ED on Vijaysai REddy : విజయసాయిరెడ్డిపై ఈడీ ఉచ్చు…. అంత క్యాష్ ఎక్కడిది ?
శాంతితో ఇల్లీగల్ కనెక్షన్ ఉందో లేదో గానీ... వాళ్ళిద్దరి ఆర్థిక సంబంధాలు కూడా బయటకు వచ్చాయి. శాంతికి విజయవాడలో విల్లా కొనుక్కోడానికి తన ఇంట్లో నుంచి కోటీ 60 లక్షల రూపాయల నగదు ఇచ్చినట్టు ఆమె భర్త మదన్ మోహన్ ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించి అన్ని ఎవిడెన్స్ లు ఉన్నాయన్నారు. అంత డబ్బులు విజయ్ సాయి రెడ్డికి ఎక్కడి నుంచి వచ్చాయో లెక్క చెపాల్సి వస్తోంది. మదన్ మోహన్ పకడ్బందీగా వివరాలు చెబుతుండటంతో... ఈ వ్యవహారంలో ఈడీ రంగంలోకి దిగుతున్నట్టు సమాచారం
వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డిపై ఈడీ ఉచ్చు బిగుసుకుంటోంది. దేవాదాయ శాఖ మాజీ ఆఫీసర్ శాంతికి ఇచ్చిన కోటీ 60 లక్షల క్యాష్ తో పాటు… దేవాదాయ శాఖ భూముల్లో అక్రమాలపైనా ఈడీ విచారణ చేయబోతోంది. శాంతితో అక్రమ సంబంధం వ్యవహారంలో ఇప్పటికే విజయ్ సాయి రెడ్డి అడ్డంగా బుక్కయ్యారు. పుట్టిన బిడ్డకు విజయ్ సాయి రెడ్డే తండ్రి అని శాంతి మొదటి భర్త మదన్ మోహన్ ఆరోపిస్తున్నారు. డీఎన్ఏ టెస్టుకు కూడా డిమాండ్ చేస్తున్నాడు. దాంతో విజయసాయి రెడ్డి డిఫెన్స్ లో పడ్డారు. నిజానికి ఇలాంటి వ్యవహారాల్లో ఆచి తూచి తప్పుంచుకోవాలి… కానీ ప్రెస్ మీట్ పెట్టి…. మీడియాపై నోరు పారేసుకోవడం… సవాళ్ళు చేయడంతో… ఈ వ్యవహారాన్ని ప్రతి ఒక్కరూ ఛాలెంజ్ గా తీసుకున్నారు.
శాంతితో ఇల్లీగల్ కనెక్షన్ ఉందో లేదో గానీ… వాళ్ళిద్దరి ఆర్థిక సంబంధాలు కూడా బయటకు వచ్చాయి. శాంతికి విజయవాడలో విల్లా కొనుక్కోడానికి తన ఇంట్లో నుంచి కోటీ 60 లక్షల రూపాయల నగదు ఇచ్చినట్టు ఆమె భర్త మదన్ మోహన్ ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించి అన్ని ఎవిడెన్స్ లు ఉన్నాయన్నారు. అంత డబ్బులు విజయ్ సాయి రెడ్డికి ఎక్కడి నుంచి వచ్చాయో లెక్క చెపాల్సి వస్తోంది. మదన్ మోహన్ పకడ్బందీగా వివరాలు చెబుతుండటంతో… ఈ వ్యవహారంలో ఈడీ రంగంలోకి దిగుతున్నట్టు సమాచారం. ఇప్పటికే జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఈడీ, సీబీఐ కేసుల్లో… విజయ్ సాయి రెడ్డి కూడా పీకల్లోతుగా కూరుకుపోయారు. కొత్తగా శాంతికి ఇచ్చిన డబ్బుల వ్యవహారంలోనూ ఈడీ విచారణ ఎదుర్కోవాల్సి వస్తోంది.
శాంతి – విజయ్ సాయిరెడ్డిని కలిపింది ప్రేమ సమాజం భూములే. విశాఖ జిల్లాలో దేవాలయ భూముల లీజుల రద్దు విషయంలో శాంతి ఇచ్చిన రిపోర్టే కీలకం. దీనిపైనే భారీగా అవకతవకలు జరిగినట్టు ఆరోపణలొస్తున్నాయి. అదే నిజమైతే… ఈ వ్యవహారంపైనా ఈడీ విచారణ చేసే అవకాశాలు ఉన్నాయి.