YS Jagan Dharna : నేడు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఏపీ మాజీ సీఎం జగన్ ధర్నా.. మద్దతిచ్చిన యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్
ఏపీ మాజీ సీఎం జగన్ నేడు ఢిల్లీలో ధర్నా మొదలైంది. ఇందుకోసం నిన్నే హస్తినకు చేరుకున్న మాజీ సీఎం జగన్ ఇవాళ.. జంతర్ మంతర్‌లో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులతో నిరసన తెలుపుతున్నారు.
ఏపీ మాజీ సీఎం జగన్ నేడు ఢిల్లీలో ధర్నా మొదలైంది. ఇందుకోసం నిన్నే హస్తినకు చేరుకున్న మాజీ సీఎం జగన్ ఇవాళ.. జంతర్ మంతర్‌లో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులతో నిరసన తెలుపుతున్నారు. గత 50 రోజుల్లో 36 హత్యలు, వెయ్యికి పైగా దాడులతో కూటమి ప్రభుత్వం మారణహోమం సాగిస్తోందని జగన్ తెలిపారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వ దారుణకాండపై కలిసి వచ్చే పార్టీలన్నింటినీ కలుపుకుని పోరాటం చేసేందుకు సిద్ధమయ్యామని తెలిపారు. మద్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహించారు. జంతర్ మంతర్ వద్ద మాజీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతు.. టీడీపీ మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ ను బ్లడ్ బుక్ గా రూపాంతరం చెందిస్తున్నాడు అని ఎద్దేవ చేశారు. టీడీపీ శ్రేణుల చర్యలతో సామాన్యులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూన్నారు. రెడ్ బుక్ పేరుతో కక్ష రాజకీయం చేస్తున్నారు అని వెల్లడించారు. రాష్ట్రంలో 36 హత్యలు జరిగిన ఏపీ హోం మంత్రి ఎందుకు విచారణ చేయ్యడం లేదు అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.
జగన్ ధర్నా కు.. అఖిలేష్ యాదవ్ మద్దతు..
కాగా ఢిల్లీలో జగన్ ధర్నాకు యూపీ ఎస్పీ అధినేత మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సంఘీభావం ప్రకటించారు. ప్రాణాలు తీయడం హింసను ప్రేరేపించడం రాష్ట్ర ప్రజలకు మంచిది కాదని ఏపీ ప్రభుత్వానికి వెల్లడించారు. ఒక్కోక్క సారి అధికారంలో ఉండోచ్చు.. ఉండకపోవచ్చు అంతమాత్రాన ప్రతిపక్షాల పై హత్య రాజకీయాలు సమన్యసం కాదని అఖిలేష్ యాదవ్ చెప్పుకోచ్చారు. యూపీలో బుల్డోజర్ ప్రభుత్వం వచ్చి దాదాపు ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏపీలో ఏన్డీఎ ప్రభుత్వం అధికారం లో ఉంది. ఎన్డీయే అధికారంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో దాదాపు ఇదే పరిస్థితులు ఉన్నాయి. యూపీలోని ఎన్డీఏ ప్రభుత్వంలో నేను పోరాడుతున్నారు. అలాగే ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం తోను వైఎస్ జగన్ పోరాడుతున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఈ సంస్కృతి మంచిది కాదని ఏపీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు.
ప్రధాని మోదీ జగన్ అపాయింట్ మెంట్…
రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్ జగన్ లేఖ రాశారు. ఇప్పటికే ప్రధాని అపాయింట్‌మెంట్ కోరారు. వినుకొండలో హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కూడా కలిసి రాష్ట్రంలో విధ్వంసకాండపై ఫిర్యాదు చేశారు. కాగా టీడీపీ నేతలు చేస్తున్న మారణకాండకు సంబంధించి ఫొటోలు, వీడియోలు వంటి సాక్ష్యాధారాలున్నప్పటికీ పోలీసు యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వైసీపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు.