Pawan Kalyana : పవన్‌ను తిట్టినవాళ్లంతా ఔట్
ఎట్టికేలకు ఏపీ ఫలితం తేలింది. ఏపీ ప్రజలంతా కూటమికే జై కొట్టారు. వైసీపీకి దిమ్మతిరి బొమ్మ కనిపించే స్థాయిలో కూటమికి సీట్లు ఇచ్చారు. వైసీపీకి ఏ స్థాయిలో దెబ్బ తగిలిందంటే కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.
ఎట్టికేలకు ఏపీ ఫలితం తేలింది. ఏపీ ప్రజలంతా కూటమికే జై కొట్టారు. వైసీపీకి దిమ్మతిరి బొమ్మ కనిపించే స్థాయిలో కూటమికి సీట్లు ఇచ్చారు. వైసీపీకి ఏ స్థాయిలో దెబ్బ తగిలిందంటే కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఇదంతా ఎలా ఉన్నా.. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తిట్టిన చాలామంది నేతలు ఎన్నికలో ఓడిపోయారు. నిజానికి పవన్‌ను తిట్టేందుకు వైసీపీలో ఓ బ్యాచ్ ఉంటుంది.
కేవలం జనసేనను, సేనానిని తిట్టడమే వాళ్ల పనా అన్నట్లు కనిపిస్తుంటుంది సీన్. మూడు పెళ్లిళ్లు అని, దత్తపుత్రుడు అని, కాపులను చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టారని.. ఇలా పవన్ టార్గెట్‌గా తిట్ల దండకం చదివిన నేతలందరూ.. ఓటమి చవిచూశారు. కేవలం పవన్‌ను తిట్టడమే కారణమా అంటే.. ఇదే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. పవన్ మీద నోరు పారేసుకున్న వాళ్లు.. బండ బూతులు తిట్టిన వాళ్లు.. అసభ్యంగా, అసహ్యంగా మాట్లాడిన వాళ్లు.. వాళ్లందరినీ జనం తిరస్కరించారు. నిజానికి ఈ తీర్పును పోలింగ్ బూతుల దగ్గరే జనం మాట్లాడుకున్నారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానితో పాటు పవన్ అంటే అంతెత్తు ఎగిరే పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టుకు జనాలు షాక్ ఇచ్చారు.
ఇక నగరి నుంచి మంత్రి రోజా, మా కులపోడు అంటూ తిట్టే సత్తెనపల్లి ఎమ్మెల్యే, మంత్రి అంబటి రాంబాబు.. గాజువాకలో గుడివాడ అమర్నాథ్, పెనమలూరులో జోగి రమేష్, కాకినాడలో చంద్ర శేఖర్ రెడ్డి.. వీళ్లందరికీ ఓటమి హై చెప్పింది. నిజానికి ఈసారి పోలింగ్ భారీగా నమోదు కావడంలో మహిళలు, వృద్ధులతో పాటు యూత్ కూడా కీ రోల్ ప్లే చేశారు. యూత్‌లో మెజారిటీ ఫాలోయింగ్ పవన్ కల్యాణ్‌కే ఉంది. ఆ యూత్ అంతా కలిసి వీళ్లను ఓడించేశారు. దీంతో పవన్‌ను తిట్టిన ప్రతీ నోరు ఫలితాల రోజు సైలెంట్ అయ్యింది.