FAKE ON CBN : అమిత్ షా కాళ్ళు మొక్కాడని.. బాబుపై ఫేక్ న్యూస్ !

టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) నాయుడు ఢిల్లీలో బీజేపీ (BJP) పెద్దలను కలిసేందుకు వెళ్ళారు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే అంశంపై మాట్లాడేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుసుకున్నారు. చర్చలు జరిపారు. అయితే అక్కడ చంద్రబాబు... అమిత్ షా (Amit Shah) కాళ్ళు మొక్కినట్టుగా ఓ ఫోటో సోషల్ మీడియా(Social media) లో వైరల్ అవుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 8, 2024 | 08:56 AMLast Updated on: Feb 08, 2024 | 9:32 AM

Fake News On Babu That Amit Shah Has Planted His Legs

టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) నాయుడు ఢిల్లీలో బీజేపీ (BJP) పెద్దలను కలిసేందుకు వెళ్ళారు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే అంశంపై మాట్లాడేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుసుకున్నారు. చర్చలు జరిపారు. అయితే అక్కడ చంద్రబాబు… అమిత్ షా (Amit Shah) కాళ్ళు మొక్కినట్టుగా ఓ ఫోటో సోషల్ మీడియా(Social media) లో వైరల్ అవుతోంది. బీజేపీ పెద్దల దగ్గర బాబు సాగిలపడ్డారంటూ ఈ మార్ఫింగ్ ఫోటోను కొందరు కేటుగాళ్ళు మీడియాకు వదిలారు. దాంతో క్షణాల్లోనే అది వైరల్ అయింది. కానీ ఇది ఫేక్ న్యూస్ అని డయల్ న్యూస్ ఆధారాలతో సహా బయటపెట్టింది.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సీజన్ కావడంతో … ఏ చిన్న అవకాశాన్నైనా వాడుకోవాలని అన్ని రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికి కూడా తెగబడుతున్నాయి కొన్ని పార్టీలు. అందులో భాగమే… టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి మార్ఫింగ్ ఫోటో. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పొత్తుల విషయమై బీజేపీ పెద్దలతో మాట్లాడటానికి బాబు ఢిల్లీకి వెళ్ళారు. ఇప్పటికే ఏపీలో టీడీపీ- జనసేన (TDP- Janasena) జత కట్టాయి. బీజేపీ కూడా ఈ కూటమిలో చేరనుంది. దానికి సంబంధించి మాట్లాడేందుకు ఢిల్లీకి రావాలని చంద్రబాబుకు బీజేపీ పెద్దల నుంచి పిలుపు రావడంతో ఆయన వెళ్ళారు.

ఢిల్లీలో అమిత్ షాను కలిసి పొత్తులు, సీట్ల షేరింగ్ మీద మాట్లాడారు టీడీపీ అధినేత చంద్రబాబు. కానీ ఆయన అమిత్ షాను చూడగానే కాళ్ళ మీద పడిపోయినట్టు… వంగి నమస్కారం చేసినట్టు కొందరు ఫేక్ గాళ్ళు మార్ఫింగ్ ఫోటోలతో సోషల్ మీడియాలో ఫేక్ ఫోటోలను షేర్ చేశారు. మీడియా సంస్థలు కూడా అది ఒరిజినల్ ఫోటోనా… ఫేక్ ఫోటోనా అని నిజా నిజాలు తెలుసుకోకుండా వైరల్ చేశాయి. అయితే చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు… 2018 జూన్ 21 నాడు అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు ఆసనాలు వేశారు. ఆ సందర్భంగా ఆయన కిందకి వంగున్నారు. అప్పట్లో చంద్రబాబు వెరైటీ ఆసనాలు పేరుతో ఆ విజువల్స్, ఫోటోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ అయ్యాయి. కానీ ఆ ఫోటోను తెచ్చి… అమిత్ షా కాళ్ళ ముందు వంగి దండం పెడుతున్నట్టుగా మార్ఫింగ్ చేశారు కేటుగాళ్ళు. అమిత్ షా కాళ్ళు మొక్కడం సంచలనంగా మారింది అంటూ తప్పుడు కథనాలు రాశాయి కొన్ని మీడియా సంస్థలు. అది మార్ఫింగ్ చేసిన ఫోటో… ఒరిజినల్ కాదని డయల్ న్యూస్ తేల్చింది.

బాబు ఫోటోల మార్ఫింగ్ పై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఏపీలో బాబుని డ్యామేజ్ చేయడానికి ఇంత దారుణానికి పాల్పడతారా అని ఫైర్ అవుతున్నారు. బీజేపీతో జత కట్టడం ఇష్టంలేని వైసీపీ లీడర్లే ఈ మార్ఫింగ్ చేయించారని… వైసీపీ సోషల్ మీడియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే బాబు మాట్లాడిన వీడియోలకు తప్పుడు ఆడియోలు జతచేసి… వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తోందని టీడీపీ లీడర్లు ఆరోపిస్తున్నారు. జనం ఏది నిజమో తెలుసుకోవాలని కోరారు.