Vangalapudi Anita : హోం మినిస్టర్‌ అనిత సెల్యూట్‌ మేడం

28 ఏళ్లకే పొలిటికల్‌ ఎంట్రీ. రెండేళ్లలోనే ఎమ్మెల్యే పదవి. పనిలో సమర్థత.. అధినేత పట్ల విధేయత.. ఇవే వంగలపూడి అనితను నేడు ఆంధ్రరాష్ట్రానికి హోంమంత్రిని చేశాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 14, 2024 | 04:41 PMLast Updated on: Jun 14, 2024 | 4:41 PM

Home Minister Anita Salute Madam

 

 

28 ఏళ్లకే పొలిటికల్‌ ఎంట్రీ. రెండేళ్లలోనే ఎమ్మెల్యే పదవి. పనిలో సమర్థత.. అధినేత పట్ల విధేయత.. ఇవే వంగలపూడి అనితను నేడు ఆంధ్రరాష్ట్రానికి హోంమంత్రిని చేశాయి. జిల్లాలో ఎందరో సీనియర్లు ఉన్నా.. వాళ్లందరినీ కాదనీ అత్యంత కీలకమైన హోంమంత్రి పదవి ఆమెకు ఇచ్చారంటే.. పార్టీ విషయంలో పని విషయంలో ఆమె ఎంత సమర్థంగా ఉంటారో అర్థం చేసుకోవచ్చు. 1984 జనవరి 1 న విశాఖపట్నం జిల్లా, ఎస్.రాయవరం మండలంలోని లింగరాజుపాలెం గ్రామానికి చెందిన వంగలపూడి అప్పారావు దంపతులకు జన్మించారు అనిత. స్వతహాగా మంచి విద్యావంతురాలైన అనిత 2009లో ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఎం.ఏ.ఎంఈడీ పూర్తి చేశారు. ఆ తరువాత అప్పటి ప్రభుత్వంలో లెక్చురర్‌గా పని చేశారు. ఓ పక్క విద్యాబోధన చేస్తూ మరోపక్క రాష్ట్ర సమస్యలపై దృష్టి సారించారు అనిత. రాజీకీయాల మీద ఆసక్తితో 2012లో 28 ఏళ్ల వయసులో ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చారు.

చంద్రబాబు నాయుడు సారథ్యంలో టీడీపీలో చేరారు. పాలిటిక్స్‌లోకి వచ్చిన రెండేళ్లలోనే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. అప్పటి నుంచి తనదైన శైలిలో పార్టీ కోసం పని చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అనిత. దీంతో ఆమెకు టీడీపీ బోర్డు సభ్యురాలి పదవి ఇచ్చి ఎంకరేజ్‌ చేశారు సీఎం చంద్రబాబు. ఇక 2019లో కొవ్వూరు నుంచి పోటీ చేసిన అనిత తన ప్రత్యర్థి తానేటి వనిత చేతిలో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో టీడీపీ కూడా ఘోరంగా ఓడిపోయింది. మంచి వాక్‌ఛాతుర్యం ఉన్న అనితను తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించారు చంద్రాబుబ. పార్టీ అధికారంలో లేకున్నా ప్రత్యర్థులను అప్పటికప్పు డిఫెండ్‌ చేస్తూనే వచ్చారు అనిత. ఎన్ని అవమానాలు ఎదురైనా ఎవరెన్ని మాటలు అన్నా మానసికంగా ధైర్యంగా నిలబడి పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. రాష్ట్రలోని సమస్యలపై తనకున్న సుదీర్ఘ అనుభవంలో అధికార పక్షాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ పార్టీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇక ఈ ఎన్నికల్లో భాగంగా కూటమి అభ్యర్థిగా పాయకరావుపేట నుంచి బరిలో దిగి 25 వేల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీ ఒడుదొడుకుల్లో పార్టీకి ఊతంగా ఉన్న అనితను సీఎం చంద్రబాబు తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. అత్యంత కీలక పదవుల్లో ఒకటైన హెంశాఖను ఆమెను ఇచ్చిన ఆమె బలాన్ని మరింత పెంచారు. ఒక టీచర్‌గా తన జీవితాన్ని ప్రారంభించి.. ఎక్కడ అవమానాలు పడ్డారో అక్కడే నిలబడి నేడు రాష్ట్రానికి రక్షణ కల్పించే స్థానంలో ఉన్నారు ఏపీ హోం మినిస్టర్‌ వంగలపూడి అనిత.