Raghurama : కూటమి అధికారంలోకి వస్తే.. రఘురామకు దక్కే పదవి ఇదేనా ?
ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. పెరిగిన పోలింగ్ శాతం.. ఎవరికి అనుకూలం, ఎవరికి దెబ్బేస్తుందన్న సంగతి ఎలా ఉన్నా.. వైసీపీ, కూటమి గెలుపుపై ధీమాగా కనిపిస్తున్నాయ్. దీంతో ఓటర్ తీర్పు ఎలా ఉండబోతుంది.. ఈవీఎంల్లో ఏముంది అన్నది టెన్షన్ పుట్టిస్తోంది.
ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. పెరిగిన పోలింగ్ శాతం.. ఎవరికి అనుకూలం, ఎవరికి దెబ్బేస్తుందన్న సంగతి ఎలా ఉన్నా.. వైసీపీ, కూటమి గెలుపుపై ధీమాగా కనిపిస్తున్నాయ్. దీంతో ఓటర్ తీర్పు ఎలా ఉండబోతుంది.. ఈవీఎంల్లో ఏముంది అన్నది టెన్షన్ పుట్టిస్తోంది. పోలింగ్‌కు, ఫలితాలకు చాలా గ్యాప్ ఉండడంతో.. రోజుకో ప్రచారం తెరమీదకు వస్తోంది. పదవుల విషయంలో జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఇప్పుడు రఘురామ విషయంలోనూ ఇలాంటి డిస్కషనే జరుగుతోంది. రఘరామకు గెలిస్తే.. కూటమి ప్రభుత్వంలో దక్కబోయే పదవి ఇదే అంటూ.. కొత్త ప్రచారం ఊపందుకుంది.
2019లో వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన రఘురామ.. ఆ తర్వాత రెబెల్‌గా మారారు. ఎన్నికల ముందు టీడీపీలో చేరి.. ఉండి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఉండి అనేది టీడీపీ కంచుకోట. 2019లో జగన్ ప్రభంజనంలోనూ ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. దీంతో ఈసారి కూడా ఉండిలో రఘురామ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని.. టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. జగన్ మీద రగిలిపోతున్న రఘురమా.. కూటమి అధికారంలోకి వస్తే ఆయనకు మరింత ప్రమాదంగా మారే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయితే.. రఘురామ హోంమంత్రి అవుతారని.. లేదంటే స్పీకర్ పదవి చేపడతారనే చర్చ జోరుగా సాగుతోంది.
ఈ రెండింట్లో ఏ పదవి చేపట్టినా…. అది వైసీపీకి, జగన్‌కు ప్రమాదంగా మారే చాన్స్ ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. జగన్‌పై కోపంతో ఊగిపోతున్న రఘురామ.. అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో కూటమి అధికారంలోకి వస్తే.. కీలక పదవి దక్కితే.. సీన్ ఇంకోలా ఉండే చాన్స్ ఉంది. ఈ ఎన్నికల్లో కూటమి విజయం ఖాయం అని ఫిక్స్ అయిన రఘురామ.. తన దూకుడు మరింత పెంచుతున్నారు. మే 13న పోలింగ్ రోజున వైసీపీకి జనాలు సమాధి కట్టారని… జూన్ 4 ఫలితాలు వెలువడే రోజున పెద్ద కర్మ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక రఘురామకే హోం మంత్రి పదవి ఇస్తారని ఆయన అభిమానులు, అనుచరులు ముందే సంబరాల్లో మునిగిపోతున్నారు. మరోవైపు స్పీకర్ పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. మరి చంద్రబాబు మనసులో ఏముంది.. ఉండిలో ఈయన గెలుస్తారా.. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తుందా లేదా అంటే ఇంకొన్నిరోజులు ఎదురుచూడాల్సిందే..