Gorantla Butchaiah Chaudhary : రేపు ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి బాధ్యతలు.. నన్ను మించిన సీనియర్ ఎవడుండు పార్టీలో
ఏపీ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి నియమించినట్టు తెలుస్తుంది. ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేసినట్టు బుచ్చయ్యచౌదరికి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఫోన్ చేసినట్టు తెలుస్తుంది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా ఏపీ కొత్త ప్రభుత్వం ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడి పేరును వెల్లడించారు. ఈ నెల 22న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ ను, డిప్యూటీ స్పీకర్ ను అధికారికంగా ఎన్నుకోనున్నారు.
ఏపీ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి నియమించినట్టు తెలుస్తుంది. ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేసినట్టు బుచ్చయ్యచౌదరికి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఫోన్ చేసినట్టు తెలుస్తుంది. రేపు ప్రొటెం స్పీకర్‌గా రేపు తాను బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పారు.
ఈ నేపథ్యంలోనే రేపు గవర్నర్ దగ్గర ప్రొటెం స్పీకర్‌గా బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం ఎల్లుండి శాసన సభలో ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించనున్నట్టు తెలుస్తుంది. కాగా సీఎం చంద్రబాబు తర్వాత అత్యధికంగా ఏడుసార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ‘ఎవరైనా సీనియర్లు ఉంటే చూడమని పార్టీ పెద్దలను అడిగా.. ఏడోసారి ఎమ్మెల్యేగా ఉన్నందున నన్నే కొనసాగమని కోరారు. దీంతో ప్రొటెం స్పీకర్ గా బుచ్చయ్య చౌదరి నియమించినట్లు తెలిపోయింది. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అనంతరం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నిర్వహించనున్నారు. స్పీకర్ పదవికి మరో సీనియర్ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు పేరు ఖరారైన విషయం తెలిసిందే. ఈ నెల 22, 23 స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక రాష్ట్రంలో ఐదేళ్లుగా విధ్వంసమైన వ్యవస్థను గాడిలో పెట్టడమే మా ప్రభుత్వం ముందున్న లక్ష్యం. ఆ దిశగా ముందుకెళ్తాం’ అని ఆయన వెల్లడించారు.