గుడ్లవల్లేరు కాలేజీలో డ్ర*గ్స్‌? మొత్తం వ్యహారం ఎలా మొలైందంటే

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కాలేజీ హాస్టల్‌ గర్ల్స్‌ వాష్‌రూమ్‌లో హిడెన్‌ కెమరాల వ్యవహారంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పేరు మోసిన ఇంజనీరింగ్‌ కాలేజీ హాస్టల్లో గర్ల్స్‌ బాత్రూంలో సీక్రెట్‌ కెమరాలు పెట్టారంటూ విద్యార్థినిలు అర్థరాత్రి ఆందోళనకు దిగారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 30, 2024 | 08:25 PMLast Updated on: Aug 30, 2024 | 8:25 PM

Drugs In Gudlavalleru College How Did The Whole Affair Unfold

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కాలేజీ హాస్టల్‌ గర్ల్స్‌ వాష్‌రూమ్‌లో హిడెన్‌ కెమరాల వ్యవహారంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పేరు మోసిన ఇంజనీరింగ్‌ కాలేజీ హాస్టల్లో గర్ల్స్‌ బాత్రూంలో సీక్రెట్‌ కెమరాలు పెట్టారంటూ విద్యార్థినిలు అర్థరాత్రి ఆందోళనకు దిగారు. ఇక ఈ ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అమ్మాయిల బాత్‌రూంలో కెమెరా పెట్టేందుకు నిందితుడికి ఓ అమ్మాయి సపోర్ట్‌ చేసింది అని స్టూడెంట్స్‌ మాట్లాడుకున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది.

ఇదే కాలేజీలో చదువుతున్న ఓ అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌తో ఓయోకు వెళ్లింది. అక్కడ వాళ్లు ఏకాంతగా గడిపిన వీడియోను ఆ అబ్బాయి రికార్డ్‌ చేసుకున్నాడు. ఆ వీడియోలు తన ఫ్రెండ్స్‌కు ఫార్వర్డ్‌ చేశాడు. ఆ వీడియో అమ్మాయికి చూపించి నిందితుడు ఆమెను బెదిరించినట్టు తెలుస్తోంది. తాను చెప్పినట్టు బాత్‌రూంలో కెమెరాలు పెట్టకపోతే వీడియోలు వైరల్‌ చేస్తానంటూ బెదిరించడంతో ఆ అమ్మాయి గర్ల్స్‌ బాత్‌రూంలో కెమెరా పెట్టినట్టు సమాచారం.

ఈ విషయం అమ్మాయి తండ్రికి చెప్తే ఆయనే రివర్స్‌లో కాలేజీ మేనేజ్‌మెంట్‌ను బెదిరించారని స్టూడెంట్స్‌ చెప్తున్నారు. తన కూతురి పేరు బయటికి చెప్తే కాలేజీ మీద డ్రగ్స్‌ కేసు బుక్‌ చేయించి కాలేజీ మూతపడేలా చేస్తానని బెదిరించినట్టు తెలుస్తోంది. అమ్మాయి ఫ్యామిలీ పొలిటిక్‌ బ్యాగ్రౌండ్‌ ఉన్న ఫ్యామిలీ కావడంతో మేనేజ్‌మెంట్‌ కూడా సైలెంట్‌ అయ్యారని.. తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తే తమనే కొడుతున్నారంటూ ఓ విద్యార్థిని మాట్లాడిన ఆడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. దాదాపు 2 నెలల నుంచి ఈ వ్యవహారం జరగుతున్నట్టు తెలుస్తోంది. హిడెన్‌ కెమరాల వ్యవహారంలో పోలీసులు ఫైనల్‌ ఇయర్‌ అబ్బాయిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అతడి వద్ద నుంచి ల్యాప్‌టాప్‌, మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారం బయటకు రావడంతో.