ్న. ఈవీఎం ధ్వంసంపై కేసు పెట్టినా… పిన్నెల్లి మీద కాకుండా… ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అంటూ పోలీసులు తూతూ మంత్రంగా కేసు నమోదు చేశారు. పిన్నెల్లి గుర్తు తెలియని వ్యక్తా… అసలు ఈవీఎం ధ్వంసం వీడియో ఎలా బయటకు వచ్చింది అనేది కూడా అర్థంకాని విషయం. ఈసీ ఏర్పాటు చేసిన వెబ్ కామ్ నుంచి విజువల్స్ బయట వ్యక్తులు ఎలా వచ్చాయో తెలియదు.. సిట్ విచారణ తర్వాతే ఈ వీడియో వ్యవహారం బయటపడినట్టు తెలిసింది.

ఇదే టైమ్ లో పల్నాడు ఎస్పీగా మల్లికా గార్గ్ బాధ్యతలు చేపట్టడంతో పొలిటికల్ లీడర్ల గుండెల్లో రైళ్ళు పరుగెత్తాయి. పిన్నెల్లి… మాచర్ల నుంచి పరార్ అవడానికి కూడా ఇదే కారణం. ఫైర్ బ్రాండ్ గా పేరున్న మల్లిక అంటే వైసీపీ లీడర్లలో వణుకు. ఇప్పుడు పారిపోయిన పిన్నెల్లిని పట్టుకోడానికి ఎస్పీ మల్లికా గార్గే తమ పోలీస్ బృందాలతో వేటాడుతున్నారు. కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. దుబాయ్ విమానం ఎక్కి విదేశాలకు చెక్కేయాలన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి ప్లాన్ ని కూడా భగ్నం చేశారు. సంగారెడ్డి, మహబూబ్ నగర్ ఏరియాల్లో తలదాచుకునేందుకు ప్రయత్నించినా ఏపీ పోలీసుల రాకతో అక్కడి నుంచి కూడా పరారయ్యారు పిన్నెల్లి బ్రదర్స్. చివరకు ఓ టీవీ ఛానెల్ వాహనంలో తమిళనాడుకు పరార్ అయినట్టు తెలుస్తోంది.

పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని ఈసీ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో… ఆయన ఎక్కడున్నా పట్టుకొని మాచర్లకు తీసుకొచ్చేందుకు ఎస్పీ మల్లికా గార్గ్ వేట మొదలుపెట్టారు. పిన్నెల్లిని తప్పించిన పోలీస్ అధికారులపైనా చర్యలకు సిద్ధమవుతున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా పోలీసులు గాలిస్తున్నారు. వాళ్ళకి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ గైడ్ చేస్తున్నారు ఎస్పీ మల్లికా గార్గ్.