CM Jagan : వైసీపీదే మళ్లీ అధికారమా… జగన్‌ కాన్ఫిడెన్స్ అదేనా ?

ఏపీలో ఎన్నికల (AP Elections) ఫలితాలు ఇంకొన్ని గంటల టైమ్ మాత్రమే ఉంది. పోటీ చేసిన అభ్యర్థులంతా.. టెన్షన్‌తో జూన్‌ 4 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 31, 2024 | 05:00 PMLast Updated on: May 31, 2024 | 5:00 PM

Is Ycp Back In Power Is Jagans Confidence The Same

 

 

ఏపీలో ఎన్నికల (AP Elections) ఫలితాలు ఇంకొన్ని గంటల టైమ్ మాత్రమే ఉంది. పోటీ చేసిన అభ్యర్థులంతా.. టెన్షన్‌తో జూన్‌ 4 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అటు కూటమి, ఇటు వైసీపీ.. ఎవరికి వారు గెలుపు తమదే అని ధీమా వ్యక్తం చేస్తున్నాయ్.

వైసీపీ (YCP) అయితే ఈ విషయంలో ఓ అడుగు ముందే ఉంది. జగన్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది. ఇక జగన్‌ (CM Jagan) చేసిన ట్వీట్ కూడా హాట్‌టాపిక్‌గా మారింది. మరోసారి మనదే ప్రభుత్వం అంటూ.. జగన్ చేసిన ట్వీట్‌తో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. వైసీపీకి, జగన్‌కు ఇంత కాన్ఫిడెన్స్ ఏంటనే డిస్కషన్ మొదలైంది. ఐతే రాష్ట్రంలో 70శాతం మంది జనాలు తమ వైపే ఉన్నారని.. వాళ్లంతా జగనే సీఎం అని ఫిక్స్ అయ్యారని.. వైసీపీ నేతలు ధీమాగా కనిపిస్తున్నారు.

గ్రామీణ ప్రాంత ఓటర్లు అంతా వైసీపీ వైపే ఉన్నారని.. మంచి జరిగితేనే ఓటు వేయండి అనే ప్రచారం జనాల్లోకి బాగా వెళ్లిందని.. పోలింగ్‌ భారీగా పెరగడానికి కారణం అదే అని.. గెలుపు తమదే అని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పైగా మేనిఫెస్టోలో టీడీపీ ప్రకటించిన ప్రతీ పథకం.. వైసీపీని చూసి కాపీ చేసినట్లే ఉన్నాయని.. ఇది జనాలకు అర్థం అయిందని.. అందుకే ఓటుతో సైకిల్ పార్టీకి బుద్ది చెప్పబోతున్నారని.. జూన్‌ 4న కనిపించే సీన్ ఇదే అంటూ.. ఫ్యాన్ పార్టీ నేతలు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ నమ్మకంతోనే.. వాళ్లు తమదే మళ్లీ అధికారం ధీమాగా చెప్తున్నారనే చర్చ జరుగుతోంది.

ఇక అటు జగన్ స్థాయిలో సంక్షేమ పథకాలను అందించిన మరో నేత ఎవరూ లేరని.. పేద, మధ్యతరగతి వర్గాల జనాల జీవితాలను మార్చిన నేత అని.. ఇది జనాలు గుర్తించారని… వైసీపీకి బ్రహ్మరథం పట్టడం ఖాయం అంటున్నారు. తమ ప్రభుత్వ పాలనలో సంక్షేమ పథకాలను పొందిన వాళ్ల ఓట్లతో జగన్ చరిత్ర తిరగరాయనున్నారని అంటున్నారు వైసీపీ నేతలు. ఐతే వైసీపీ నేతలే కాదు.. జగన్ కూడా దాదాపు ఇలాంటి నమ్మకంతోనే ఉన్నట్లు కనిపిస్తున్నారు. మరి జగన్ కాన్ఫిడెన్స్ నిజం అవుతుందా.. జూన్‌ 4 సంచలనాలు చూస్తామా ఏం జరుగుతుంది అని తేలాలంటే.. ఇంకొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే మరి.