YS Sharmi : గర్వపడుతున్నా నాన్న.. మిస్ యూ.. ఫాదర్స్ డే రోజు షర్మిల ఎమోషనల్ పోస్ట్..
అమ్మ ప్రాణం పోస్తే.. ఆ జీవితానికి ఆశ కలిగించేది నాన్న. ఆశయాన్ని నేర్పించేది నాన్న. ఆశలకు, ఆశయానికి మధ్య వారధిలా నిలిచేది నాన్న. బాధ్యత ద్వారానే ప్రేమను చూపిస్తాడు తండ్రి.

I'm proud dad.. Miss you.. Sharmila's emotional post on Father's Day..
అమ్మ ప్రాణం పోస్తే.. ఆ జీవితానికి ఆశ కలిగించేది నాన్న. ఆశయాన్ని నేర్పించేది నాన్న. ఆశలకు, ఆశయానికి మధ్య వారధిలా నిలిచేది నాన్న. బాధ్యత ద్వారానే ప్రేమను చూపిస్తాడు తండ్రి. అందుకే చరిత్రలో గుర్తింపులేని పాత్రగా మిగిలిపోయాడు. అలాంటి తండ్రులందరికీ.. తమ ప్రేమను చాటి చెప్తూ.. జనాలు ఫాదర్స్ డే విషెస్ చెప్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు.. తండ్రి మీద తమ ప్రేమ స్థాయి ఏంటో పోస్టులు, ఫొటోలతో చెప్తున్నారు. వారి తండ్రులను గుర్తుచేసుకుంటున్నారు.
చిరంజీవి (Chiranjeevi), అల్లు అర్జున్ (Allu Arjun) వారి తండ్రుల ఫొటోలను షేర్ చేస్తూ ప్రపంచంలో ఉన్న తండ్రులందరికీ ఫాదర్స్ డే (Father’s Day) శుభాకాంక్షలు అంటూ పోస్టులు పెట్టారు. రాజకీయ నేతలు కూడా ఫాదర్స్ వే విషెస్ చెప్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) తనయ వైఎస్ షర్మిల తన తండ్రిని గుర్తుచేసుకంటూ చేసిన పోస్ట్.. ఇప్పుడు ప్రతీ ఒక్కరిని ఎమోషనల్ చేస్తోంది. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల.. వైఎస్సార్‌తో దిగిన ఓ ఫొటోను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు.
నీ పట్టువదలని పోరాటపటిమను ఆస్తిగా ఇచ్చి ఆగకుండా సాగిపోయేలా తీర్చిదిద్దావ్.. నీ అమూల్యమైన ఆత్మవిశ్వాసాన్ని నాలో నింపి సవాళ్ళను ఎదుర్కొనేలా తయారు చేశావ్.. మనిషిని ప్రేమ, సంస్కారం, కరుణతో గెలవాలనే సూత్రంతో నా వ్యక్తిత్వాన్ని మలిచావ్.. నీ బిడ్డనైనందుకు గర్విస్తున్నా. జనాల కోసం పాటుపడే నీ ఓర్పును, నిబద్ధతను వారసత్వంగా చేసుకుని ముందుకు సాగుతున్నా. నువ్వెక్కడున్నా నీ ఆశీర్వాదం, అనురాగం, మార్గదర్శనం నాతో ఉన్నాయని తలుస్తాను’ అంటూ షర్మిల ట్వీట్‌లో రాసుకొచ్చారు. షర్మిల మాటలు ఇప్పుడు ప్రతీ ఒక్కరిని కదిలిస్తున్నాయ్.
Thank You Pa for always loving me, encouraging me and inspiring me.
Miss you much.
A blessed Father’s Day to every dad ! #HappyFathersDay pic.twitter.com/4cRBNfNSdf— YS Sharmila (@realyssharmila) June 19, 2022