Deputy CM, Pawan Kalyan : ఆమెకు హామీ ఇచ్చావని.. ఆ శాఖ అడిగి తీసుకున్నావా..
డిప్యూటీ సీఎం (Deputy CM) తో పాటు.. ఏపీ కేబినెట్ (AP Cabinet) లో కీలక శాఖలు తీసుకున్నారు పవన్. పంచాయతీ రాజ్, తాగునీటి సరఫరా, గ్రామీణాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ, అడవులు, పర్యావరణ శాఖలను సేనానిని అప్పగించారు చంద్రబాబు. మిగతా శాఖల సంగతి ఎలా ఉన్నా.. ఒక విభాగం విషయంలో పవన్ పట్టిన పట్టు వదల్లేదని తెలుస్తోంది..

Did the department ask that she was assured..
డిప్యూటీ సీఎం (Deputy CM) తో పాటు.. ఏపీ కేబినెట్ (AP Cabinet) లో కీలక శాఖలు తీసుకున్నారు పవన్. పంచాయతీ రాజ్, తాగునీటి సరఫరా, గ్రామీణాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ, అడవులు, పర్యావరణ శాఖలను సేనానిని అప్పగించారు చంద్రబాబు. మిగతా శాఖల సంగతి ఎలా ఉన్నా.. ఒక విభాగం విషయంలో పవన్ పట్టిన పట్టు వదల్లేదని తెలుస్తోంది.. అదే తాగునీటి సరఫరా శాఖ. దీన్ని పవన్ అడిగి మరీ తీసుకున్నారట. ఇలా చేయడం వెనక భారీ కారణమే ఉంది. జనాలను ఆయన ఎంతలా ప్రేమిస్తాడో.. వాళ్లకు మాట ఇస్తే.. ఎంత వరకు వెళ్తారో చెప్పడానికి.. పవన్ పట్టుదల బెస్ట్ ఎగ్జాంపుల్ అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
పవన్ గతంలో ఓసారి అరకులో పర్యటించారు. నాలుగురోజులు అక్కడే ఉండి.. జనాలతో కలిసిపోయారు. వాళ్ల సమస్యలు తెలుసుకున్నారు. ఐతే పవన్ అరకు నుంచి తిరిగివచ్చేప్పుడు… మహిళలు రోడ్డుపై బిందెలు పెట్టారు. కారు నుంచి దిగి అక్కడి వాళ్లను పలకరించారు పవన్. 70ఏళ్ల వృద్ధురాలు తాగునీటి కష్టాల గురించి చెప్పగా.. పవన్ కదిలిపోయారు. తాము ఎలాంటి నీళ్లు తాగుతున్నామో చూడు ఆ వృద్ధురాలు చూపించారు. పురుగులు, క్రిములు నిండిన ఆ నీళ్లను చూసి.. పవన్ కళ్లల్లో నీళ్లు తిరిగాయ్. తాగేందుకు గుక్కెడు మంచినీళ్లు ఇవ్వు బాబు చాలు అంటూ ఆ వృద్ధురాలు మాట్లాడిన మాటలు.. ఎప్పటికీ తనను వెంటాడుతాయని పవన్ చాలాసార్లు చెప్పారు. ఆ కష్టాలు చూసే.. పవన్ తాగునీటి సరఫరా శాఖ తీసుకున్నారంటూ.. జనసైనికులు చెప్తున్నారు.
గతంలో ఆ వృద్ధురాలి కష్టం గురించి పవన్ చెప్పిన మాటలు.. ఇప్పుడు మళ్లీ వైరల్ చేస్తున్నారు. ఓ పెద్దావిడ కష్టాలు విని.. ఆమె కోసం తాగునీటి సరఫరాశాఖ తీసుకున్నారా.. నువ్ దేవుడివి సామీ అంటూ.. సోషల్ మీడియాలో పవన్ మీద ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయ్. గుంపుకు, వర్గానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం వేరు.. ఒక్క మహిళ, ఒకే ఒక్క మహిళ.. కన్నీళ్లతో వేడుకుంటే కష్టం చూడలేక.. దాన్ని తీర్చేందుకు ముందుకు రావడం వేరు. పవన్ చేసింది అదే. అందుకే సేనానిని ఇప్పుడు ప్రతీ ఒక్కరు అభినందించకుండా ఉండలేకపోతున్నారు. పవన్ నిర్ణయాలు ఎలా ఉంటాయ్.. ఎలా ఉండబోతున్నాయ్ అని చెప్పడానికి.. ఇది చిన్న శాంపిల్ మాత్రమే అంటూ జనసైనికులు పవన్ స్పీచ్‌ను వైరల్ చేస్తున్నారు.