Gudivada Amarnath: పాపం గుడివాడ.. కోడిగుడ్డే అమర్నాథ్‌కు టికెట్ దూరం చేసిందా..?

అనకాపల్లి నియోజకవర్గ బాధ్యతల నుంచి మంత్రి అమర్నాథ్‌ను తప్పించారు. అమర్నాథ్‌ బాధ్యతను కులసాల భరత్‌కు అప్పగించారు. దీంతో అమర్నాథ్‌కు ఊహించని షాక్‌ తగిలింది. రీసెంట్‌గా భరత్‌ పరిచయ వేదికలో కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 4, 2024 | 04:26 PMLast Updated on: Jan 04, 2024 | 4:26 PM

Gudivada Amarnath Removed As Incharge Of Anakapalli Constituency Of Ycp

Gudivada Amarnath: ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. 175కి 175 సీట్లు గెలవడమే లక్ష్యంగా.. తన ముందు ఉన్న అన్ని ఆప్షన్స్‌ను వాడుకుంటున్నారు సీఎం జగన్‌. ఇందులో భాగంగానే చాలా మంది సిట్టింగ్‌లను మారుస్తున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో సింట్టింగ్‌లను మార్చగా.. రీసెంట్‌గా మరో 27 మందిని మారుస్తూ మరో లిస్ట్‌ విడుదల చేశారు. ఇందులో అనకాపల్లి నియోజకవర్గ బాధ్యతల నుంచి మంత్రి అమర్నాథ్‌ను తప్పించారు. అమర్నాథ్‌ బాధ్యతను కులసాల భరత్‌కు అప్పగించారు. దీంతో అమర్నాథ్‌కు ఊహించని షాక్‌ తగిలింది. రీసెంట్‌గా భరత్‌ పరిచయ వేదికలో కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు.

YS JAGAN: కేసీఆర్‌తో జగన్‌ రహస్య చర్చలు.. ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారు..?

తనకు వైసీపీ కార్యకర్త అనే పదవి కంటే ఏ పదవీ పెద్దది కాదంటూ చెప్పారు. కానీ అమర్నాథ్‌ను ఆ ప్లేస్‌ నుంచి తప్పించినందుకు చాలా కారణలే ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీ పొలిటికల్ సర్కిల్లో మంత్రి గుడివాడ అమర్నాథ్ ట్రోల్ అయినట్టు.. మరే నాయకుడు కాలేదు. అభివృద్ధి విషయంలో కోడిగుడ్డు కామెంట్‌తో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ అయ్యారు అమర్నాథ్‌. అది మొదలు ఆయన ఏం మాట్లాడినా క్షణాల్లో వైరల్ అవుతోంది. మంత్రి అమర్‌ అంటేనే ఓ కామెడీ పీస్‌ అన్నట్టుగా సోషల్‌ మీడియాలో నెగటివ్‌ హైప్‌ క్రియేట్‌ అయ్యింది. దీనికి తోడు నియోజకవర్గంలో ఎక్కడలేని వ్యతిరేకత ఏర్పడింది. దీంతో కక్కలేని.. మింగలేని పరిస్థితి ఏర్పడింది. వచ్చే ఎన్నికల్లో అమర్‌ గెలిచే పరిస్థితి లేదని అర్ధం చేసుకున్న జగన్‌.. ఆ ప్లేస్‌ను భరత్‌కు అప్పగించారు. దీంతో ఇప్పుడు అమర్నాథ్‌ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. కనీసం ఎంపీగానో, పక్క నియోజకవర్గం ఇన్చార్జిగానో కూడా ఆయనను నియమించలేదు.

అనకాపల్లి మిస్‌ ఐనా చోడవరం, ఎలమంచిలి వంటి నియోజకవర్గాలపై అమర్నాథ్‌ ఆశలు పెట్టుకున్నారు. కానీ అక్కడ సీనియర్లు కరణం ధర్మశ్రీ, కన్నబాబు రాజులు ఉన్నారు. వారిని తప్పించి అమర్నాథ్‌కు ఇవ్వడం కష్టం. అందుకే అమర్నాథ్‌ను హోల్డ్‌లో పెట్టారు. కనీసం ఎక్కడ ఛాన్స్ ఇస్తారో కూడా హింట్ ఇవ్వలేదు. ఇప్పుడు అనకాపల్లికి దూరం కావాల్సి వచ్చింది. సొంత నియోజకవర్గానికి కానివాడిగా మారిపోయారు. చోడవరంలో వేలు పెడితే ధర్మశ్రీ ఊరుకోరు.. ఎలమంచిలిలో కలుగజేసుకుంటే కన్నబాబు రాజు కస్సుబుస్సులాడుతారు. దీంతో తన పరిస్థితి ఏంటో తనకే అర్థం కాని సిచ్యువేషన్‌లో ఉన్నాడు అమర్నాథ్‌.