Ramoji Rao : మౌన ముని చక్రవర్తి మృతి
రామోజీ రావు (Ramoji Rao) పరిచయం అక్కర్లేని పేరు. మీడియా ప్రపంచంలో తుపాన్. ఉదయించే సూర్య కిరణాల్నిచూసి అవే కదా ఉషాకిరణాలు అని ప్రతి ఒక్కడు అనుకునేలా చేసిన ఎవరెస్ట్ శిఖరాదిపతి.
రామోజీ రావు (Ramoji Rao) పరిచయం అక్కర్లేని పేరు. మీడియా ప్రపంచంలో తుపాన్. ఉదయించే సూర్య కిరణాల్నిచూసి అవే కదా ఉషాకిరణాలు అని ప్రతి ఒక్కడు అనుకునేలా చేసిన ఎవరెస్ట్ శిఖరాదిపతి. ప్రజలకి ఆర్ధిక క్రమశిక్షణ కూడా నేర్పింది కూడా ఆయనే. మాటలు కాదు చేతల్లో చూపించు అని కూడా అంటారు. ఆ మౌన ముని చక్రవర్తి ఈ తుది శ్వాస విడిచారు.
భారతదేశపు ‘రూపర్ట్ మర్డోక్’ (Rupert Murdoch) గా పేరుగాంచిన చెరుకూరి రామోజీరావు వ్యాపారవేత్తగా, మీడియా బారన్‌గా ప్రసిద్ధి చెందారు. ఆయన మృతి తో భారతీయ సినీ పరిశ్రమలో ,భారతీయ టెలివిజన్ పరిశ్రమలో, భారతీయ పత్రికారంగంలో, భారతీయ వ్యాపార రంగంలో, పెను విషాదం చోటు చేసుకుంది.కొన్ని లక్షల మంది జీవితాల్లో వెలుగుని, స్థిరత్వాన్ని, నమ్మకాన్ని, ధైర్యాన్ని నింపిన ఆలు పెరగని పోరాటయోధుడు మృతికి పలువురు సినీ ప్రముఖులు సినీ రాజకీయ, వ్యాపార ప్రముఖులు సంతాపాన్ని తెలియచేస్తున్నారు
రామోజీరావు కొన్ని రోజుల నుంచి గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.దీంతో కుటుంబ సభ్యులు కొన్ని రోజుల క్రితం హాస్పిటల్ లో జాయిన్ చేసారు. వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందించే స్థాయికి ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. చివరకి పరిస్థితి విషమించడంతో ఈరోజు తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. భౌతిక దేహాన్ని ఫిలిం సిటీ లోని ఆయన స్వగృహానికి తరలించారు. తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపనుంది. ఒక మీడియా దిగ్గజానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపడం భారతదేశంలో ఇదే తొలిసారి