AP Deputy CM : ఆపద అంటే అరక్షణంలో వాలిపోతా.. ఇదీ సార్ పవన్ అంటే..
పవర్ కోసం కాదు ప్రశ్నించడం కోసమే పార్టీ అని.. జనంలో పుట్టిన పార్టీ, జనం పార్టీ అని.. జనసేన పార్టీ పెట్టిన పవన్.. ఇప్పుడు ఏపీకి డిప్యూటీ సీఎం అయ్యారు.

పవర్ కోసం కాదు ప్రశ్నించడం కోసమే పార్టీ అని.. జనంలో పుట్టిన పార్టీ, జనం పార్టీ అని.. జనసేన పార్టీ పెట్టిన పవన్.. ఇప్పుడు ఏపీకి డిప్యూటీ సీఎం అయ్యారు. జనం కోసం జనసేన ఏం చేస్తుందో.. ఏం చేయగలదో.. జనసేనాని ప్రూవ్ చేస్తున్నారు. ఎవరు.. ఎక్కడి నుంచి అని కాదు.. అయ్యా కష్టం అంటే చాలు.. క్షణంలో వాలిపోతున్నారు. ఆ కష్టం తీరుస్తున్నారు. ఓ ముసలి అవ్వకు మాట ఇచ్చానని.. తాగునీటి సరఫరా శాఖ మంత్రిత్వ శాఖ తీసుకున్న పవన్.. ఇప్పుడు తన మార్క్ పాలన పరిచయం చేస్తున్నారు. వచ్చిన ప్రతీ దరఖాస్తును, అర్జీని.. తానే స్వయంగా పరీశిస్తున్నారు.
అప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. అలాంటి సంఘటనే జరిగిందిప్పుడు ! జనసేన ఆఫీస్‌కు వందలాది వినతులు వచ్చాయ్. ఆ అర్జీలను పవన్ స్వయంగా పరిశీలించారు. తిరుపతి జిల్లా వెంకటగిరి బాధితుల నుంచి వచ్చిన లేఖ విషయంలో పవన్ వ్యవహరించిన తీరు.. ఇప్పుడు ప్రతీ ఒక్కరి మనసు గెలుచుకుంటోంది. వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీ, 6వ వార్డు, ఫస్ట్ లేన్ నుంచి మహిళలు, వృద్ధులు.. తమ సమస్య తెలుపుతూ పవన్‌కు ఓ అర్జీ పెట్టుకున్నారు. ముఠాలుగా ఏర్పడిన కొందరు యువకులు బైక్స్‌పై ప్రమాదకరంగా, వేగంగా వీధుల్లో తిరుగుతూ.. విద్యార్థినులు, యువతులను, మహిళలను వేధిస్తున్నారని, వృద్ధులను భయపెడుతున్నారని ఆ లేఖలో పవన్‌కు ఫిర్యాదు చేశారు.
అమ్మాయిల ఫొటోలు తీసి ఇంటర్నెట్‌లో పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని… నిందితుల ఫొటోలను, వాహనాల నంబర్లను కూడా ఫిర్యాదుకు జతచేసి పంపించారు. ఆపద అంటే అరక్షణం కూడా చూస్తూ ఊరుకోను అని పదేపదే చెప్పే పవన్.. స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుకు కాల్ చేసి ఫోన్‌లో మాట్లాడారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని.. అలాంటి ఆకతాయిలు రోడ్డు మీద తిరగాలంటే వణికిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. పవన్ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. ఇదీ సార్ పవన్ అంటే.. పవన్‌కు ఇదీ సార్ జనాలంటే అంటూ.. వీడియోలు షేర్ చేస్తున్నారు.