Kodali Nani : కొడాలి, వంశీ ఇళ్లపై దాడికి ఆ ఘటనే కారణమా?
ఏపీలో అలా కూటమి అధికారంలోకి వచ్చిందో లేదో ఇలా ప్రతీకార దాడులు మొదలయ్యాయి. వరుస బెట్టి వైసీపీ (YCP) కార్యకర్తలు నాయకుల మీద దాడులు జరుగుతున్నాయి. కార్యకర్తలు మాత్రమే కాదు నాయకుల మీద కూడా దాడులు జరుగుతున్నాయి.

Is that incident the reason for the attack on Kodali and Vamsi's houses?
ఏపీలో అలా కూటమి అధికారంలోకి వచ్చిందో లేదో ఇలా ప్రతీకార దాడులు మొదలయ్యాయి. వరుస బెట్టి వైసీపీ (YCP) కార్యకర్తలు నాయకుల మీద దాడులు జరుగుతున్నాయి. కార్యకర్తలు మాత్రమే కాదు నాయకుల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. టీడీపీ (TDP) అంటేనే తోకతొక్కి పాముళ్ల లేచే కొడాలి నాని (Kodali Nani) వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) ఇళ్లపై వరుస దాడులు జరిగాయి. కొడాలి నాని ఇంటిపై కొందరు వ్యక్తులు కోడిగుడ్లతో దాడి చేశారు. ఇక వంశీ ఇంటి గేట్లు పగలగొట్టే ప్రయత్నం చేశారు. వంశీ ఇంట్లోనే ఉన్నాడన్న ఇన్ఫర్మేషన్ రావడంతో భారీగా యువకులు అక్కడికి చేరుకున్నారు.
దీంతో పోలీసులు వంశీ ఇంటికి సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. అసలు ఈ స్థాయిలో వీళ్లపై టీడీపీ అభిమానులు పగ పెంచుకోడానికి కారణం గతంలో వాళ్లు చంద్రబాబు గురించి చేసిన కామెంట్లే అంటున్నారు విశ్లేషకులు. వైసీపీ ప్రభుత్వంలో నిండు అసెంబ్లీలో వల్లభనేని వంశీ చంద్రబాబును అవమానించేలా మాట్లాడారు. వ్యక్తిగతంగా తిడుతూ చంద్రబాబు సతీమని భువనేశ్వరిని క్యారెక్టర్‌ను కూడా అవమానించారు. ఇద అప్పట్లో రాష్ట్రవ్యాప్తం సంచలనంగా మారింది. మీడియా సాక్షిగా చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోవడంతో టీడీపీ శ్రేణులు రగిలిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కూడా చేశారు. అప్పటి నుంచి సమయం కోసం వెయిట్ చేసిన చంద్రబాబు అభిమానులు ఇప్పుడు తామేంటో చూస్తున్నారు.
అప్పుడు కలిగిన నొప్పికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో టీడీపీ మీద రెచ్చిపోయిన నాయకులు కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొడాలి, వంశీ ఇళ్లపై దాడులు చేస్తున్నారు. యువకులు దాడి చేసిన సమయంలో కొడాలి ఇంట్లో లేరు. కానీ వంశీ మాత్రం ఇంట్లోనే ఉండటంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాదాపు ఏపీ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఇదే సీన్ కనిపిస్తోంది. ఈ దాడులు ఎప్పుడు ఆగుతాయో చూడాలి.