NEGGEDEVARU – NAGARI : రోజాకు భారీ షాక్ తప్పదా.. నగరిలో నెగ్గేదెవరు ?
ఓ వైపు సొంత పార్టీలో అసంతృప్తులు.. మరోవైపు ప్రత్యేకంగా టార్గెట్ చేసిన ప్రత్యర్థులు.. ఇలాంటి పరిణామాల మధ్య నగరి అసెంబ్లీ నియోజకవర్గం ఈసారి ఎన్నికల్లో టాక్ ఆఫ్ ది స్టేట్‌గా మారింది. మంత్రి రోజా.. నగరిలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఓ వైపు సొంత పార్టీలో అసంతృప్తులు.. మరోవైపు ప్రత్యేకంగా టార్గెట్ చేసిన ప్రత్యర్థులు.. ఇలాంటి పరిణామాల మధ్య నగరి అసెంబ్లీ నియోజకవర్గం ఈసారి ఎన్నికల్లో టాక్ ఆఫ్ ది స్టేట్‌గా మారింది. మంత్రి రోజా.. నగరిలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఈసారి నగరిలో గెలవడానికి రోజా అమలు చేసినా ప్లాన్ ఏంటి.. మంత్రిని కట్టడి చేయడానికి టీడీపీ నేత గాలి భానుప్రకాష్ యాక్షన్ ప్లాన్ వర్కౌట్ అయిందా.. పోల్ మెనేజ్‌మెంట్‌లో సక్సెస్ అయింది ఎవరు.. వెనకపడిందెవరు.. గతేడాది పరాభవానికి గాలి భానుప్రకాశ్… ఈసారి రివేంజ్ తీర్చుకుంటారా.. నగరిలో నెగ్గేదెవరు..
చిత్తూరు జిల్లా నగరిలో.. రోజా మూడోసారి గెలుస్తారా లేదా అన్నది తీవ్ర చర్చకు దారి తీస్తోంది. వరుసగా రెండుసార్లు గెలిచి మంత్రి పదవి చేపట్టిన రోజా… హ్యాట్రిక్ కొడతారా లేదా అన్నది ఆసక్తి రేపుతోంది. దూకుడుగా వెళ్లిన మంత్రి.. సొంత పార్టీ నేతల నుంచే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందనే టాక్ ఉంది. 2019లో స్వల్ప మెజారిటీ రోజా గెలిచారు. కేవలం 2వేల 708 ఓట్ల మెజారిటీతో బయటపడ్డారు. 2014లోనూ ఇంతే. అప్పుడు మెజారిటీ 858 ఓట్లు మాత్రమే. ఐతే ప్రస్తుతం రికార్డు స్ధాయిలో పోలింగ్ నమోదయింది. దీంతో ఇది ఎవరికి ఫేవర్ చేస్తుంది.. ఎవరిని గెలుపు తీరాలకు చేరుస్తుందనే మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.
నగరిలో మొత్తం 2లక్షల 2వేల 574 ఉంటే…లక్షా 76వేల 399 మంది.. తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 87.08 శాతం పోలింగ్ నమోదయింది ఈసారి. 2014 ఎన్నికల్లో 85.25 శాతం, 2019 ఎన్నికల్లో 87శాతం పోలింగ్ పోలింగ్ జరిగింది. ఐతే నగరి రాజకీయాలు మొదటి నుంచి ఆసక్తికకరంగానే ఉన్నాయ్. రోజాకు విపక్షాల నుంచి ఎలాంటి సమస్యలు రాలేదు. సొంత పార్టీ నేతల నుంచే ఇబ్బందులన్నీ. నియోజకవర్గంలో వైసీపీ మూడు నాలుగు ముక్కలైంది. గత రెండు ఎన్నికల్లో రోజాను గెలిపించడానికి కష్టపడిన వాళ్లే.. ఇప్పుడు ఆమెపై తిరుగుబాటు చేశారు. ప్రతి మండలంలోనూ సొంత పార్టీ నేతలు. రోజాకు వ్యతిరేకంగా పని చేశారు. నాలుగేళ్లుగా రోజా నాయకత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికల ముందు అమెకు సీటు రాకుండా చేస్తామని సవాల్ విసిరారు.
