Shocks to CM Jagan: జగన్ కి షాకుల మీద షాకులు..!

ఆంధ్రప్రదేశ్ లో సిట్టింగ్ (AP sitting MLAs) ఎమ్మెల్యేలను మార్చి డేర్ స్టెప్ తీసుకున్న వైసీపీకి ఆ జిల్లాలో షాకులు తగులుతున్నాయి. సిట్టింగ్‌లు, కొత్త ఇన్ఛార్జ్‌లు నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయిలో ఢీ అంటే ఢీ అంటున్నారు. ఆవులు... ఆవులు పొడుచుకుంటే దూడలు బలయ్యాయని అన్నట్టు వాళ్ళ మధ్య మనం ఎక్కడ నలిగిపోతామోనని వైసీపీ కేడర్‌ చోద్యం చూస్తోంది

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 5, 2024 | 03:35 PMLast Updated on: Feb 05, 2024 | 3:35 PM

In Politics In Ap Before The Election Cm Jagan Is Getting A Lot Of Shocks

ఆంధ్రప్రదేశ్ లో సిట్టింగ్ (AP sitting MLAs) ఎమ్మెల్యేలను మార్చి డేర్ స్టెప్ తీసుకున్న వైసీపీకి ఆ జిల్లాలో షాకులు తగులుతున్నాయి. సిట్టింగ్‌లు, కొత్త ఇన్ఛార్జ్‌లు నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయిలో ఢీ అంటే ఢీ అంటున్నారు. ఆవులు… ఆవులు పొడుచుకుంటే దూడలు బలయ్యాయని అన్నట్టు వాళ్ళ మధ్య మనం ఎక్కడ నలిగిపోతామోనని వైసీపీ కేడర్‌ చోద్యం చూస్తోంది.

వైసీపీ(YCP) అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలు సొంత పార్టీ నేతలకే షాక్ ఇస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలను నిర్మొహమాటంగా మారుస్తూ తీసుకుంటున్న డేర్ స్టెప్ నష్టం చేస్తుందా లేక లాభం చేస్తుందా అన్నది అర్థం కావడం లేదంటున్నాయి పార్టీ వర్గాలు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మూడు స్థానాల్లో మార్పులు, చేర్పులు వైసీపీకి కొత్త సమస్యలను తెస్తున్నాయి. కదిరి, మడకశిర, పెనుకొండ నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవంగా వైసీపీ అధిష్టానం ఈ జిల్లాలో ఆరు స్థానాల్లో మార్పులు చేర్పులు చేసింది. ఇందులో నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వడం లేదని చెప్పేసింది. వీళ్ళల్లో మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి, కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, శింగనమల ఎమ్మెల్యే పద్మావతి, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి (Ramachandra Reddy) ఉన్నారు. టికెట్ ఇవ్వకపోయినా మా ప్రయాణం జగన్ తోనే అని తేల్చి చెప్పేశారు శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి(Sorghum Padmavati), ఆమె భర్త సాంబశివారెడ్డి. ఈ ఒక్క ఎమ్మెల్యే మినహా మిగిలిన ఐదు చోట్ల లొల్లి కనిపిస్తోంది.

రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి టికెట్ లేదన్న కారణంతో పార్టీని విభేదించి గత కొన్ని రోజులుగా దూరంగా ఉంటున్నారు. ఇక మిగిలిన నాలుగు స్థానాల్లో కళ్యాణదుర్గంలో ఉన్న ఉషాశ్రీ చరణ్ ను పెనుకొండకు పంపారు. కళ్యాణదుర్గంకు అనంతపురం ఎంపీ తలారి రంగయ్యను ఇన్చార్జిగా నియమించారు. ఇక్కడ ఏ సమస్య లేదు. కానీ పెనుకొండలో మాత్రం కొత్త వివాదం మొదలైంది. అక్కడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నారాయణను అనంతపురం పార్లమెంటు స్థానానికి ఇన్చార్జిగా నియమించారు. సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఉషాశ్రీ చరణ్ పెనుకొండలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మంత్రి హోదాలో ఆమె పాల్గొంటున్నా… అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే లేకుండా చేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది.. శంకర్ నారాయణను ఎంపీ అభ్యర్థిగా అనంతపురం పంపినా.. ఆయన ఇంకా పెనుకొండ ఎమ్మెల్యేగానే ఉన్నారనీ… అధికారిక కార్యక్రమాలకు మాట వరుసకైనా ఆయన్ని పిలవకపోవడం ఏంటని అంటున్నారు.

అటు మడకశిర విషయానికొస్తే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పేస్వామిని కాదని కొత్త అభ్యర్థి… అందునా ద్వితీయ శ్రేణి నాయకుడు కూడా కానీ లక్క ఈరప్పను తెరపైకి తీసుకువచ్చారు. దీని వెనుక తిప్పేస్వామి వ్యతిరేక వర్గం ఉందన్నది బహిరంగ రహస్యం. అయితే తాను ఎమ్మెల్యేగా ఉండగానే కొన్ని కార్యక్రమాలు.. సమాచారం ఇవ్వకుండా చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట తిప్పేస్వామి. ఒక ఎమ్మెల్యేకు ఇదేనా మీరు ఇచ్చే గౌరవం అంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారిక కార్యక్రమాల్లో ఎమ్మెల్యే తిప్పేస్వామి పాల్గొంటుండగా పార్టీ కార్యక్రమాలను లక్క ఈరప్ప ద్వారా వైసీపీ కీలక నాయకులంతా నిర్వహిస్తున్నారు. ఇటు కదిరి నియోజకవర్గ విషయానికి వస్తే… కదిరిలో డాక్టర్ సిద్ధారెడ్డిని కాదని మైనార్టీ నేత మక్బూల్ ను తీసుకొచ్చారు. అక్కడ అధికారిక కార్యక్రమాల్లో ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పాల్గొంటుండగా పార్టీ కార్యక్రమాలను మక్బూల్‌ నిర్వహిస్తున్నారు.

ఈ ఇద్దరు నేతలు ఒక్కసారి కూడా కలిసి పని చేసిన సందర్భం లేదు. మరోవైపు ఈ పరిస్థితిని సెట్ చేయడానికి కదిరి నియోజకవర్గానికి రీజినల్ కోఆర్డినేటర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వస్తే… అదే రోజు సిద్ధారెడ్డి నియోజకవర్గంలో లేకుండా పోయారు. తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇలా కొత్తగా వచ్చిన ఇన్ఛార్జులకు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఏమాత్రం పొసగడం లేదు. ఇప్పటివరకు ఇన్చార్జిలు, ఎమ్మెల్యేలు కలిసి పాల్గొన్న కార్యక్రమం ఒక్కటి కూడా లేదు… ఈ సమస్యను వైసీపీ అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందన్నది చూడాలి.