TTD EO : తిరుమల TTD ఈవోగా ధర్మారెడ్డి తొలగింపు..

ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన తిరుమల ఆలయం వ్యవహారాలు పర్యవేక్షించే టీటీడీ (TTD) ఈవో ధర్మారెడ్డి (Dharma Reddy) ని బాధ్యతల నుంచి తప్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 15, 2024 | 11:34 AMLast Updated on: Jun 15, 2024 | 11:34 AM

Dismissal Of Tirumala Ttd Evo Dharma Reddy

 

 

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువు దిరింది. ఏపీ (AP) పలు కీలక పదవుల్లో ఉన్న ఉన్నతాధికారలు తమ పదవుల నుంచి తప్పుకోవడమో.. తేదా కొత్త ప్రభుత్వం తప్పించడమో వంటి పనులు చాలా వేగంగానే జరుగుతన్నాయి. ఇప్పుడు కూడా అలాంటి నిర్ణయ మే తిసుకుంది ఏపీ కొత్త ప్రభుత్వం..

ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన తిరుమల ఆలయం వ్యవహారాలు పర్యవేక్షించే టీటీడీ (TTD) ఈవో ధర్మారెడ్డి (Dharma Reddy) ని బాధ్యతల నుంచి తప్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో జె.శ్యామలరావు (J. Shyama Rao) ని టీటీడీ కొత్త ఈవోగా నియమించింది. ఈయన ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శిగా కూడా పనిచేశారు. కాగా ఇటీవల ధర్మారెడ్డిని సెలవుపై పంపుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలను ధర్మారెడ్డి ఎదుర్కొంటున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు (Chandrababu) నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచే ప్రక్షాళన చేపడతామని.. తిరుమలను అభివృద్ది చేస్తామని బాబు ప్రకటించారు. దీంతో సీఎం అయిన మూడోవ రోజు తిరుమల విషయంలో తనే స్వయంగా రంగంలోకి దిగారు.