Kodali Nani : వైసీపీ మాజీ మంత్రి.. కొడాలి నానికి అస్వస్థత..
ఏపీలో వైసీపీ మాజీ మంత్రి, గుడివాడ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్ధి కొడాలి నాని ఇవాళ అస్వస్థతకు గురయ్యారు.

Former minister of YSP.. Kodali is sick..
ఏపీలో వైసీపీ మాజీ మంత్రి, గుడివాడ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్ధి కొడాలి నాని ఇవాళ అస్వస్థతకు గురయ్యారు. గుడివాడలోని తన స్వగృహంలో కార్యకర్తలు, నేతలతో భేటీ అయి మాట్లాడుతున్న సమయంలో అకస్మాత్తుగా YCP నాయకులతో మాట్లాడుతూ.. సోఫాలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో అప్రమత్తమైన నేతలు, గన్మెన్లు సపర్యలు చేసి.. డాక్టర్లకు సమాచారం అందించారు. ప్రథమ చికిత్స అనంతరం కొడాలి నాని కి వైద్యులు సెలైన్ బాటిల్ ఎక్కించినట్లుగా తెలుస్తోంది. ఎక్కువగా ఆలోచించడం వల్ల ఇలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చాయని వైద్యులు తెలియజేశారు. ఈ ఘటన జరిగినప్పుడు కుటుంబ సభ్యులు ఎవరూ ఇంట్లో లేరు.
కొడాలి అనారోగ్యానికి గురైన విషయాన్ని సిబ్బంది కుటుంబ సభ్యులకు తెలిపారు. కొడాలి నాని కుటుంబికులు హైదరాబాద్ నుంచి హుటాహుటిన బయలుదేరి గుడివాడకు వస్తున్నట్లు తెలుస్తోంది.