Mega Family : మెగా ఫ్యామిలీలో.. పిఠాపురం పవర్ ఫైట్

పిఠాపురం (Pithapuram) లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ వెంటే మెగా ఫ్యామిలీ అంతా నడిచింది. మెగా హీరోలంతా ఆయన కోసం క్యాంపెయిన్ చేశారు. కానీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం తన రూటే సెపరేట్ అంటూ నంద్యాలకు వెళ్లాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 16, 2024 | 06:00 PMLast Updated on: May 16, 2024 | 6:00 PM

In Mega Family Pithapuram Power Fight

 

 

 

పిఠాపురం (Pithapuram) లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ వెంటే మెగా ఫ్యామిలీ అంతా నడిచింది. మెగా హీరోలంతా ఆయన కోసం క్యాంపెయిన్ చేశారు. కానీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం తన రూటే సెపరేట్ అంటూ నంద్యాలకు వెళ్లాడు. పవన్ కు ట్వీట్ తో సపోర్ట్ చేసి…స్నేహితుడు, వైసీపీ (YCP) అభ్యర్థి శిల్పా రవికోసం నేరుగా ప్రచారంలోకి దిగారు. ఇది మెగా ఫ్యామిలీలో చిచ్చురేపింది. అల్లు అర్జున్ (Allu Arjun) ని టార్గెట్ చేస్తూ నాగబాబు చేసిన ట్వీట్ అల్లు మెగా ఫ్యామిలీ మధ్య చిచ్చు రేపింది.

మెగా ఫ్యామిలీ (Mega Family) అంతా పవన్ వైపు ఉంటే… అల్లు అర్జున్ (Allu Arjun) నంద్యాలకు వెళ్లి… వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేసి మెగా ఫ్యామిలీలో మంటలు రేపాడు. మామకి ట్వీట్ తో సరిపెట్టి… స్నేహితుడి కోసం నంద్యాల వెళ్లి రావడం హాట్ టాపిక్ అయింది. ఈసారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని సర్వశక్తులూ ఒడ్డుతున్నారు పవన్. నాగబాబు కుటుంబం సహా మెగా మేనల్లుళ్లు నేరుగా ప్రచారం చేశారు. సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ కూడా పిఠాపురం వెళ్ళారు. మెగాస్టార్ చిరంజీవి ప్రచారానికి రాకపోయినా పవన్ కల్యాణ్ ని గెలిపించాలని వీడియో సందేశమిచ్చారు. అంతేకాదు జనసేనకు ఐదు కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు.
బైట్ చిరంజీవి వీడియో బైట్

రామ్ చరణ్(Ram Charan), తల్లి సురేఖ ప్రచారం చివరి రోజు పిఠాపురం వచ్చారు. కుక్కుటేశ్వరస్వామిని దర్శించుకొని పవన్‌ (Pawan Kalyan) ను కలిసి సపోర్ట్ చేశారు. వీళ్ళతో అల్లు అరవింద్‌ కూడా ఉన్నారు. బన్నీ నంద్యాల వెళ్లడం మెగా ఫ్యామిలీకి, జనసైనికులకీ నచ్చలేదు. అల్లు అర్జున్ ను మెగా ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. పోలింగ్‌ ముగిసిన కొద్దిగంటల్లోనే నాగబాబు చేసిన ట్వీట్‌ దుమారం రేపింది. మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైనా… పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే…అంటూ ట్వీట్ చేశారు. వైసీపీ వాళ్ళతో చేరి ప్రమోట్ చేయడం ఎక్కడి న్యాయమని నాగబాబు ఇన్ డైరెక్ట్‌గా ప్రశ్నించారు. ఈ ట్వీట్ అల్లు అర్జున్‌ను ఉద్దేశించి చేసిందే. నాగబాబు వేసిన ట్వీట్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని మరింత రెచ్చగొట్టేలా ఉంది. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాగబాబు ఆఫీసు మాత్రం… పార్టీలో ఉంటూ వ్యతిరేకంగా పనిచేసిన వారిని ఉద్దేశించిన ట్వీట్ అని అంటోంది. అల్లు అర్జున్ తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదనీ… అన్ని పార్టీలు ఒక్కటే వివరణ ఇచ్చాడు. నా అనే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా, లేకపోయినా వ్యక్తిగతంగా మద్దతు ఉంటుందని స్పష్టం చేశాడు.

