AP CM Jagan : ఓడిపోయినా బాధ పడను ! ఎన్నికల ముందు జగన్ లో నిరాశ
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) కు ఇంకా మూడు నెలలు మాత్రమే టైమ్ ఉంది. ఈ టైమ్ లో ఏపీసీఎం జగన్ ఇప్పటికిప్పుడు దిగిపోడానికి రెడీగా ఉన్నాననీ... ఓడిపోయినా బాధపడనని చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. ప్రజల అభిమానం తనకు ఉందంటూనే... ఇలాంటి కామెంట్స్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) కు ఇంకా మూడు నెలలు మాత్రమే టైమ్ ఉంది. ఈ టైమ్ లో ఏపీసీఎం జగన్ ఇప్పటికిప్పుడు దిగిపోడానికి రెడీగా ఉన్నాననీ… ఓడిపోయినా బాధపడనని చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. ప్రజల అభిమానం తనకు ఉందంటూనే… ఇలాంటి కామెంట్స్ చేశారు. రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించే జగన్ ఈ కామెంట్స్ చేశాడా అన్ని అనుమానాలు వస్తున్నాయి. తిరుపతిలో జరిగిన ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ లో కాంగ్రెస్ పార్టీపైనా మొదటిసారిగా విమర్శలు చేశారు జగన్.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల (AP Assembly Elections) ముందు సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తిరుపతి (Tirupati) లో ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ సమ్మిట్ లో రాజకీయాలపైనా చర్చ జరిగింది. ప్రోగ్రామ్ హోస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ ఏపీ పాలిటిక్స్ పై అడిగిన ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పారు. 56 నెలలు అధికారంలో ఉన్నా… బాగానే పనిచేశా… ఇప్పటికిప్పుడు దిగిపోడానికి కూడా బాధపడను అని జగన్ కామెంట్ చేశారు. దాంతో అసెంబ్లీ ఎన్నికల ముందు జగన్ స్వరంలో ఎందుకు నిరాశ కనిపించింది అన్న చర్చ నడుస్తోంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ … ఇలాగే కామెంట్ చేశారు. అప్పటికే కాంగ్రెస్ వేవ్ నడుస్తుండటం… ఓడిపోతున్నామన్న బాధతతోనే ఆయన కామెంట్ చేసినట్టు చెప్పుకున్నారు.
ఇప్పుడు జగన్ కి కూడా ఇలాంటి సీన్ ఏపీలో కనిపిస్తోందా… రాబోయేది టీడీపీ-జనసేన (TDP-Janasena) ప్రభుత్వం అని ఆయన ఓ నిర్ణయానికి వచ్చేశారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. బాబు,పవన్, షర్మిల అంతా కలసి వచ్చినా మళ్ళీ తామే గెలుస్తామని ఇప్పటిదాకా బీరాలు పోయిన వైసీపీ లీడర్లు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని నెటిజెన్స్ అడుగుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎప్పుడూ కాంగ్రెస్ పై విమర్శలు చేయని జగన్ ఇప్పుడు మొదటిసారిగా ఆ పార్టీని టార్గెట్ చేశారు. అప్పుడు అడ్డగోలుగా రాష్ట్రాన్ని… ఇప్పుడు కుటుంబాన్ని విభజించారని కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు జగన్. షర్మిల ఏపీసీసీ చీఫ్ కావడంతో ఈ ఆరోపణలు చేశారు. డర్టీ పాలిటిక్స్ (Dirty politics) చేయడం కాంగ్రెస్ కు అలవాటేననీ…వాళ్ళ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారని మండిపడ్డారు. అలాగే తమ కుటుంబంలోనూ చిచ్చు పెట్టిందన్నారు.
ఏపీలో ఇంగ్లీష్ మీడియం (AP English Medium) ద్వారా ఇంటర్నేషనల్, ఆన్ లైన్ కోర్సులు అందిస్తున్నామని జగన్ చెప్పుకొచ్చారు. కానీ ఉన్నత విద్య చదివినవారికి ఉపాధి మాటేంటన్న ప్రశ్నకు తడబడ్డారు. అయితే విద్యా సదస్సులో రాజకీయ ప్రశ్నలు అడగడంపై విద్యావేత్తల మండిపడుతున్నారు. గతంలోనూ జగనన్న విద్యాదీవెన లాంటి కార్యక్రమాల్లో… పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పెళ్ళిళ్ళ గురించి… చంద్రబాబు (Chandrababu), లోకేష్ పైనా విమర్శలు చేశారు జగన్. ఇప్పుడు కూడా విద్యాసదస్సును పాలిటిక్స్ కి కూడా ఉపయోగించుకున్నట్టు అర్థమవుతోంది.