YCP : వైసీపీ బతకాలంటే.. షర్మిల రావాల్సిందేనా ?

థంబ్‌నెయిల్ చూసి.. ఇదేం లాజిక్ అనుకోకండి.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో జరుగుతున్న చర్చ ఇదే ! ఏపీలో ప్రభుత్వం మారింది. వైసీపీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. 11 సీట్లకు మాత్రమే పరిమితం అయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 12, 2024 | 10:17 AMLast Updated on: Jul 12, 2024 | 10:17 AM

If Ycp Is To Survive Does Sharmila Have To Come

 

 

థంబ్‌నెయిల్ చూసి.. ఇదేం లాజిక్ అనుకోకండి.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో జరుగుతున్న చర్చ ఇదే ! ఏపీలో ప్రభుత్వం మారింది. వైసీపీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. 11 సీట్లకు మాత్రమే పరిమితం అయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఇలాంటి పరిణామాల మధ్య జగన్ అసెంబ్లీకి వెళ్తారో లేదో అన్నది కూడా అనుమానమే! ఇదంతా ఎలా ఉన్నా.. వైసీపీ హయాంలో జరిగిన అవకతవకలపై.. చంద్రబాబు సర్కార్‌ ప్రత్యేక దృష్టి సారించింది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలపై.. వరుసగా కేసులు వేస్తోంది.

ఈ కేసుల వ్యవహారం.. ఎప్పుడో ఒకరోజు జగన్‌ వరకు వచ్చే చాన్స్ ఉంది. ఆయన జైలుకు వెళ్లడం ఆలస్యం అవొచ్చేమో కానీ.. వెళ్లడం మాత్రం పక్కా అంటూ ఇప్పటి నుంచే అంచనాలు వినిపిస్తున్నాయ్. అదే జరిగితే వైసీపీ పరిస్థితి ఏంటి.. బలగం ఉన్నా బలం లేని పరిస్థితుల్లో ఫ్యాన్‌ పార్టీ బతికి బట్ట కడుతుందా అనే చర్చ మొదలైంది. జైలుకెళ్లే పరిస్థితులు వస్తే.. జగన్ స్థానంలో వైఎస్ కుటుంబం నుంచే ఎవరో ఒకరు పార్టీ పగ్గాలు అందుకోవాలి. లేదంటే పార్టీ ప్రయాణం మళ్లీ జీరో నుంచి మొదలుపెట్టాల్సిందే. మరి విజయమ్మ ఆ పని చేస్తారా.. పోనీ జగన్ సతీమణి భారతీ చేయగలరా అంటే.. ఆ ఇద్దరితో సాధ్యం అయ్యే పరిస్థితి లేదు. మీడియా ముందు మాట్లాడడమే వాళ్లకు కష్టం. అలాంటిది అధికార పార్టీని ఢీకొట్టి పార్టీని నిలబెట్టడం అంటే.. అంత ఈజీ కాదు అనే చర్చ జరుగుతోంది. అంటే ఇప్పుడు ఎలా చూసినా.. కనిపిస్తున్న ఆప్షన్‌ షర్మిల మాత్రమే. తిరిగి సొంతగూటికి వచ్చేయ్‌ చెల్లెమ్మ అంటూ.. సోషల్‌ మీడియాలో కొత్త ప్రచారం మొదలైంది.

ఎలాగూ కడప ఎంపీ అవినాశ్ రాజీనామాపై చర్చ జరుగుతోంది. వచ్చి.. అక్కడి నుంచి పోటీ చేసి పార్టీ పగ్గాలు అందుకోవమ్మా అంటూ.. వైఎస్ ఫ్యామిలీ సానుభూతిపరులు ఇప్పుడు కొత్త చర్చ మొదలుపెట్టారు. మరి జగన్ పేరు చెప్తే భగ్గుమంటున్న షర్మిల.. దీనికి అంగీకరిస్తారా లేదా అన్న సంగతి ఎలా ఉన్నా.. చర్చ జరుగుతున్నట్లు జగన్‌ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితులు వస్తే.. షర్మిల మాత్రమే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. గతంలో జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీని బతికించింది షర్మిలనే ! అన్న వదిలిన బాణాన్ని అంటూ.. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలు చేపట్టి వైసీపీకి ప్రాణం పోసింది. జగన్ మీద సింపథీ తీసుకురాగలిగారు షర్మిల. అలాంటి పరిస్థితే మళ్లీ వచ్చే చాన్స్ ఉందని.. అదే జరిగితే పుట్టింటికి రా షర్మిల అంటూ.. వైఎస్ అభిమానులు కామెంట్లు పెడుతున్న పరిస్థితి.