AP police : పాపం.. ఏపీ పోలీసులు.. వాళ్ల బతుకులేంటి.. ఇలా అయ్యాయ్‌..

కనిపించే మూడు సింహాలు సత్యం, న్యాయం, ధర్మానికి ప్రతీకలయితే.. కనిపించని నాలుగో సింహమే.. పోలీస్. అలాంటి పోలీసులు ఇప్పుడు కనిపించాలన్న ఆలోచిస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 24, 2024 | 11:16 AMLast Updated on: May 24, 2024 | 11:16 AM

Its A Pity Ap Police What About Their Lives This Happened

కనిపించే మూడు సింహాలు సత్యం, న్యాయం, ధర్మానికి ప్రతీకలయితే.. కనిపించని నాలుగో సింహమే.. పోలీస్. అలాంటి పోలీసులు ఇప్పుడు కనిపించాలన్న ఆలోచిస్తున్నారు. ఏపీలో మరీ దారుణంగా తయారయ్యాయ్ వాళ్ల జీవితాలు. అప్పుడు అలా అన్నారు.. ఇప్పుడు ఇలా అంటున్నారు.. ఎటూ పోయి నింద మోయాల్సింది.. విచారణలు చేయించుకోవాల్సింది.. ఏపీ పోలీసుల వంతే అయింది పాపం! ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలు అని పోలింగ్ వరకు అన్నారు.. ప్రతిపక్షాల వంత పాడుతున్నారని పోలింగ్ తర్వాత అంటున్నారు… వాళ్ల ఆలోచనలు, వాళ్ల బతుకులు చూస్తే అదోలా ఉంది పాపం అంటూ జాలి పడుతున్నారు.

ఏపీ పోలీసులను చూసి జనాలు. ఒక్క ముక్కలో చెప్పాలంటే హీనంగా మారిపోయాయ్ వారి జీవితాలు. పోలింగ్ తర్వాత ఏపీలో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయ్. అధికార, విపక్ష పార్టీ కార్యకర్తల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయ్. అరెస్ట్‌లు, చేజింగ్‌లు.. సినీ ఫక్కీని తలపిస్తున్నాయ్ ఏపీ రాజకీయాలు. పార్టీలు బాగానే ఉన్నాయ్‌.. ప్రతినిధులు బాగానే ఉన్నారు.. ఎటూ పోయి నలిగిపోతోంది.. నానా మాటలు పడుతోంది పోలీసులు మాత్రమే ! అటు ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయ్.. ఇటు ప్రతిపక్షాలు బెదిరిస్తున్నాయ్. ఏం చేయాలో తెలియక.. ఎలా చేయాలో అర్థం కాక.. పాపం పోలీసులు నగిలిపోతున్నారు.. లోలోపల రగిలిపోతున్నారు. కుటుంబాలకు దూరంగా ఉండి విధులు చేసి.. ఏ పార్టీ నాయకుడో, కార్యకర్తో చేసిన రచ్చకు బాధ్యలుగా మారుతూ.. బాధ్యత మోస్తూ.. అవమానాలు భరిస్తున్నారు ఏపీ పోలీసులు.

చివరికి వారి మీద సిట్ వేసే పరిస్థితులు వచ్చాయంటే.. పోలీసుల మనో వేధన, మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పెద్ద నేరాలు, కుంభకోణాలు జరిగినప్పుడు.. సాధారణంగా పోలీసులతో సిట్‌ ఏర్పాటుచేస్తారు. పోలీసులపైనే సిట్‌ను వేయడం ఏపీ చరిత్రలోనే అరుదైన పరిస్థితి. ఇదే పెద్ద అవమానం, బాధ అంటే.. ఈ పరిస్థితి రావడానికి పోలీస్‌ శాఖ స్వయంగా చేసుకున్న తప్పే అని వేలెత్తి చూపించడం.. ఖాకీలకు పాపం నిద్రలేకుండా చేస్తోంది. అధికార వైసీపీ చట్టాన్ని ఫాలో అవుతున్నారని విపక్ష నేతలు అంటారు.. కేంద్రంలో అండ చూసుకొని విపక్షాలకు వంత పాడుతున్నాయని వైసీపీ అంటుంది. ఎటూ పోయి కేరక్టర్ లేనట్లు మిగిలిపోతుంది.. అమాయకంగా బాధ పడుతోంది పోలీసులే ! ఏ పార్టీది తప్పు.. ఏ పార్టీది కరెక్ట్ అన్న సంగతి ఎలా ఉన్నా.. మాటలు పడుతోంది.. అవమానాలు ఎదుర్కొంటోంది ఇప్పుడు పోలీసులే పాపం.

ఎన్నికలకు నెలల ముందు నుంచి కుటుంబాన్ని వదిలి డ్యూటీలు చేసిన పోలీసులపై విచారణకు ఆదేశాలు జారీ చేయడం అంటే.. దానికి మించిన అవమానం ఉండదు పాపం అనే చర్చ జరుగుతోంది. పల్నాడు, తిరుపతి, అనంతపురం ఎస్పీలు.. కొందరు పోలీసు అధికారులు, పల్నాడు కలెక్టరుపై సీఈసీ వేటు వేసింది. వీరిలో కొందరిని బదిలీపై పంపితే, మరికొందరిని ఏకంగా సస్పెండ్‌ చేసింది. ఫెయిల్ అయ్యారా.. పార్టీల ఒత్తిడితో ఫెయిల్ అయ్యే పరిస్థితులు వచ్చాయా అన్న సంగతి పక్కనపెడితే.. ఎండ్ ఆఫ్ ది డే దోషిగా నిల్చుంటుంది ఏపీ పోలీసులు మాత్రమే. మింగమంటే వాళ్లకు.. వదలమంటే వీళ్లకు అనే పరిస్థితుల మధ్య.. డ్యూటీ చేస్తూ చివరికి మాటలు పడుతూ.. అమాయకంగా రోజులు గడిపేస్తున్నాడు ఏపీ పోలీసన్నా అంటూ.. సోషల్ మీడియాలో జాలిపడుతున్నారు చాలామంది.