Telangana – Andhra Pradesh : తెలుగు రాష్ట్రాలు విడిపోయి పదేళ్లు పూర్తి.. ఇక గుడ్ బై హైదరాబాద్..!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (Andhra Pradesh) ... ఏపీ, తెలంగాణ (Telangana) విడిపోయి ఆదివారంతో పదేళ్లు అవుతుంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (Andhra Pradesh) … ఏపీ, తెలంగాణ (Telangana) విడిపోయి ఆదివారంతో పదేళ్లు అవుతుంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది. అయిన చట్టం ప్రకారం విడిపోయిన రెండు తెలుగు రాష్ట్రాలకు హైదరాబాద్ రాజధానిగా కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వాలు (Central Government) తేల్చి చెప్పాయి.
2024 జూన్ 2 నాటికి తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ (Telangana – Andhra Pradesh) విడిపోయి పదేళ్లు పూర్తి అవ్వడంతో.. ఆ గడువు పొడిగిస్తారా? లేదా? అనే అంశంపై ప్రస్తుతం చర్చ జరుగుతున్నది. ఇక దీంతో చట్ట ప్రకారం హైదరాబాద్ తోపాటు తెలంగాణతో ఆంధ్రప్రదేశకు ఉన్న రుణానుబంధం ‘సాంకేతికంగా, చట్టపరంగా’ పూర్తిగా తెగిపోతోంది. కానీ, విభజన చట్టంలోని షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్న రూ. వేల కోట్ల విలువైన ఆస్తుల పంపకాలు ఇంకా జరగలేదు. హైదరాబాద్ లో ఏపీ ఆధీనంలో ఉన్న భవనాలన్నింటినీ తెలంగాణకు అప్పగించారు. ఇక సోమవారం నుంచి తెలంగాణలో ఉన్న ఏపీ ఆస్తులన్నీ కూడా తెలంగాణ ఆధీనంలోకి వెళ్లిపోతాయి. ఇకపై హైదరాబాద్ రాజధానిపై ఏపీకి ఎలాంటి హక్కులు ఉండబోవు.
Suresh SSM