Nagari Roja : 11 సీట్లే ఎందుకు వచ్చాయో అర్థం కావడంలేదా.. రోజా.. ఐతే ఈ వీడియో చూడు
తప్పును గుర్తించి సరిచేసుకోవడం గొప్పోడి లక్షణం. ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం సైనికుడి లక్షణం. కానీ.. ఓటమిని ఒప్పుకోకుడా అసలు ఎందుకు ఓడిపోయామో కూడా అర్థం కావడంలేదు అనేవాళ్లను ఏమనాలో ఎవరికీ అర్థం కావడంలేదు. ఎందుకంటే ఈ మాటలు చెప్తోంది నార్మల్ వ్యక్తులు కాదు.
తప్పును గుర్తించి సరిచేసుకోవడం గొప్పోడి లక్షణం. ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం సైనికుడి లక్షణం. కానీ.. ఓటమిని ఒప్పుకోకుడా అసలు ఎందుకు ఓడిపోయామో కూడా అర్థం కావడంలేదు అనేవాళ్లను ఏమనాలో ఎవరికీ అర్థం కావడంలేదు. ఎందుకంటే ఈ మాటలు చెప్తోంది నార్మల్ వ్యక్తులు కాదు. ఐదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి, ఆయన మంత్రి వర్గంలో పని చేసిన మంత్రులు. ఏపీలో ఇప్పుడు కనిపిస్తున్న సీన్ ఇదే. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. కానీ వైసీపీ నేతలు మాత్రం ఇప్పటికీ తమ ఓటమిని ఒప్పుకునేందుకు ఇష్టపడటంలేదు. పైగా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారంటూ కొత్త పాట మొదలు పెట్టారు.
ఇదే విషయంలో మాజీ మంత్రి రోజా రీసెంట్‌గా కొన్ని కామెంట్స్ చేశారు. తమకు ఏపీలో 40 శాతం ఓటింగ్ వచ్చిందని చెప్పారు. ఇదే 40 శాతం ఓటింగ్‌తో మోడీ సీఎం అయ్యా.. తెలంగాణలో రేవంత్ సీఎం అయ్యారు.. కానీ అదే పర్సంటేజి వచ్చిన జగన్ మాత్రం ప్రతిపక్షంలో కూడా లేరు. అంటే ఖచ్చితంగా ఇది ట్యాంపరింగ్ వ్యవహారమే అని చెప్పదలుచుకున్నారు మాజీ మంత్రి. తాము ఎందుకు ఓడిపోయామో అర్థం కావడంలేదు అని చెప్పిన రోజాకు ఈ వీడియోతో క్లారిటీ వచ్చే అవకాశముంది. రోజా చెప్పిన నెంబర్స్ కరెక్టే అయినప్పటికీ.. పరిస్థితి వేరు. తెలంగాణలో ఉన్న అసెంబ్లీ సీట్లను దేశంలో ఉన్న పార్లమెంట్ సీట్లను ఏపీతో కంపేర్ చేసి.. అదే 40 శాతం షేరింగ్‌ను ఆపాదించడం అవివేకం.
ఇక రోజా చెప్పినట్టు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 39.37 శాతం ఓట్లు వచ్చాయి. అంటే దాదాపు 40 శాతం. అలయన్స్ కాకుండా టీడీపీకి 45.6 శాతం ఓట్లు వచ్చాయి. ఒకవేళ ఏపీలో అలయన్స్ ఏర్పడకపోతే.. రోజా చెప్పినట్టు వైసీపీకి మంచి స్థాయిలో సీట్లు వచ్చేవి. కానీ.. బీజేపీ, జనసేన కలిపి దాదాపు 33 లక్షల ఓట్లు సాధించాయి. నిజానికి ప్రతీ ఎన్నికలో గెలుపు డిసైడ్ చేసే సెక్టార్ ఓట్లు ఇవే. అటు వైసీపీకి ఇటు టీడీపీ వాళ్లకు ఉండే సాంప్రదాయ ఓటర్లు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. వీళ్లతో పాటే పార్టీ మీద అసంతృప్తితో ఉండే కొందరు పార్టీ మనుషులు కూడా ఉంటారు. ఇలా మధ్యలో ఉండే ఈ న్యూట్రల్ ఓటర్లే ప్రతీసారి విజేతను డిసైడ్ చేస్తారు. ఈ సారి ఆ న్యూట్రల్ ఓటర్లను పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్. ప్రభుత్వ ఓట్ బ్యాంక్ చీలకుండా మూడు పార్టీలను కలిపి.. ఐతే అటు లేదంటే ఇటు అనేలా ఎలక్షన్‌ను మార్చేశారు.
దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నవాళ్లకు వేరే ఆప్షన్ లేకుండా పోయింది. దీంతో ఆ ఓట్లు ఆటోమేటిక్‌గా టీడీపీ ఖాతాలోకే వచ్చి పడ్డాయి. వైసీపీ 11 సీట్లకే పరిమితం కావడానికి ఇదే పెద్ద కారణం. ఎవరెన్ని కుయుక్తులు చేసినా కూటములు కట్టినా ప్రజల్లో బలముంటే ఆ పార్టీని ఎవరూ ఏం చేయలేరు. కానీ గ్రౌండ్ స్థాయిలో వైసీపీ చేసిన చాలా తప్పులే ఆ పార్టీని ఈ పరిస్థితికు తీసుకువచ్చాయి. ప్రత్యర్థులు మోసం చేశారు.. ఈవీఎంలు ట్యాంపర్ చేశారు అనే విమర్శలు పక్కన పెట్టి గ్రౌండ్ లెవెల్‌లో ఎక్కడ డ్యామేజ్ జరిగిందో కనుక్కుంటే తమకు 11 సీట్లు ఎందుకు వచ్చాయో వైసీపీ నేతలకు అర్థమవుతుంది.