Vallabhaneni Vamsi : గన్నవరంలో వైసీపీ మాజీ మంత్రి వల్లభనేని వంశీ అరెస్ట్…
వైసీపీ(YCP) మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) ని గన్నవరం పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి వంశీ గన్నవరం వచ్చారు.

Former YCP MLA Vallabhaneni Vamsi was arrested by Gannavaram police.
వైసీపీ(YCP) మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) ని గన్నవరం పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి వంశీ గన్నవరం వచ్చారు. గన్నవరం దగ్గరలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అనంతరం వంశీని గన్నవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి ఘటనలో ఆయనను అరెస్ట్ చేశారు. కాగా టీడీపీ (TDP) ఆఫీస్‌పై దాడి కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఈ మాజీ ఎమ్మెల్యే A-71గా ఉన్నారు. అటు వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు యూసఫ్ పఠాన్ ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. మరో అనుచరుడు రమేశ్ ను నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నారు. గన్నవరంలో టీడీపీ పార్టీ కార్యాలయం (TDP party office) పై దాడి కేసులో వంశీని 71వ ముద్దాయిగా పోలీసులు పేర్కొన్నారు.
ఇప్పటికే ఈ కేసులో 18 మందిని అరెస్ట్ చేశారు. దాడిలో వంశీ నేరుగా పాల్గొనకపోయినా.. ఎమ్మెల్యే హోదాలో ఆయన ప్రోద్బలంతోనే వైసీపీ మూకలు విధ్వంసం సృష్టించాయనే ఆరోపణలున్నాయి. మరో వైపు అరెస్ట్ చేసిన వారిలో చాలా మంది దాడుల వెనక మాంత్రి హోదాలో వల్లభనేని వంశీ ఉన్నారని.. వాంగ్మూలం ఇచ్చినట్లు తెసుస్తోంది. దీంతో ఏపీ పోలీసులు ఈ కేసులో వల్లభనేని వంశీని ఏ1గా మార్చాలని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం..
ఇక ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం (TDP coalition government) అధికారంలోకి వచ్చి దాదాపు రెండు నెలలు కావస్తోంది. ఇప్పటికే వివిధ కేసుల్లో వైసీపీ నేతలను అరెస్టు చూస్తుంది అక్కడి ప్రభుత్వం.. కాగా మాజీ మంత్రిని అరెస్ట్ చేయడం ఇదే తొలి సారి.. అందులోను గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని టార్గెట్ గా చేసి హుటాహుటిన అరెస్ట్ చేశారు.