అల్లు అరవింద్ కూడా డ్యామేజ్ కంట్రోల్ కు ప్రయత్నించాడు. సురేఖ, రామ్‌చరణ్‌ మాత్రమే పిఠాపురం వెళ్తున్నారని తెలిపారు. కానీ ఆయన కూడా వారి వెంట వెళ్ళారు. బన్నీ నంద్యాల వెళ్లడంతో చిరు కుటుంబం నుంచి మాట రాకుండా బ్యాలెన్స్‌ చేసేందుకే అరవింద్‌ పిఠాపురం వెళ్లారు. మెగా -అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు ఇప్పుడే కొత్తకాదు. గతంలో ఎన్నోసార్లు బయటపడ్డాయి. అలాంటిదేమీ లేదని రెండు ఫ్యామిలీలు ఖండిస్తున్నా… సైలెంట్ వార్ నడుస్తోందని ప్రచారం ఉంది. ఇది నిజమే అన్నట్లు ప్రీరిలేజ్ ఈవెంట్ లు, ఫంక్షన్లలో విభేదాలు బయటపడ్డాయి. ఎన్ని ఫంక్షన్లు, పండుగలు కలిసి చేసుకున్నా… కలిసే ఉన్నామని ఫొటోలు షేర్‌ చేస్తున్నా… తాజా పరిణామాలతో రెండు కుటుంబాల మధ్య అంతరం పెరిగిందనిపిస్తోంది. పాతతరం మధ్య ఎలాంటి విభేదాల్లేకపోయినా ఈతరం హీరోల మధ్య ఉన్నాయనే టాక్ ఉంది.

సరైనోడు సినిమా దగ్గర నుంచి రెండు కుటుంబాల మధ్య గ్యాప్ పెరిగినట్టు సన్నిహితులు చెబుతున్నారు. మెగా ముద్ర నుంచి బయటపడి స్వీయ అస్తిత్వం కోసం అల్లు అర్జున్ ప్రయత్నించడంతో ఇవి మొదలయ్యాయి. చిరంజీవి సినీ లెగసీకి తమ కుటుంబమే కారణమనే భావన అల్లు ఫ్యామిలీలో ఉంది. మెగా ఫ్యామిలీ ముద్ర కంటే… అల్లు పేరుతో కంటిన్యూ అవ్వాలని బన్నీ భావిస్తున్నాడు. సొంతంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు, అల్లు పేరిట స్టూడియో నిర్మాణంతో తెలుగు సినీ పరిశ్రమలో తన ముద్ర వేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు.
మొదటి నుంచి పవన్‌ కు కూడా దూరంగానే ఉంటున్నాడు అల్లు అర్జున్. ఏఏ క్రియేషన్స్ పెట్టి సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఐకాన్ స్టార్ అని బిరుదు ఇచ్చుకున్నాడు. తనకంటూ సొంత ఐడెంటిటీకీ ఎక్కువగా ప్రయత్నిస్తున్నాడు. పుష్ప హిట్ తర్వాత అది ఎక్కువైంది. నిజానికి ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో బన్నీకి ప్రత్యేక స్థానం తెచ్చింది. జాతీయ ఉత్తమ నటుడు అవార్డు కూడా దక్కింది. దీని తర్వాత మెగా ఫ్యామిలీకీ… అల్లు అర్జున్ కు మధ్య మరింత గ్యాప్ మరింత పెరిగిందనే టాక్ వినిపించింది.