ఈసారి ఎలా గెలుస్తుందో చూస్తామంటూ శ్రీశైలం ట్రస్టు చైర్మన్ చక్రపాణి రెడ్డి సవాల్ విసిరారు. సీఎం సభలో కేజీ శాంతి, రోజా చేతులు కలిపినా… ఫలితం లేకుండా పోయింది. రోజాపై బహిరంగంగా ఆరోపణలు గుప్పించింది అసమ్మతి వర్గం. ఏకంగా మీడియా సమావేశాలు పెట్టి.. విమర్శలు చేయడం ఆమెకు మైనస్‌గా మారింది. మంత్రి రోజా 70 లక్షలు తీసుకున్నారంటూ వైసీపీ కౌన్సిలర్ భువనేశ్వరి ఆరోపించారు. ఆయా మండలాల్లో కొత్త నాయకత్వాన్ని పోత్సహించిన రోజా… ప్రభుత్వ పథకాలను జనాల్లోకి సక్సెస్‌ఫుల్‌గా తీసుకెళ్లారు. కీలకమైన సమయంలో పోలింగ్ ముందు సీఎం జగన్ పర్యటన… నగరి వైసీపీకి బూస్టర్ డోస్‌గా పనిచేసిందని ఆ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. పోల్ మేనేజ్‌మెంట్‌లోనూ… రోజా ముందున్నారనే టాక్ నగరిలో నడుస్తోంది. అయితే కీలకమైన నేతలు సరైన టైంలో వదలి వెళ్లడం.. పార్టీకి కోలుకోలేని దెబ్బ కొట్టిందనే ప్రచారం సాగుతోంది. జగన్ పరిపాలనా వల్లే ఓటర్లు భారీగా తరలివచ్చారని… ఇదంతా పాజిటివ్ ఓటింగ్ అనే భావిస్తున్నారు రోజా.
ఇక టీడీపీ కూడా తగ్గేదే లే అన్నట్లు నగరిలో దూసుకుపోయింది. టీడీపీ ఇంచార్జి గాలి భానుప్రకాశ్… రాజకీయంగా రోజాపై విమర్శలు సంధిస్తూనే… బాదుడే బాదుడు కార్యక్రమం ద్వారా నగరిని పలుమార్లు చూట్టేశారు. గాలేరు నగరి పనులు, చెరుకు రైతులు బకాయిలు వంటి అంశాలను జనాల్లోకి తీసుకెళ్లింది టీడీపీ. వైసీపీలోని అసంతృప్తిని గమనించిన భానుప్రకాశ్… సరైన టైంలో చక్రం తిప్పారు. ఎన్నో ఏళ్లుగా వైసీపీలో కీలకంగా ఉన్న నేతలను టీడీపీలోకి చేర్చుకోవడంలో సక్సెస్ అయ్యారు. గాలి భానుప్రకాశ్ గేమ్ ప్లాన్‌కు… జిల్లా నేతలు షాకయ్యారు.
ఇది నగరిలో టీడీపీ కేడర్‌కు మరింత బూస్ట్ ఇచ్చిందని అంటున్నారు. ఐతే పోల్ మేనేజ్‌మెంట్‌లో వెనుకపడ్డారనే ప్రచారం జరుగుతోంది. తాజా రాజకీయ పరిస్థితులు, రోజాపై ఉన్న వ్యతిరేకతో పోలిస్తే అదేం అంతా పెద్ద విషయం కాదని టీడీపీ నేతలు భావిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటర్లు కసితో ఓట్లు వేశారని.. ఇదంతా గాలి భానుప్రకాశ్ గ్రౌండ్ లెవెల్‌లో ఎఫర్ట్ పెట్టడం వల్లే సాధ్యమైందని అంటున్నారు. పోలింగ్ భారీగా నమోదవడంతో.. అది తమకే అనుకూలం అని వైసీపీ, టీడీపీ నేతలు లెక్కలు వేస్తున్నారు. మరి నగరి ఓటర్లు ఎవరికి జై కొట్టారో తెలియాలంటే… ఫలితాల వరకు ఆగాల్సిందే….