YCP SCENE REVERSE : ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు కదరా !

ఏపీలో వైసీపీ ఆఫీసు రాజకీయానికి మాత్రమే పరిమితమా? అసెంబ్లీలో అడ్రెస్ కష్టమే. నిన్నటి దాకా తిరుగులేని అధికారంతో పెత్తనం చెలాయించిన పార్టీకి రేపు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. వైసీపీ కనీసం పది శాతం సీట్లు కూడా సాధించకపోవడంతో ప్రతిపక్ష హోదా దక్కదు. వై నాట్‌ 175 అన్న పార్టీ... పట్టుమని 11 మంది ఎమ్మెల్యేల దగ్గరే ఎలా ఆగిపోయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 6, 2024 | 07:00 PMLast Updated on: Jun 06, 2024 | 7:00 PM

Is Ycp Office In Ap Only Limited To Politics Addressing The Assembly Is Difficult

ఏపీలో వైసీపీ ఆఫీసు రాజకీయానికి మాత్రమే పరిమితమా? అసెంబ్లీలో అడ్రెస్ కష్టమే. నిన్నటి దాకా తిరుగులేని అధికారంతో పెత్తనం చెలాయించిన పార్టీకి రేపు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. వైసీపీ కనీసం పది శాతం సీట్లు కూడా సాధించకపోవడంతో ప్రతిపక్ష హోదా దక్కదు. వై నాట్‌ 175 అన్న పార్టీ… పట్టుమని 11 మంది ఎమ్మెల్యేల దగ్గరే ఎలా ఆగిపోయింది.

ఆధిపత్యం… తిరుగులేని ఆధిపత్యం… అలాంటిలాంటి ఆధిపత్యం కాదు. 2019 ఎన్నికల్లో 151 ఎమ్మెల్యే సీట్లిచ్చి నెత్తిన పెట్టుకున్న ఓటర్లు… సరిగ్గా ఐదేళ్ళు తిరిగేసరికి అక్కడి నుంచి ఎత్తి కింద పడేశారు. ఆ పడేయడం కూడా అలా ఇలా కాదు… నిన్నటి దాకా రాష్ట్రంలో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన పార్టీకి ఇప్పుడు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేశారు. సాధారణంగా ఏ పార్టీకైనా ప్రతిపక్ష హోదా దక్కాలంటే… మొత్తం అసెంబ్లీ సీట్లలో పది శాతం గెల్చుకోవాలి. ఆ లెక్కన ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా రావాలంటే వైసీపీకి కనీసం 18 మంది ఎమ్మెల్యేలు అవసరం. కానీ… ఇప్పుడా పార్టీకి అంత సీన్‌ లేదు. వై నాట్‌ 175 అన్న ఫ్యాన్‌ పార్టీ కేవలం పది సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో ఇక వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేనట్టే. దీన్నే ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు టీడీపీ నాయకులు.

2019లో తమ పార్టీ తరపున 23 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే… నలుగుర్ని లాగేసి, మరో ఇద్దరి కోసం తీవ్రంగా ప్రయత్నించారనీ… ఆ ఇద్దర్ని కూడా లాక్కుని టీడీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కకుండా చేయాలన్న వైసీపీ పెద్దల ప్లాన్‌ వర్కౌట్‌ కాలేదంటున్నారు. కానీ… ఇప్పుడు ఎలాంటి లాగుడు పందేలతో పనిలేకుండానే… డైరెక్ట్‌గా ప్రజలే వైసీపీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేశారని అంటున్నారు టీడీపీ నాయకులు. దేవుడి స్క్రిప్ట్‌ అంటే ఇలాగే ఉంటుందంటూ సెటైరికల్‌గా గతంలో వైసీపీ నేతలు వాడిన మాటల్ని వాళ్ల మీదికే ప్రయోగిస్తోంది టీడీపీ. ఈ లెక్కన ఈసారి ఏపీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం అన్నది లేనట్టే. ఇప్పుడు టీడీపీ తర్వాత అతిపెద్ద పార్టీ జనసేన. 21 సీట్లు గెల్చుకుని వంద శాతం స్ట్రైక్‌ రేట్‌తో కనిపిస్తోంది ఆ పార్టీ. మామూలుగా అయితే… విడివిడిగా పోటీ చేసి.. ఇన్ని సీట్లు గెల్చుకుని ఉంటే…. జనసేనే ప్రధాన ప్రతిపక్షంగా ఉండేది. కానీ… ఇప్పుడు గెలుపు కూటమిలో ఉన్నందున… జనసేన కూడా అధికార పక్షంలో భాగమే. దీంతో రాబోయే ఐదేళ్ళు ఏపీ అసెంబ్లీ సమావేశాలు మెయిన్‌ అపోజిషన్‌ లేకుండానే జరుగుతాయా అన్న చర్చ మొదలైంది.