ఈ కట్టే కాలే వరకూ మెగా అభిమానినే అని చెప్పిన బన్నీ…ఆ మధ్య ఓ వేదికపై అల్లు ఆర్మీకి ఎప్పటికీ రుణపడి ఉంటానని విభజించి మాట్లాడారు. అల్లు అర్జున్‌కు ఆర్మీ ప్రారంభమైంది… పుష్పకు నాలుగు సినిమాల ముందు నుంచే. అంతకు ముందు అంతా బన్నీని అభిమానించింది మెగా అభిమానులే అని అర్జున్‌ మరచిపోతున్నాడని మెగా ఫ్యాన్స్‌ గుర్తు చేస్తున్నారు. అల్లు స్టూడియోస్‌ ప్రారంభించినప్పుడు అల్లు అర్జున్‌ కనీసం చిరంజీవి ఫొటోను ఎక్కడా షేర్‌ చేయలేదు. చిరంజీవికి పద్మభూషణ్‌ ప్రకటించినప్పుడు కూడా బన్నీ త్వరగా స్పందించలేదు. అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు వచ్చినప్పుడు మెగా ఫ్యామిలీ సరిగా స్పందించలేదని బన్నీ అభిమానుల ఫీలింగ్. అల్లు కుటుంబానికి చెందిన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో బాలకృష్ణ చేసిన ఇంటర్వ్యూల విషయంలోనూ మెగా ఫ్యామిలీ నొచ్చుకున్నట్టు తెలుస్తోంది. మొదటి ఎపిసోడ్ చిరంజీవితో అని చెప్పి… తర్వాత చివరి నిమిషంలో దాన్ని మార్చేయడం విభేదాలకు కారణమైందని ప్రచారం. ఆ తర్వాత ఆ షోకు పవన్ కళ్యాణ్‌ హాజరైనా చిరంజీవి మాత్రం వెళ్లలేదు.

మెగా ఫ్యామిలీలో పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌కు ఉన్న క్రేజ్‌ వేరు. చిరంజీవి స్టార్‌డమ్‌ను ఆయనెప్పుడో దాటివెళ్ళారంటారు ఫ్యాన్స్. అయినా అన్నయ్య ముందు తమ్ముడిగానే ఉంటారు. ఆ గౌరవాన్ని ఎక్కడా తగ్గించరు. మెగా ఫ్యామిలీలో పవన్ అంటే అందరికీ స్పెషల్ క్రేజ్. మొదట్లో బన్నీ కూడా ప్రేమ చూపేవాడు. కానీ ఆ తర్వాత మావయ్య గురించి మాట్లాడటమే మానేశాడు. ఈ గ్యాప్ రాను రాను పెరుగుతోంది. మెగా, అల్లు ఆడియో ఫంక్లన్లు వేర్వేరుగా సాగుతున్నాయి. అల్లు అర్జున్ డైరెక్ట్ గా పిఠాపురం వచ్చి మద్దతిస్తే అన్నిపార్టీల్లో ఉండే అభిమానులు హర్ట్ అవుతారని భావించడం సహజం. కానీ రామ్ చరణ్ కూడా స్టార్ హీరోనే. అతనికీ అన్ని పార్టీల్లోనూ అభిమానులు ఉన్నారు. అయినా నేరుగా పిఠాపురం వచ్చి పవన్ కు సపోర్ట చేశాడు. అల్లు అర్జున్ నంద్యాలలో శిల్పా రవిచంద్ర ఇంటికి వెళ్ళినప్పుడు. పిఠాపురం ఎందుకు రాలేదనేది మెగా అభిమానుల ప్రశ్న.

అల్లు అర్జున్ – పవన్ కల్యాణ్ మధ్య గతంలో వృత్తిపరమైన గ్యాప్ ఉందంటారు. నిండు సభలో పవన్ గురించి చెప్పాలని ఆయన అభిమానులు పదే పదే గోల చేస్తే… బన్నీ ‘చెప్పను బ్రదర్ ‘ అంటూ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. అప్పటి నుంచి ఈ హీరోల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. అల్లు అర్జున్ తాజా స్టెప్… పుష్ప-2పై ఎఫెక్ట్ పడుతుందని ఫిలింనగర్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది. చెప్పను బ్రదర్ కామెంట్స్‌ తో బన్నీ చిత్రానికి వసూళ్లు పడిపోయాయని ఇప్పటికీ చెబుతారు. ఇప్పుడు కూడా అదే స్థాయిలో ప్రభావం చూపుతుందా అన్న అనుమానాలు వస్తున్నాయి. పవన్-అల్లు అర్జున్ మధ్య ఏ విభేదాలు లేకున్నా.. ఉన్నట్లుగా ప్రచారం జరిగినా, వివాదాలు రేగినా వీరిద్దరూ ఎప్పుడూ స్పందించలేదు. అల్లు అర్జున్ నంద్యాల వెళ్లడం, చరణ్ పిఠాపురం వెళ్లడం కేవలం బంధుత్వాలు, స్నేహ సంబంధాల కోణంలోనే చూడాలే తప్ప పొలిటికల్ చేయొద్దంటారు విశ్లేషకులు.