Venu Swamy : బయటకు రావొద్దు స్వామి.. దొరికారో అంతే.. దబిడిదిబిడే !
ఆ టైమ్‌కు అనిపించింది చెప్తారా.. లేదంటే ప్లాన్డ్ ప్రకారం చెప్తారో కానీ.. వేణుస్వామి (Venu Swamy) మాత్రం ఎప్పుడూ కాంట్రవర్సీకి కేరాఫ్ అవుతుంటారు.

Do you say what you feel like at that time... or do you say it according to the plan... but Venuswami is always a carafe of controversy.
ఆ టైమ్‌కు అనిపించింది చెప్తారా.. లేదంటే ప్లాన్డ్ ప్రకారం చెప్తారో కానీ.. వేణుస్వామి (Venu Swamy) మాత్రం ఎప్పుడూ కాంట్రవర్సీకి కేరాఫ్ అవుతుంటారు. జోతిష్యాలు చెప్పుకునే ఓ వ్యక్తికి.. తెలుగు రాష్ట్రాల్లో పాపులారిటీ వచ్చింది అంటే.. అది బహుశా వేణుస్వామికి ఒక్కరికే అనుకుంటా ! గ్రహాల మూమెంట్ పట్టేశా అంటారు.. నవగ్రహాల పూజ అంటారు. భవిష్యత్‌ను మూడో కంటితో చూసినట్లు బిల్డప్ ఇస్తారు.. వంద చెప్తే.. ఒకటో రెండో నిజం అవుతుంటాయ్. ఆ నిజం అయిన దాన్ని మనోడు చేసుకునే ప్రమోషన్ అంతా ఇంతా కాదు. సినిమా, రాజకీయాలు, మీడియా.. ఏదీ వదిలిపెట్టరు ఆయన.. అన్నింట్లో వేలు పెట్టేస్తుంటారు.
జరగబోయేది ఇదే అంటూ యూట్యూబ్ థంబ్ నెయిల్ లెవల్‌లో.. ఓ స్టేట్‌మెంట్ ఇచ్చేస్తుంటారు. ఇప్పుడిదంతా ఎందుకు అంటే.. వేణుస్వామి కోసం వైసీపీ (YCP) శ్రేణులన్నీ వెయిట్ చేస్తున్నాయ్. బయట ఎక్కడ దొరుకుతారా అని వెతుకుతున్నాయ్. ఏపీలో ఫలితాలకు ఇంకొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. ఎగ్జిట్‌పోల్స్ కూడా వచ్చాయ్. మెజారిటీ ఎగ్జిట్‌పోల్స్ కూటమిదే అధికారం అంటున్నాయ్. ఇదే ఇప్పుడు వైసీపీ శ్రేణులను టెన్షన్ పెడుతున్నాయ్. బయటకు గంభీరంగా నటిస్తున్నా.. లోపల మాత్రం వైసీపీని టెన్షన్ వెంటాడుతోంది. ఐతే వైసీపీదే అధికారం అని.. 2024లో మాత్రమే కాదు.. 2029లోనూ ఆయనే సీఎం అంటూ.. ఈ మధ్య వేణుస్వామి ఓ స్టేట్‌మెంట్ పాస్ చేశారు. అంతన్నారు.. ఇంతన్నారు..
ఇలా అవుతోంది ఏంటి అంటూ.. వైసీపీ శ్రేణులు, జగన్ (CM Jagan) అభిమానులు.. వేణుస్వామి మీద గుర్రుగా ఉన్నారు. నిజానికి ఈ మధ్య వేణుస్వామి జాతకం కరెక్ట్ లేదు అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుంది.. కేటీఆర్‌కు సీఎం యోగం ఉందన్నారు.. అదీ తుస్సుమంది.. సన్‌రైజర్స్ కప్ కొడుతుంది.. కావ్య మారన్ జాతకంలో ఉంది.. గ్రహాలు క్రికెట్ ఆడుతున్నాయని.. బల్లగుద్ది మరీ చెప్పారు.. అదీ పాయె ! ఇప్పుడు వైసీపీ విషయంలోనూ ఫలితం తేడా కొట్టేలా ఉందని.. వేణుస్వామి ఎక్కడ అని.. అంతా వెతుకున్నారు. ఫలితాలు వచ్చి.. అంతా నార్మల్ అయ్యేవరకు ఎవరికీ కనిపించకుంటేనే బెటర్.. దొరికారో అంతే.. ఎందుకొచ్చిన గొడవ జాగ్రత్త అని మరికొందరు సలహాలు ఇస్తున్నారు. మరి వేణుస్వామి జోతిష్యం నిజం అవుతుందా.. వైసీపీ గెలుస్తుందా లేదంటే.. కూటమి సంచలనాలు క్రియేట్ చేస్తుందా తెలియాలంటే.. ఇంకొన్ని గంటలు ఎదురుచూడాల్సిందే.