అదే సమయంలో ఇంతలోనే అంత మార్పు ఎలా అన్న చర్చ కూడా నడుస్తోంది. 151 మంది ఎమ్మెల్యేలతో బలంగా ఉన్న పార్టీ అమాంతం అధ: పాతాళానికి…. అదీ కూడా కనీసం ప్రతిపక్ష హోదా దక్కించుకోలేని స్థితికి ఎలా దిగజారిందంటూ రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు పొలిటికల్‌ పండిట్స్‌. మాట తప్పను, మడమ తిప్పను, ఒక్క ఛాన్స్‌ ఇవ్వండని నాడు అడిగితే ఓకేనంటూ మీటలు నొక్కేసిన ఓటర్లు… ఈ ఐదేళ్ళలో జగన్‌ బటన్‌ నొక్కుళ్ళను పెద్దగా పట్టించుకోలేదా? సంక్షేమ పథకాల ఛాంపియన్‌గా వైసీపీ పదే పదే అభివర్ణించుకున్నా… ఆ సంగతిని జనం సీరియస్ గా తీసుకోలేదా? పథకాల లబ్దిదారులంతా మా ఓటర్లేనని పార్టీ పెద్దలు వేసుకున్న అంచనాలు తల్లకిందులయ్యాయా? వెళ్ళిన ప్రతి చోటా… నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలంటూ జగన్‌ గొంతు చించుకుని చెప్పినా…. అవతలి వాళ్ళు అలా ఫీలవలేదా? లాంటి రకరకాల ప్రశ్నలకు సమాధానాలు వెదికే పనిలో బిజీగా ఉన్నారు రాజకీయ పరిశీలకులు.

ఇంకా చెప్పాలంటే… ఇప్పటిదాకా ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా ఏ ప్రధాన పార్టీకీ ఇంతటి దారుణ పరాభవం ఎదురవలేదు. ముందు ఎన్నికల్లో ఆకాశమంత ఎత్తున కనబడి, ఐదేళ్ళలోనే అధ:పాతాళానికి పడిపోయిన సందర్భాల్లేవు. ఎన్టీఆర్‌ హయాంలో ఒకసారి టీడీపీ ల్యాండ్‌ స్లైడ్‌ విక్టరీ సాధించి…. ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయినా… అది ఈ స్థాయి ఓటమి మాత్రం కాదు. 1985లో 250 అసెంబ్లీ సీట్లలో పోటీ చేసింది టీడీపీ. నాడు 202 సీట్లలో గెలిచి తిరుగులేదనిపించుకుంది. కానీ… అదే పార్టీ తర్వాత వచ్చిన 1989 ఎలక్షన్స్‌లో 74 సీట్లకే పరిమితమైంది. ముందు టర్మ్‌లో అధికారంలో ఉన్న పార్టీకి ఆ తర్వాతి ఎలక్షన్స్‌లో ప్రతిపక్ష హోదా లేకుండా పోవడం మాత్రం ఇదే మొదటిసారి. నిజానికి ప్రతిపక్ష హోదా ఇచ్చినా కూడా జగన్, పెద్ది రెడ్డి తప్ప వైసీపీ ఎమ్మెల్యేల్లో గట్టిగా మాట్లాడేవాళ్ళే కరువయ్యారు.