Purandheswari : పురందేశ్వరికి నో మినిస్ట్రీ.. స్పీకర్ ఇస్తారా… రాకుండా అడ్డుకుందెవరు ?
ఏపీ బీజేపీ (AP BJP) అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరికి (Purandeshwari) ఈసారి మోడీ కేబినెట్ లో చోటు దక్కుతుందని అంతా ఆశించారు. ఆమె కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. విద్యాశాఖ మంత్రి ఇచ్చే అవకాశం ఉందని కూడా టాక్ నడిచింది.
ఏపీ బీజేపీ (AP BJP) అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరికి (Purandeshwari) ఈసారి మోడీ కేబినెట్ లో చోటు దక్కుతుందని అంతా ఆశించారు. ఆమె కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. విద్యాశాఖ మంత్రి ఇచ్చే అవకాశం ఉందని కూడా టాక్ నడిచింది. కానీ పురందేశ్వరిని కాకుండా నరసాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మకు మంత్రి పదవి ఇచ్చారు ప్రధాని నరేంద్రమోడీ. 30యేళ్ళుగా అంకిత భావంతో పనిచేసిన సామాన్య కార్యకర్తకు మంత్రిగా అవకాశం ఇవ్వడం అందరూ సంతోషించదగినదే. కానీ ఏపీలో కూటమి జట్టు కట్టడంలో కీలకంగా వ్యవహరించడంతో… పార్టీకి అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరికి మొండి చెయ్యి చూపించడం ఏంటని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పురంధేశ్వరికి లోక్ సభ స్పీకర్ (Lok Sabha Speaker) ఇస్తారన్న టాక్ ఒకటి నడుస్తోంది. ఎన్టీఆర్ (NTR) కూతురైన పురందేశ్వరి… అప్పట్లో అన్నగారికి స్పీచెస్ రాసి ఇచ్చేవారని అంటారు. ఆమె సేవలను స్పీకర్ గా వాడుకోవాలని బీజేపీ (BJP) నిర్ణయించిందని అనుచరులు చెబుతున్నారు. ఒకవేళ స్పీకర్ అయితే మాత్రం ఆ పదవి చేపట్టే నాలుగో తెలుగు వ్యక్తిగా రికార్డులకు ఎక్కుతారు పురంధేశ్వరి. అయితే గత పార్లమెంట్ లో కంటే… ఈసారి ప్రతిపక్షం బలంగా ఉంది. అపోజిషన్ పార్టీ ఎంపీల సంఖ్య బాగా పెరిగింది.
ఈ టైమ్ లో పురంధేశ్వరికి లోక్ సభ స్పీకర్ ఇస్తారా అన్నది డౌటే అంటున్నారు కొందరు పరిశీలకులు. అపోజిషన్ ను గట్టిగా హ్యాండిల్ చేయగలిగే వారికి స్పీకర్ ఛాన్స్ ఇస్తారని చెబుతున్నారు. అయితే పురంధేశ్వరికి మంత్రి పదవి రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని కొందరు అంటున్నారు. ఏపీ నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన పెమ్మసాని చంద్రశేఖర్ కి కేబినెట్ లో చోటు ఇచ్చారు. మరో మంత్రిపదవి కూడా అదే కులానికి ఇవ్వడం కరెక్ట్ కాదన్న వాదనతోనే పురంధేశ్వరిని పక్కనబెట్టారని అంటున్నారు. ఇందులో ఎంత నిజమో కానీ… గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన పురందేశ్వరికి మాత్రం బీజేపీ రాబోయే రోజుల్లో మంచి ప్రియారిటీయే ఇస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.