TTD : శ్రీవారి భక్తులకు శుభ వార్త.. మే నెల దర్శన టికెట్ల విడుదల తేదీ ప్రకటన..
తిరుమల భక్తులకు శుభ వార్త.. నేడు ఆన్ లైన్ లో తిరుమల శ్రీవారి మే నెల దర్శనం టికెట్లు విడుదల చేయనున్నారు. మే నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమల అర్చన, అష్టదళపాదపద్మారాధన సేవ టికెట్లు ఇవాళ ఉదయం 10 గంటల నుంచి ఆన్ లైన్ లో లక్కీడిప్ నమోదు చేయనుంది టీటీడీ.

Good news for Srivari devotees.. May darshan tickets release date announcement..
తిరుమల భక్తులకు శుభ వార్త.. నేడు ఆన్ లైన్ లో తిరుమల శ్రీవారి మే నెల దర్శనం టికెట్లు విడుదల చేయనున్నారు. మే నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమల అర్చన, అష్టదళపాదపద్మారాధన సేవ టికెట్లు ఇవాళ ఉదయం 10 గంటల నుంచి ఆన్ లైన్ లో లక్కీడిప్ నమోదు చేయనుంది టీటీడీ.
ఇక తిరుమలలో ఈనెల 22న ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఉంజల్ సేవా, సహస్రదీపాలంకరణ టికెట్లు.. మద్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా దర్శనం టికెట్లు విడుదల చేస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
ఈనెల 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు, శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం, గదుల కోటాను ఈనెల 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. వృద్ధులు, దివ్యాంగులకు దర్శన టోకెన్ల కోటాను ఈనెల 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనం 300 టికెట్ల కోటాను ఈనెల 24వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.
తిరుమలలో భక్తులకు వసతి గదుల బుకింగ్ మే నెల గదుల కోటాను ఫిబ్రవరి 24న మధ్యహానం 3 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేస్తారు. ఇక ఫిబ్రవరి 27న శ్రీవారి సేవ ఉదయం 11 గంటలకు శ్రీవారి సేవ మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ, మధ్యాహ్నం 2 గంటలకు పరకామణి సేవ కోటాను ఆన్ లైన్ లో విడుదల చేయ్యాలని టీటీడీ దేవస్థానం అధికారులకు సూచించారు.