Heavy rain : తెలంగాణలో ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన…
తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేటి నుంచి బుధవారం వరకు బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేటి నుంచి బుధవారం వరకు బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్‌లో ఇవాళ ఉదయం ఆకాశం మేఘావృతమై ఉంది. సాయంత్రానికి వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఇవాళ ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ .. నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన ఆవర్తనం ప్రభావంతో ఉత్తర ఒడిశా తీరం వద్ద వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. ఇది సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తులో ఏర్పడిందని వాతావరణ కేంద్రం పేర్కొంది.
నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు
APలోని పలు జిల్లాల్లో నేడు వర్షాలు పడతాయని APSDMA వెల్లడించింది. అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ. గో, ఏలూరు, కృష్ణా, NTR, GNR, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, నెల్లూరు, నంద్యాల, SSS, పార్వతీపురం, YSR, అన్నమయ్య, చిత్తూరు, TRPT జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.