CM Jagan : ఇప్పుడ కూడా కాన్ఫిడెన్స్ తగ్గట్లే.. ఏం చూసుకొని ఇంత ధైర్యం జగన్..
కొన్ని గంటలు.. ఇంకొన్ని గంటలు అంతే.. ఉత్కంఠ రేపుతున్న ఏపీ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయ్. నాలుగోతేదీ మధ్యాహ్నానికి.. విజేత ఎవరో తేలిపోతుంది. తెలుగు రాష్ట్రాలు.. ఏపీ ఫలితాల కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నాయ్. ఐతే ఇండియాటుడే మై యాక్సిస్‌తో సహా.. మెజారిటీ ఎగ్జిట్‌పోల్స్ కూటమిదే విజయం అని.. జగన్ నుంచి అధికారం లాక్కోవడం ఖాయం అని అంచనా వేస్తున్నాయ్.
కొన్ని గంటలు.. ఇంకొన్ని గంటలు అంతే.. ఉత్కంఠ రేపుతున్న ఏపీ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయ్. నాలుగోతేదీ మధ్యాహ్నానికి.. విజేత ఎవరో తేలిపోతుంది. తెలుగు రాష్ట్రాలు.. ఏపీ ఫలితాల కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నాయ్. ఐతే ఇండియాటుడే మై యాక్సిస్‌తో సహా.. మెజారిటీ ఎగ్జిట్‌పోల్స్ కూటమిదే విజయం అని.. జగన్ నుంచి అధికారం లాక్కోవడం ఖాయం అని అంచనా వేస్తున్నాయ్. ఐతే ఇంత జరుగతున్నా.. జగన్ కాన్ఫిడెన్స్ మాత్రం తగ్గినట్లు కనిపించడం లేదు. పోలింగ్ ముగిసిన రోజు నుంచి ఇప్పటివరకు.. అదే ధీమాతో కనిపిస్తున్నారు. ఎగ్జిట్‌పోల్స్ ద్వారా కచ్చితమైన రిజల్ట్ ఏంటి అనే చెప్పే పరిస్థితి లేకుండా పోయింది.
ఐతే గెలుపుపై ధీమాగా ఉన్న జగన్.. పార్టీ శ్రేణులకు పదేపదే అదే విషయాన్ని చెప్తున్నారు. ఎగ్జిట్ పోల్స్, సర్వే రిపోర్ట్‌లు ఇవేవీ పట్టించుకోనట్టుగానే జగన్ వ్యవహరిస్తున్నారు. కచ్చితంగా గెలుపు మనదేనని.. 9న విశాఖలో ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్తూ వస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై పార్టీ కీలక నేతలతో జగన్ చర్చించారు. భవిష్యత్తు కార్యాచరణపైన దిశా నిర్దేశం చేశారు. కౌంటింగ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు అనేక మార్గాల్లో సేకరించిన సమాచారంపైన లోతుగా అధ్యయనం తర్వాత.. ఒక నిర్ణయానికి వచ్చారు. ఐప్యాక్ టీంతో జరిగిన సమావేశంలో 2019 కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని జగన్ చెప్పారు. ఇప్పటికే అదే అంచనాలతో ఉన్నారు. ఫలితంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని.. కచ్చితంగా భారీ విజయం దక్కబోతోందని.. నమ్మకం పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక ఎన్నికల ఫలితాలు విడుదల కాబోతుండడంతో.. గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలతో ఆరో తేదీన తాడేపల్లిలో సమావేశం ఏర్పాటు చేయాలని జగన్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కౌంటింగ్ తర్వాత ప్రతి ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వాలని, ఎంపీ అభ్యర్థులతో సహా అందరూ తాడేపల్లిలో అందుబాటులో ఉండాలని జగన్ సూచించారట. ఐతే ఇంత జరుగుతున్నా.. ఇలాంటి ఎగ్జిట్‌పోల్స్ వస్తున్నా.. జగన్ ఏంటయ్యా నీ ధైర్యం అంటూ నెటిజన్లు అవాక్కవుతున్నారు.