Jagan Sarkar : ఏపీలోనూ మహిళలకు ఫ్రీ బస్సు.. జగన్ సర్కార్ సంచలన నిర్ణయం!
గ్యారంటీ పథకాలు.. కాదు కాదు ఉచితాల చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయాలు. ఒకరకంగా జగన్‌కు అధికార పీఠం దగ్గర చేసింది కూడా అలాంటి గ్యారంటీలే. ఉచిత పథకాలే రికార్డు స్థాయి విజయంతో జగన్‌ను సీఎం చేశాయ్ అనడంలో ఎలాంటి అనుమానం లేదు. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారాన్ని దగ్గర చేసింది కూడా.. అలాంటి ఉచిత గ్యారంటీలే ! కాంగ్రెస్ విజయం నుంచి తెలుసుకున్నారో.. ముందే అనుకున్నారో కానీ.. ఆరు గ్యారంటీలను పోలిన గ్యారంటీలను టీడీపీ అధినేత చంద్రబాబు.. ఏపీ జనాల మీద గుప్పిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని.. ఇప్పటికే సభల్లో చంద్రబాబు హామీ ఇస్తున్నారు.
గ్యారంటీ పథకాలు.. కాదు కాదు ఉచితాల చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయాలు. ఒకరకంగా జగన్‌కు అధికార పీఠం దగ్గర చేసింది కూడా అలాంటి గ్యారంటీలే. ఉచిత పథకాలే రికార్డు స్థాయి విజయంతో జగన్‌ను సీఎం చేశాయ్ అనడంలో ఎలాంటి అనుమానం లేదు. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారాన్ని దగ్గర చేసింది కూడా.. అలాంటి ఉచిత గ్యారంటీలే ! కాంగ్రెస్ విజయం నుంచి తెలుసుకున్నారో.. ముందే అనుకున్నారో కానీ.. ఆరు గ్యారంటీలను పోలిన గ్యారంటీలను టీడీపీ అధినేత చంద్రబాబు.. ఏపీ జనాల మీద గుప్పిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని.. ఇప్పటికే సభల్లో చంద్రబాబు హామీ ఇస్తున్నారు. మహిళల ఫ్రీ జర్నీ స్కీమ్‌పై భారీ స్థాయిలో ప్రచారం కూడా చేస్తున్నారు. ఐతే ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం స్కీమ్‌పై అధికార వైసీపీ కూడా ఫోకస్ పెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయ్.
ఫ్రీ జర్నీ స్కీమ్ వైపు మహిళలు మొగ్గు చూపుతుండడంతో సీఎం జగన్.. ఆ దిశగా దృష్టి సారించారన్న ప్రచారం ఊపందుకుంది. ఈ విషయంలో ప్రతిపక్షానికి చాన్స్ ఇవ్వకూడదనే ఉద్దేశంతో.. అధికారంలో ఉన్న వైసీపీ.. ముందుగానే మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. సంక్రాంతి తర్వాత అమలుకు జగన్ సర్కార్ ప్రణాళికలు రచిస్తున్నారని తెలుస్తోంది. సంబంధిత అధికారుల నుంచి ఇప్పటికే రిపోర్ట్ కూడా తీసుకున్నట్లు టాక్. సంస్థపై ఎంత భారం పడుతుంది.. కర్నాటక, తెలంగాణలో అమలు చేశాక పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్న అంశాలపై నివేదిక ఇచ్చారు ఆర్టీసీ అధికారులు. సాధారణ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేసి.. లగ్జరీ బస్సుల్లో రాయితీ ఇవ్వటంపైనా పరిశీలన చేస్తున్నారు. నిర్ణయం తీసుకుంటే.. పురుషులు, ఆటో డ్రైవర్ల సమస్యలకు ఎలా చెక్ పెట్టాలన్న అంశంపై కూడా సమాలోచనలు చేస్తున్నారు.
రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత.. ఏపీఎస్ ఆర్టీసీ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం నెలకు 3వందల కోట్లు జీతాలు చెల్లిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 40లక్షల మంది.. ఆర్టీసీ బస్సుల్లో ట్రావెల్ చేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలయితే.. ఆర్టీసీకి రోజుకు నాలుగు కోట్ల రూపాయల ఆదాయం తగ్గుతుందని అంచనా. సంక్రాంతి కానుకగా మహిళలకు ఏపీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని సీఎం జగన్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.