AP politics : ఇక బీజేపీతో దూరమే ! బాబు-పవన్ సంచలన నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీతో కలసి పోటీ చేయడంపై టీడీపీ-జనసేన ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు- పవన్ కల్యాణ్ మధ్య శనివారం నాడు జరిగిన చర్చల్లో బీజేపీతో కలసి వెళ్ళాలా.. వద్దా అన్నదానిపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. బీజేపీతో కలిసి వెళితే వచ్చే లాభం ఏంటి.. నష్టం ఏంటి అన్న దానిపై సుదీర్ఘంగానే చర్చ నడిచింది. ఈ సంగతిని పవన్ కల్యాణ్.. చంద్రబాబు దృష్టికి తెచ్చినట్టు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీతో కలసి పోటీ చేయడంపై టీడీపీ-జనసేన ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు- పవన్ కల్యాణ్ మధ్య శనివారం నాడు జరిగిన చర్చల్లో బీజేపీతో కలసి వెళ్ళాలా.. వద్దా అన్నదానిపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. బీజేపీతో కలిసి వెళితే వచ్చే లాభం ఏంటి.. నష్టం ఏంటి అన్న దానిపై సుదీర్ఘంగానే చర్చ నడిచింది. ఈ సంగతిని పవన్ కల్యాణ్.. చంద్రబాబు దృష్టికి తెచ్చినట్టు సమాచారం. గత ఎన్నికల్లో జరిగిన పరిణామాలను చంద్రబాబు – పవన్ విశ్లేషించుకున్నారు. ఏపీ గురించి బీజేపీ జాతీయ నాయకత్వం ఆలోచనలు, ప్రణాళికలను చంద్రబాబు దగ్గర ప్రస్తావించారు పవన్.
ఇటీవల జరిగిన ఏపీ బీజేపీ నేతల సమావేశం సారాంశాన్ని వివరించారు నాదెండ్ల మనోహర్. ఏపీ బీజేపీ మీటింగ్ తర్వాత.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి వచ్చి నాందెడ్లతో మాట్లాడారు కూడా.. ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే లాభం కంటే నష్టమే ఎక్కువని టీడీపీ సీనియర్ నేతలు మొదటి నుంచీ వాదిస్తున్నారు. ఆ పార్టీతో టై అప్ అయితే.. మైనారిటీ ఓటు బ్యాంక్ నష్టపోతామని బాబుకు ముందు నుంచీ చెబుతున్నారు. దాంతో బాబు ఇప్పటిదాకా బీజేపీతో పొత్తులు ఉంటాయా.. ఉండవా అన్న దానిపై మాట్లాడటం లేదు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం తాను NDA లోనే ఉన్నాననీ.. బీజేపీతో కలిసే ఎన్నికలకు వెళతామని అంటున్నారు. కానీ బాబు-పవన్ భేటీలో బీజేపీతో ఆచి తూచి వ్యవహరించాలనే అభిప్రాయానికొచ్చినట్టు సమాచారం.
బీజేపీ అధిష్టానం కూడా టీడీపీ కూటమితో పొత్తు ఉంటుందా లేదా అన్నది ఇంకా తేల్చలేదు. బహుశా ఈనెల 22న రామమందిరం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అయిన తర్వాత పొలిటికల్ ఇష్యూస్ పై బీజేపీ దృష్టి పెట్టే ఛాన్సుంది. ఏపీ బీజేపీ నేతలు టీడీపీతో పొత్తు ఉంటేనే బెటర్ అని భావిస్తున్నారు. తమ అభిప్రాయాలను అధిష్టానానికి కూడా పంపారు. కానీ ఢిల్లీ బీజేపీ పెద్దలు మాత్రం.. ఒంటరి పోరుకు వెళితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు. గతంలో సీట్ల షేరింగ్ వల్లే.. ఏపీలో బీజేపీ ఎదగలేకపోయిందని అంటున్నారు. ఒంటరి పోరుపై ఆ పార్టీ గ్రౌండ్ వర్క్ కూడా ఏపీలో నిర్వహిస్తోంది.
రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీజేపీకి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి. ఎవరిని పోటీలోకి దింపితే విజయం సాధిస్తామన్నదానిపై సర్వేలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుండటంతో.. తాము కూడా ఏపీలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ నియోజవర్గాల్లో అభ్యర్థులను దింపితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు. తెలంగాణలో ఒంటరి పోరుతోనే గతం కంటే ఎక్కువ సీట్లు వచ్చాయనీ.. ఏపీలో కూడా అలాంటి పరిస్థితి వస్తుందని ఢిల్లీ బీజేపీ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే టీడీపీ కూటమితో పొత్తు సంగతి తేల్చకుండానే.. ఒంటరి పోరుపైనా కమలం పార్టీ నేతలు ఆలోచన చేస్తున్నారు.
బీజేపీతో ఉంటామని మొదటి నుంచీ చెప్పుకొస్తున్న పవన్ కల్యాణ్.. ఇప్పుడు బాబు మాట విని కమలనాధులకు గుడ్ బై చెబుతారా.. లేదా అన్నది మరికొన్ని రోజుల్లో తేలనుంది.
బాబు-పవన్ భేటీలో తమ కూటమిలో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. ఇప్పటికే రెండు పార్టీల అధినేతలు నియోజకవర్గాల్లో సర్వేలు చేయించారు. ఈ సర్వేల ఆధారంగా ఎలాంటి వివాదం లేని నియోజకవర్గాల్లో సంక్రాంతి రోజున పాతికమందితో టీడీపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేస్తుందని అంటున్నారు. మరి జనసేన కూడా అదే రోజు కొంతమంది అభ్యర్థులతో లిస్ట్ బయటపెడుతుందా.. లేదా అన్నది చూడాలి.