TDP ZERO : 41యేళ్ళ టీడీపీ చరిత్రలో.. రాజ్యసభలో జీరో

ఆంధ్రప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ (Andhra Pradesh Elections), లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ ఎన్ని సీట్లు సాధిస్తుందో... అధికారం చేపడుతుందో లేదో తెలియదు గానీ... ఇప్పుడు రాజ్యసభలో మాత్రం టీడీపీ తీవ్ర అవమానం ఎదుర్కుంటోంది. ఏపీలో జరిగే 3 రాజ్యసభ ఎన్నిక (Lok Sabha Elections) ల్లో...సరైన బలం లేకపోవడంతో టీడీపీ (TDP)తమ అభ్యర్థిని పోటీకి నిలబెట్టడం లేదు. దాంతో 41యేళ్ళ చరిత్రలో మొదటిసారిగా రాజ్యసభలో ఆ పార్టీకి సభ్యుడు లేని పరిస్థితి ఏర్పడుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 12, 2024 | 11:46 AMLast Updated on: Feb 12, 2024 | 11:46 AM

In 41 Years Of Tdp History Zero In Rajya Sabha

ఆంధ్రప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ (Andhra Pradesh Elections), లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ ఎన్ని సీట్లు సాధిస్తుందో… అధికారం చేపడుతుందో లేదో తెలియదు గానీ… ఇప్పుడు రాజ్యసభలో మాత్రం టీడీపీ తీవ్ర అవమానం ఎదుర్కుంటోంది. ఏపీలో జరిగే 3 రాజ్యసభ ఎన్నిక (Lok Sabha Elections) ల్లో…సరైన బలం లేకపోవడంతో టీడీపీ (TDP)తమ అభ్యర్థిని పోటీకి నిలబెట్టడం లేదు. దాంతో 41యేళ్ళ చరిత్రలో మొదటిసారిగా రాజ్యసభలో ఆ పార్టీకి సభ్యుడు లేని పరిస్థితి ఏర్పడుతోంది.

ప్రస్తుతం రాజ్యసభలో ఉన్న టీడీపీకి చెందిన కనకమేడల రవీంద్ర కుమార్ పదవీ కాలం ఏప్రిల్ 2తో ముగుస్తోంది. ఇప్పుడు ఆయన ఒక్కడే తెలుగుదేశం నుంచి రాజ్యసభలో ఉన్న సభ్యుడు. ఏపీ నుంచి 3 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటిల్లో పోటీ చేయడానికి సరిపడినంతమంది సభ్యులు టీడీపీకి లేరు. దాంతో ఈ మూడు స్థానాలు కూడా వైసీపీకే దక్కుతాయి. ఆ పార్టీ ముగ్గురు అభ్యర్థులను కూడా ప్రకటించింది. వైసీపీ రెబల్స్ పై ఆశలు పెట్టుకొని ఒక్కరినైనా రాజ్యసభ రేసులో నిలబెట్టాలని టీడీపీ అధిష్టానం అనుకుంది. కానీ అది వర్కవుట్ అయ్యే ఛాన్స్ లేకపోవడంతో వెనక్కి తగ్గింది.

2019 ఎన్నికలకు ముందు రాజ్యసభలో YSR సీపీకి ఇద్దరు సభ్యులు ఉంటే… టీడీపీకి 9 మంది ఉన్నారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాల్లో గెలిచింది. టీడీపీకి 23 మాత్రమే దక్కాయి. గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదంతో ఆ సంఖ్య 22కు తగ్గింది. జనసేన నుంచి గెలిచిన ఒకే ఒక్క అభ్యర్థి YCP కి మద్దతు ప్రకటించారు. దాంతో ఎటు చూసినా… టీడీపీకి బలం లేకుండా పోయింది.

ఏపీకి మొత్తం 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఒక్క సీటు గెలుచుకోడానికి 44 మంది ఎమ్మెల్యేలు అవసరం. ఇప్పుడు మూడు సీట్లతో రాజ్యసభలో వైసీపీ బలం 11కు చేరుతుంది. అంటే మొత్తం 11కి 11 సీట్లు వైసీపీ ఖాతాలో పడిపోతున్నాయి. దాంతో టీడీపీకి రాజ్యసభలో అసలు ప్రాతినిధ్యమే లేకుండా పోతోంది. 1983లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి 41 యేళ్ళల్లో ఇలాంటి పరిస్థితి ఎదురవడం ఇదే మొదటిసారి. ఒకవేళ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ,జనసేన (TDP, Jana Sena)కూటమి అధికారంలోకి వస్తే… అప్పుడు 2025 జులై, ఆగస్టులో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి అవకాశం ఉంటుంది. తమ అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకోవచ్చు. కానీ 2025 దాకా పెద్దల సభలో తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం లేనట్టే. ఇంకా ఏడాదికు పైగా టీడీపీకి వెయిటింగ్ తప్పదు.