Turumala Roja : తిరుమలలో రోజా ఇన్ని దారుణాలు చేసిందా?
వైసీపీ సర్కార్ హయాంలో ఆ పార్టీ నేతలు.. టీటీడీలో దారుణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయ్. దర్శనం పేరుతో చేసిన దోపిడీ ఇదే అంటూ ప్రస్తుత ప్రస్తుతం కీలక పత్రాలను బయటపెడుతోంది.
వైసీపీ సర్కార్ హయాంలో ఆ పార్టీ నేతలు.. టీటీడీలో దారుణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయ్. దర్శనం పేరుతో చేసిన దోపిడీ ఇదే అంటూ ప్రస్తుత ప్రస్తుతం కీలక పత్రాలను బయటపెడుతోంది. టీటీడీ కొత్త ఈవో శ్యామలరావు విజిలెన్స్ బృందాలకు పెద్ద పని పెట్టారు. నాలుగైదు విభాగాలుగా మార్చి అన్నింటిలోనూ లెక్కలు బయటకు తీయిస్తున్నారు. దర్శనాల్లో చేసిన దందాల గురించి ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా ప్రజాప్రతినిధుల పేర్లతో వచ్చిన సిఫారసు లేఖలు వెలుగులోకి వస్తున్నాయ్. మైండ్‌బ్లాంక్ నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయ్.
సెకనులో సగభాగం సేపు ఆ శ్రీవారిని చూసినా చాలు అంటూ.. గంటలకు గంటలు ఎదురుచూసి కష్టాలు పడి తిరుమల దర్శనం చేసుకుంటారు సామాన్యులు. అలాంటి స్వామి వారి దర్శనాన్ని కూడా రాజకీయం చేశారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయ్. చేతికి ఎముక లేకుండా.. సిఫారసు లేఖలు ఇచ్చేశారు. దీంతో వైసీపీ భక్తులు.. లెక్కకు మించి సంఖ్యలో శ్రీవారి దర్శనాలు చేసుకున్నారు. దీంతో సాధారణ భక్తులకు శ్రీవారు దూరమయ్యారు. వైసీపీ హయాంలో మంత్రులుగా ఉన్న చిత్తూరు జిల్లాకు చెందిన రోజా, పెద్దిరెడ్డి, టీటీడీ బోర్డు సభ్యుడు, అప్పటి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి… తమ వారికి లెక్కకు మించిన సిఫారసు లేఖలు ఇచ్చినట్టు విజిలెన్స్ విభాగం బయట పెట్టింది. రోజా అయితే.. స్వయంగా తనతో మందలకొద్దీ భక్తులను తీసుకువెళ్లి ఒకే టికెట్‌పై పదుల సంఖ్యలో శ్రీవారిని దర్శించుకున్నారు.
తాజా విచారణలో బ్రేక్ దర్శనం పేరుతో ఆమె వందల కొద్దీ సిఫారసు లేఖలు ఇచ్చారని తెలిసింది. ఇక మరో కీలక నేత, అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీఐపీ బ్రేక్ దర్శనంలో ఒకేసారి 54 మందిని శ్రీవారి దర్శనానికి పంపిన వ్యవహారం ఇప్పుడు బయటకు వచ్చింది. తాను పంపిన వారిని దర్శనానికి అనుమతించాలంటూ ఆయన రాసిన సిఫారుసు లేఖను.. టీడీపీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. మరోవైపు ఈ బ్రేక్ దర్శనం స్కాంతోపాటు శ్రీవాణి ట్రస్ట్ టికెట్ కుంభకోణంపైనా టీటీడీ విజిలెన్స్ విచారణ ప్రారంభించింది.