Chintamaneni Prabhakar : పరారీలో చింతమనేని.. ఎందుకు.. ఎక్కడున్నాడు…
ఏపీలో పోలింగ్ తర్వాత.. పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయ్. అల్లర్లు, దాడులతో.. రాష్ట్రం అట్టుడికిపోతోంది. పల్నాడు, తాడిపత్రి రచ్చ కొనసాగుతుండగానే.. దెందులూరులో ఇదే సీన్ ఉంది.
ఏపీలో పోలింగ్ తర్వాత.. పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయ్. అల్లర్లు, దాడులతో.. రాష్ట్రం అట్టుడికిపోతోంది. పల్నాడు, తాడిపత్రి రచ్చ కొనసాగుతుండగానే.. దెందులూరులో ఇదే సీన్ ఉంది. దెందులూరు నియోజకవర్గ టీడీపీ (TDP) అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ (Chintamaneni Prabhakar) ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఆయనతో పాటు 12 మంది అనుచరులు కూడా పరారీలో ఉన్నారని.. పోలీసులు తెలిపారు. పోలింగ్ సందర్భంగా పెదవేగి మండలం కొప్పులవారిగూడెంలోని ఓ పోలింగ్ బూత్ సమీపంలో జరిగిన హత్యాయత్నం ఘటనలో నిందితుడైన తాళ్లూరి రాజశేఖర్‌ని.. పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ సమాచారం తెలుసుకున్న చింతమనేని.. తన అనుచరులు 14 మందితో కలిసి పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి రచ్చ చేశారు. స్టేషన్‌లో ఎస్‌ఐ విధుల్లో ఉండగానే.. లాకప్‌లో ఉన్న నిందితుడిని బలవంతంగా తీసుకెళ్లిపోయారనే టాక్ ఉంది. దీంతో పోలీసులు చింతమనేనిపై, అతని అనుచరులపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన పెద్ద సంచలనమే సృష్టించింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. 24 గంటల వ్యవధిలోనే నిందితుడు తాళ్లూరి రాజశేఖర్‌ని పట్టుకున్నారు.
ఆ వెంటనే అతన్ని కోర్టులో హాజరుపరచగా.. అతనికి జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. నిందితుడిని పీఎస్ నుంచి బలవంతంగా తీసుకెళ్లిన చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు పరారీలో ఉన్నారని అధికారులు చెప్తున్నారు. ఐతే చింతమనేని ప్రభాకర్.. రాష్ట్రం విడిచి వెళ్లిపోయారని, శని, ఆదివారాలు సెలవు రోజులు కావడంతో.. బెయిల్ దొరికే అవకాశం ఉండదనే ఉద్దేశంతో ఆయన పరారయ్యారని భావిస్తున్నారు. యాంటిసిపేటరీ బెయిల్ దొరికిన తర్వాత మాత్రమే… బయటికి వచ్చే అవకాశముందని తెలుస్తోంది.