TDP, Keshineni : టీడీపీలో కేశినేని ట్రబుల్స్..

తెలుగుదేశంలో కేశినేని ట్రావెల్స్ ఆగిపోయినట్టేనా! పదిహేనేళ్ల జర్నీకి బ్రేకులు పడినట్టేనా? నాని ఫ్యామిలీ బాబుకు దండం పెట్టినట్టేనా? ఈ ప్రశ్నలకు ఆన్సర్- అవుననే వస్తోంది! ఆల్మోస్ట్ తెలుగుదేశంతో కేశినేని నాని కుటుంబం తెగదెంపులు చేసుకున్నట్టే అని చెప్పొచ్చు. తాజాగా తండ్రి బాటలోనే కూతురు కూడా టీడీపీకి గుడ్‌బై చెప్పారు. కార్పొరేటర్‌గా ఉన్న కేశినేని శ్వేత పదవికి రాజీనామా చేశారు. విజయవాడ 11వ డివిజన్‌ కార్పొరేటర్‌గా ఉన్న శ్వేత మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో రాజీనామా లేఖను అందజేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 8, 2024 | 12:23 PMLast Updated on: Jan 08, 2024 | 12:23 PM

Has Keshineni Travels Stopped In Telugu Fifteen Years Of Journey Like Brakes

ఏమండోయ్ నానిగారూ అంటే పలకడం లేదు! మీరైనా చెప్పండోయ్ చిన్నిగారూ అన్నా లాభం లేదు! కన్నా.. బుజ్జీ అని బతిమాలినా వినలేదు! తండ్రే కాదన్నప్పుడు తానెందుకు అని కూతురు కూడా.. బాబుకో నమస్కారం అన్నారు! ఇదీ.. టీడీపీలో కేశినేని ట్రబుల్స్ వ్యవహారం!

తెలుగుదేశంలో కేశినేని ట్రావెల్స్ ఆగిపోయినట్టేనా! పదిహేనేళ్ల జర్నీకి బ్రేకులు పడినట్టేనా? నాని ఫ్యామిలీ బాబుకు దండం పెట్టినట్టేనా? ఈ ప్రశ్నలకు ఆన్సర్- అవుననే వస్తోంది! ఆల్మోస్ట్ తెలుగుదేశంతో కేశినేని నాని కుటుంబం తెగదెంపులు చేసుకున్నట్టే అని చెప్పొచ్చు. తాజాగా తండ్రి బాటలోనే కూతురు కూడా టీడీపీకి గుడ్‌బై చెప్పారు. కార్పొరేటర్‌గా ఉన్న కేశినేని శ్వేత పదవికి రాజీనామా చేశారు. విజయవాడ 11వ డివిజన్‌ కార్పొరేటర్‌గా ఉన్న శ్వేత మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో రాజీనామా లేఖను అందజేశారు. పదవితో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా ఇస్తానని ఆమె అప్పటికే ట్విట్టర్‌లో క్లారిటీ ఇచ్చారు. నిజానికి గత మున్సిపల్ ఎన్నికల సమయంలో శ్వేతకు మేయర్‌ పదవి రాలేదనే విషయంలో కేశినేని నానిలో అసంతృప్తి మొదలైంది. ఆమెకు మేయర్ పదవి ఇవ్వొద్దని నాని వ్యతిరేక వర్గం పావులు కదిపింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కేశినేని నాని, ఆయన కూతురు శ్వేత టీడీపీని వీడాలని నిర్ణయించుకున్నారు. కార్పొరేటర్‌ పదవి వచ్చేలా సహకరించినందుకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ ఇంటికి వెళ్లి ఆమె థాంక్స్ చెప్పారు.

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టీడీపీ నానిని వ్యూహాత్మంగానే పొమ్మనలేక పొగబెట్టిందా… ఒకవేళ నానిని కావాలనే పార్టీ నుంచి వెళ్లగొట్టే ప్రయత్నమే అయితే.. డ్యామేజీ కంట్రోల్ చేయడానికి కారణమేంటి? తమ్ముడు చిన్నితో లౌక్యంగా మాట్లాడించడం వెనుక మర్మం ఏంటి? కనక మేడల రవీంద్ర కుమార్‌ని రంగంలోకి ఎందుకు దించారు? నానీ.. కన్నా.. బుజ్జీ…. అని బతిమాలడానికి రీజనేంటి? తిరువూరు సభకు రావాలని దూతలతో చెప్పి పంపడం వెనుక వ్యూహం ఏంటి? ప్రోటోకాల్ పేరుతో నాని ఫోటోలు, ఫ్లెక్సీలు పెట్టడంలో ఉద్దేశమేంటి? సభకు రాను అని చెప్పాక కూడా, ప్రొటోకాల్ పేరుతో కుర్చీ వేయడం వెనుక మతలబ్ ఏంటి? ఈ ప్రశ్నలపై బెజవాడ పొలిటికల్ సర్కిల్ రకరకాలుగా చర్చించుకుంటోంది.

నష్ట నివారణ చర్యల్లో భాగంగా బాబు ఏం చేసినా.. మీకో నమస్కారం అని ముఖంమీదే చెప్పినట్టు సమాచారం. తిరువూరు సభలో టీడీపీ ఎత్తుగడపై ఎంపీ నాని వ్యంగ్యంగా స్పందించారు. ఇప్పుడు ప్రొటోకాల్‌ పాటించారు సరే.. గతంలో ఎందుకు మారిచారు.. అప్పుడు గుర్తు రాలేదా అని రివర్స్ ఎటాక్ చేశారు. టెక్నికల్‌గా రాజీనామా ఆమోదం లేటు కావొచ్చేమో కానీ.. బయటకు వెళ్లడం మాత్రం పక్కా అని ఇప్పటికే నాని క్లారిటీ ఇచ్చారు. ఈసారి కూడా విజయవాడ ఎంపీగానే పోటీ చేస్తానని కూడా మరోసారి స్పష్టం చేశారు. అయితే ఆ పోటీ- ఇతర పార్టీ నుంచి వుంటుందా? లేక ఇండిపెండెంటుగా బరిలోకి దిగుతారా అన్నది కొద్దిరోజులు ఆగితేగానీ తెలియదు.